# what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public

- Link: https://amaravathiteacher.com/what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public/
- Published: 2020-03-23T10:22:29+05:30
- Author: amaravathiteacher

## **what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public**

### **లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు చేయదగినవి.. చేయకూడని పనులివే…**

### **కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. **

### **ఈ క్రమంలో లాక్ డౌన్ అంటే ఏంటి? ఆ సమయంలో ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.**

### **రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. **

### **కరోనా వైరస్‌‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. **

### **ఈ క్రమంలో అసలు లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు ఏం చేయొచ్చు? **

### **ఏం చేయకూడదని అనుమానం చాలా మందిలో కలుగుతోంది. అలాగే, లాక్ డౌన్ సమయంలో అన్నీ మూసేస్తే బతికేదెలా అనే సహజసిద్ధమైన సందేహాలు కూడా ఉంటాయి. **

### **ఈ క్రమంలో అసలు లాక్ డౌన్ అంటే ఏంటి? ఆ సమయంలో ప్రజలు ఏం చేయొచ్చు? **

### **ఏం చేయకూడదనే అంశాలు తెలుసుకుందాం.**

### **1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. అంటే, మొదటగా అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసేస్తారు. **

### **ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దులకు అవతలే నిలిపివేస్తారు. **

### **కేవలం అత్యవసరం అయినవి మాత్రమే (పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు, వైద్య సేవలు.. వగైరా) అనుమతి ఉంటుంది. **

### **ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ మార్చి 31 వరకు రద్దు చేసింది.**

### **లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఈ పనులు చేయకూడదు**

 * 
   ### **ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదు.**
   
 * 
   ### **ఎలాంటి ఫంక్షన్లు నిర్వహించకూడదు.**
   
 * 
   ### **ప్రయాణాలు, కుటుంబంతో విహార యాత్రలు నిషేధం**
   
 * 
   ### **బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుంపుగా ఉండకూడదు**
   
 * 
   ### **ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు అస్సలు బయటకు రాకూడదు**
   
 * 
   ### **ప్రజా రవాణా వాహనాలు (బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు మొత్తం బంద్ చేయాలి)**
   
 * 
   ### **వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్, ధియేటర్లు, జిమ్‌లు, ఫంక్షన్ హాళ్లు మూసేయాలి**
   
 * 
   ### **వృద్ధులు, చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపకూడదు.**
   
 * 
   ### **గుళ్లు, మసీదులు, చర్చిలు అన్నీ మూసేయాలని ఆదేశాలు ఉన్నాయి.**
   
 * 
   ### **పెద్దవారి ఇంట్లో పనులు చేసే వారు గడప దాటడం కూడా కష్టమే. వారు ఇళ్ల బయటకు వస్తే పోలీసులు ప్రశ్నిస్తారు.**
   

### **లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఈ పనులు చేయవచ్చు**

 * 
   ### **తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలి**
   
 * 
   ### **అత్యవసరం (మందులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, వగైరా) అయిన వాటి కోసం బయటకు వెళ్లవచ్చు. తెలంగాణలో ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది.**
   
 * 
   ### **అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగులు బయటకు వెళ్లవచ్చు. (విద్యుత్, వైద్యం, మీడియా, టెలికం శాఖ, వగైరా)**
   
 * 
   ### **తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినా ఇతరులకు కనీసం రెండు మీటర్ల దూరం ఉండాలి**
   
 * 
   ### **ఇంటికి వెళ్లిన తర్వాత దుస్తులను వెంటనే ఉతికివేయాలి. ఎండలో ఆరబెట్టాలి.**
   
 * 
   ### **బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు స్నానం చేసేయాలి.**
   
 * 
   ### **బయట నుంచి తీసుకొచ్చిన సరుకుల మీద కూడా శానిటైజేషన్ చేయాలి.**
   
 * 
   ### **పెట్రోల్ బంకులు తెరిచే ఉంటాయి. కావాలంటే వెళ్లి రావొచ్చు.**
   
 * 
   ### **అంతర్జాతీయ విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్‌ తిరుగుతాయి. మీకు టికెట్ ఉంటే బయటకు రావొచ్చు.**
   
 * 
   ### **ఈ కామర్స్ సైట్స్ ద్వారా మీకు కావలసినవి ఆర్డర్ చేసుకోవచ్చు.**
   
 * 
   ### **ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.**
   
 * 
   ### **మీ ఇంట్లో కుక్క ఉంటే, మీరు కావాలనుకుంటే దాన్ని తీసుకుని బయటకు వెళ్లవచ్చు. అయితే, గుంపులుగా కాదు.**
   

### **󠀁[ఇంట్లోనే ఈజీగా శానిటైజర్‌ని తయారు చేయండిలా..](https://amaravathiteacher.com/how-to-prepare-own-hand-sanitizer-step-by-step-all-details/)󠁿**

### **󠀁[దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్‌డౌన్, టెక్నాలజీతో కోవిడ్‌ను గెలిచిందిలా!](https://amaravathiteacher.com/south-korea-corona-test-in-just-7-minutes-no-lock-down-technology-won-carona/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
