Home/ BLOG / Whatsapp-interesting-new-features-dark-mode-2020 Whatsapp-interesting-new-features-dark-mode-2020
Whatsapp-interesting-new-features-dark-mode-2020 WhatsApp: త్వరలో వాట్సప్‌లో ఈ అద్భుతమైన ఫీచర్లు వాట్సప్‌లో డార్క్ మోడ్‌తో పాటు ‘లో డేటా మోడ్’ కూడా రానుంది. గతంలో లో డేటా ఫీచర్ కేవలం వాట్సప్ కాల్స్‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు యాప్ మొత్తానికి ఈ ఫీచర్ రానుంది. దీని వల్ల నెట్వర్క్ డేటా యూసేజ్ తగ్గుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. మీ వాట్సప్ మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో అలరించనుంది. త్వరలో వాట్సప్‌లో కొత్తకొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. వాటిలో ఎప్పట్నుంచో ఊరిస్తున్న డార్క్‌మోడ్ కూడా ఉండబోతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై డార్క్‌మోడ్‌ను పరీక్షిస్తోంది వాట్సప్. ఈ టెస్టింగ్ తుది దశలో ఉంది. త్వరలో యూజర్లందరికీ డార్క్ మోడ్ రిలీజ్ చేయనుంది వాట్సప్. ఇప్పటికే చాలావరకు యాప్స్ డార్క్ మోడ్ రిలీజ్ చేశాయి. కానీ వాట్సప్ నుంచి ఈ ఫీచర్ ఇంకా రాలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి యూజర్లు వాట్సప్‌లో డార్క్ మోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. వాట్సప్‌లో డార్క్ మోడ్‌తో పాటు ‘లో డేటా మోడ్’ కూడా రానుంది. గతంలో లో డేటా ఫీచర్ కేవలం వాట్సప్ కాల్స్‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు యాప్ మొత్తానికి ఈ ఫీచర్ రానుంది. దీని వల్ల నెట్వర్క్ డేటా యూసేజ్ తగ్గుతుంది. అంటే మీ మొబైల్ డేటా తక్కువగా ఖర్చవుతుంది. వాట్సప్‌లో మల్టిపుల్ డివైజ్ సపోర్ట్ కూడా రానుంది. మీ వాట్సప్‌ను ఎన్ని డివైజ్‌లల్లో అయినా ఉపయోగించుకోవచ్చు. మీ వాట్సప్‌లో కాంటాక్ట్స్ యాడ్ చేయడానికి క్యూ ఆర్ కోడ్ ఫీచర్ కూడా రానుంది. అంటే మీరు క్యూ ఆర్ కోడ్ ద్వారా కాంటాక్ట్ షేర్ చేయొచ్చు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి కాంటాక్ట్ యాడ్ చేయొచ్చు. ఇక వాట్సప్ స్టేటస్‌ను మ్యూట్ చేసిన తర్వాత హైడ్ చేసే ఫీచర్ కూడా రాబోతుంది. ఇన్నాళ్లూ మీరు మ్యూట్ చేసిన స్టేటస్లు చివర్లో కనిపించేవి. హైడ్ మ్యూటెడ్ స్టేటస్ ఫీచర్‌తో ఆ స్టేటస్‌ను పూర్తిగా హైడ్ చేయొచ్చు. వాట్సప్‌లో సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్ గురించి తెలిసిందే. మీరు పంపిన మెసేజ్ కొంత సమయం తర్వాత డిలిట్ కావడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది.
error: Content is protected !!