# WhatsApp-Banking-services-benefits-how-to-create-account

- Link: https://amaravathiteacher.com/whatsapp-banking-services-benefits-how-to-create-account/
- Published: 2019-10-04T18:13:47+05:30
- Author: amaravathiteacher

## **_WhatsApp-Banking-services-benefits-how-to-create-account_**

### **వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు… ఎలా పొందాలో తెలుసుకోండి**

### **వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటం వల్ల వాట్సప్ బ్యాంకింగ్ సురక్షితమే. **

### **మీ అకౌంట్ సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం లేదు. **

### **అయితే మీరు మీ అకౌంట్ నెంబర్లు, పిన్, పాస్‌వర్డ్ లాంటి వివరాలేవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.**

### **వాట్సప్… స్నేహితులు, కుటుంబసభ్యులతో ఛాటింగ్‌కు అడ్డా. **

### **నచ్చిన కొటేషన్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడానికి ఓ ప్లాట్‌ఫామ్. **

### **ఇప్పుడు మీరు వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు కూడా పొందొచ్చు. **

### **బ్యాంకులో మీ అకౌంట్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమైన రియల్‌ టైమ్‌లో తెలుసుకోవచ్చు. **

### **హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా, సారస్వత్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఇప్పటికే వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. ఈ సేవల కోసం బ్యాంకులు అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు. **

### **కస్టమర్లకు వేగంగా సమాచారాన్ని అందివ్వాలన్న ఉద్దేశంతో ఉచితంగానే వాట్సప్‌లో బ్యాంకింగ్ సర్వీసుల్ని అందిస్తున్నాయి. **

### **ఇలా వాట్సప్‌లో అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించడం వల్ల బ్రాంచ్‌లపై, ఫోన్ బ్యాంకింగ్ డివిజన్‌పై పనిభారం కూడా తగ్గుతుంది. అయితే వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు అనేసరికి కస్టమర్లకు అనేక అనుమానాలు రావడం సహజం. **

### **మీరు కూడా వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు ఎలా పొందాలి? ఏఏ సేవలు పొందొచ్చు? **

### **వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలతో లాభనష్టాలేంటీ? తెలుసుకోండి.**

### **WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు పొందండి ఇలా…**

### **వాట్సాప్ బాట పడుతున్న బ్యాంకులు**

### **ఇప్పటికే వాట్సాప్ సేవలు అందిస్తున్న చాలా బ్యాంకులు**

### **మిని స్టేట్‌మెంట్ నుంచి ప్రిఅప్రూవ్డ్ రుణాల వరకు పలు సర్వీసులు**

### **మీరు వాట్సప్‌‌లో బ్యాంకింగ్ సేవలు పొందాలంటే ముందుగా సంబంధిత నెంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. **

### **ఆ నెంబర్‌ను బ్యాంక్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు బ్యాంకులకు వేర్వేరు ఫోన్ నెంబర్లు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. **

### **మీకు వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు కావాలనుకుంటే మిస్డ్ కాల్ ఇవ్వడం తప్పనిసరి. మిస్డ్ కాల్ ద్వారా సేవలు పొందేందుకు మీరు సమ్మతి తెలిపినట్టవుతుంది. **

### **ఆ తర్వాత మీకు వాట్సప్‌లో బ్యాంకు నుంచి వెల్‌కమ్ టెక్స్‌ట్ మెసేజ్ వస్తుంది. **

### **మీరు ఆ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఏదైనా బ్యాంక్ సర్వీస్ పొందాలనుకుంటే ముందుగా ‘Hi’ అని టైప్ చేయాలి. **

### **ఆ తర్వాత స్క్రీన్ మీద వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి మెసేజెస్ పంపాల్సి ఉంటుంది.**

### **WhatsApp Banking: వాట్సప్‌లో ఏఏ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు?**

### **వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన తర్వాత మీకు గతంలో బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్‌లో వచ్చిన నోటిఫికేషన్స్ ఇకపై వాట్సప్‌లో వస్తాయి. **

### **మీ కార్డులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మినీ స్టేట్‌మెంట్, ప్రీఅప్రూవ్డ్ లోన్స్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. **

### **పైన ఇమేజ్‌లో చూపించినట్టుగా వివరాలు తెలుసుకోవచ్చు.**󠀁[](https://amaravathiteacher.com/whatsapp-banking-services-benefits-how-to-create-account/)󠁿

### ** ఒకవేళ మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్టైతే వాటి వివరాలను తెలుసుకోవచ్చు. **

### **ఏ సేవలకు ఏం టైప్ చేసి పంపాలో బ్యాంకులు వివరిస్తాయి. **

### **వేర్వేరు బ్యాంకుల్ని బట్టి ఈ కీవర్డ్స్ మారుతుంటాయి.**

### **WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలతో లాభనష్టాలేంటీ?**

### **మీ స్మార్ట్‌ఫోన్ ఎవరైనా కొట్టేస్తే?**⏎ **వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులు సురక్షితమైనప్పటికీ మీ ఫోన్‌ను ఎవరైనా కొట్టేస్తే అప్పుడు వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకింగ్ వివరాలు కూడా అవతలి వారికి చేరే అవకాశముంది. **

### **ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ విషయాన్ని బ్యాంకులకు వెంటనే తెలియజేయండి.**⏎ **ఇలాంటి సమయంలో వాట్సాప్ బ్యాంకింగ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. **

### **దీని కోసం ఫోన్ పోయిందని, అకౌంట్ డీయాక్టివేట్ చేయాలని support@whatsapp.comకు మెయిల్ పంపాల్సి ఉంటుంది. **

### **అలాగే సంబంధిత బ్యాంకుకు కూడా ఈ మెయిల్ పంపండి. **

### **తర్వాత కొత్త ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత మళ్లీ వాట్సాప్ బ్యాంకింగ్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.**

### **వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటం వల్ల వాట్సప్ బ్యాంకింగ్ సురక్షితమే. **

### **మీ అకౌంట్ సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అయితే మీరు మీ అకౌంట్ నెంబర్లు, పిన్, పాస్‌వర్డ్ లాంటి వివరాలేవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. **

### **సమాచారం తెలుసుకోవడం తప్ప లావాదేవీలు చేయడం వాట్సప్ బ్యాంకింగ్‌లో సాధ్యం సాదు. **

### **ఒకవేళ మీ ఫోన్ పోయినట్టైతే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు. **

### **లేకపోతే మీ ఫోన్ ఎవరికైనా దొరికితే వాళ్లు మీ అకౌంట్ సమాచారాన్ని ఈజీగా తెలుసుకోగలరు. **

### **ఒకవేళ మీ ఫోన్ పోతే వెంటనే “Lost/Stolen: Please deactivate my account” అని టైప్ చేసి support@whatsapp.com ఇమెయిల్ ఐడీకి మెయిల్ పంపాలి. **

### **కంట్రీకోడ్‌తో కలిపి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే మీ 10 అంకెల ఫోన్ నెంబర్ ముందు కంట్రీ కోడ్ +91 తప్పనిసరిగా ఉండాలి. **

### **మీరు మెయిల్ పంపిన వెంటనే మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. **

### **లేదా మీరు వెంటనే కొత్త సిమ్ తీసుకొని, కొత్త ఫోన్‌లో వాట్సప్ యాక్టివేట్ చేయాలి. **

### **దీంతో పోగొట్టుకున్న ఫోన్‌లో వాట్సప్ డీయాక్టివేట్ అవుతుంది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
