# what-is-National-Recruitment-Agency-conduct-common-eligibility-tests

- Link: https://amaravathiteacher.com/what-is-national-recruitment-agency-conduct-common-eligibility-tests/
- Published: 2020-08-21T15:17:05+05:30
- Author: amaravathiteacher

## **what-is-National-Recruitment-Agency-conduct-common-eligibility-tests**

### **నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమిదే**

### ** ఒకే తరహా ఉద్యోగాలకు వేర్వేరు పరీక్షలు ఎందుకు రాయాలి? **

### **వేర్వేరుగా ఫీజులు ఎందుకు చెల్లించాలి? **

### **నిరుద్యోగులకు చాలా ఏళ్లుగా సమాధానం చిక్కని ప్రశ్నలివి. **

### **వీటికి మోదీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేసింది. **

### **ఇకపై ఏ ఉద్యోగానికైనా ఒకే పరీక్ష. ఒకే ఫీజు. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమేంటో తెలుసుకోండి.**

### **నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు మోదీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. **

### **ఈ ఏజెన్సీ ఉద్యోగాలకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. **

### **మోదీ ప్రభుత్వం సంస్కరణల్లో అతిపెద్ద సంస్కరణ ఇది.**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM EXAMS GRAND TEST PAPERS](https://amaravathiteacher.com/jobs/grama-sachivalayam-exams-grand-tests-model-papers/)󠁿**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM FISHARIS ASSISTANT  BITS WITH KEY](https://amaravathiteacher.com/jobs/grama-ward-sachivalayam-exams-2020-village-fisheries-asst-papers-with-key/)󠁿**

### **ప్రస్తుతం నిరుద్యోగులు వేర్వేరు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే వేర్వేరు పరీక్షల్ని రాస్తున్నారు. **

### **చాలావరకు ఉద్యోగాలకు విద్యార్హతలు, సిలబస్ ఒకేలా ఉంటుంది. **

### **కానీ వేర్వేరుగా ఫీజులు చెల్లించి వేర్వేరుగా పరీక్షలు రాస్తున్నారు. **

### **దీని వల్ల డబ్బు, సమయం, శ్రమ వృథా అవుతోంది**

### **మోదీ ప్రభుత్వం దీనికి ఓ పరిష్కారంగా నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వే, ఆర్థిక శాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS నుంచి ప్రతినిధులు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో ఉంటారు**

### **నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ గ్రూప్ బీ, గ్రూప్ సీ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. **

### **దేశంలోని ప్రతీ జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయి. **

### **దీని వల్ల పరీక్షల కోసం నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.**

### ** గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఇది బాగా ఉపయోగపడుతుంది**

### **అందరికీ జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లి పరీక్షలు రాయొచ్చు. **

### **కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలను పెంపొందించుకోవచ్చు. **

### **ముఖ్యంగా యువతులు, మహిళలు తమకు దగ్గర్లో పరీక్ష కేంద్రాలు ఉంటే ఎగ్జామ్ రాసేందుకు ముందుకొస్తారని, దీని వల్ల మహిళలకు మేలు జరిగినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది**

### **ఇక ప్రస్తుతం వేర్వేరు పరీక్షలకు వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. **

### **ఫీజులు కూడా రూ.1,000 వరకు ఉంటుంది. దీంతో పేద విద్యార్థులకు ఈ ఎగ్జామ్ ఫీజులే భారంగా మారింది. **

### **రెండు మూడు పరీక్షలకు ఫీజులు చెల్లించాలంటే పేద విద్యార్థులకు చాలా కష్టమే.**

### **పరీక్ష ఫీజు మాత్రమే కాదు… నగరాల్లో జరిగే ఎగ్జామ్స్‌కు ముందు రోజే వెళ్లడం, ప్రయాణ ఖర్చులు, ఎక్కడో చోట బస చేసేందుకు ఖర్చులు ఇలా ఒక్క పరీక్షకు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఖర్చవుతోంది. **

### **మూడు నాలుగు పరీక్షలు రాయాలంటే ఆర్థికంగా భారమే**

### **కానీ ప్రస్తుతం ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడం వల్ల ఈ భారం చాలావరకు తగ్గుతుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET రాయడానికి మీకు నచ్చిన సెంటర్ ఎంచుకోవచ్చు.**

### ** మీకు నచ్చిన భాషలో ఎగ్జామ్ రాయొచ్చు**

### **నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ టెన్త్, ఇంటర్, డిగ్రీ లెవెల్స్‌లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది.**

### ** ప్రస్తుతం ఈ పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్-RRB, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS నిర్వహిస్తున్నాయి**

### **ఈ సెట్‌లో వచ్చే స్కోర్‌కు మూడేళ్ల వేలిడిటీ ఉంటుంది. అంటే ఆ స్కోర్‌తో ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా దరఖాస్తు చేయొచ్చు. **

### **ఈ స్కోర్ ఆధారంగా స్క్రీనింగ్ ఉంటుంది. **

### **ఆ తర్వాత ఆయా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే టైర్ 2, టైర్ 3 పరీక్షలు రాయాలి.**

### **స్కోర్ పెంచుకోవడానికి ఎన్నిసార్లైనా ఈ టెస్ట్ రాయొచ్చు. ఎక్కువగా వచ్చిన స్కోర్స్‌నే పరిగణలోకి తీసుకుంటారు. **

### **గరిష్ట వయస్సులోపే సెట్ రాయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM JOBS MODEL PAPERS, STUDY MATERIAL & GRAND TEST PAPERS](https://amaravathiteacher.com/grama-ward-sachivalayam-exams-starts-from-september-20th/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
