# WHATSAPP-SECURITY-TIPS-ISSUED-BY-INDIAN-ARMY

- Link: https://amaravathiteacher.com/whatsapp-security-tips-issued-by-indian-army/
- Published: 2019-11-19T19:59:34+05:30
- Author: amaravathiteacher

## **WHATSAPP-SECURITY-TIPS-ISSUED-BY-INDIAN-ARMY**

### **భారతదేశంపై సైబర్ దాడికి యత్నాలు.. Whatsapp యూజర్లు పాటించాల్సిన జాగ్రత్తలు తెలిపిన ఇండియన్ ఆర్మీ**

### **భారతదేశంలోని కొన్ని పోలీస్ శాఖలు, భారతదేశ భద్రతా దళాలకు చెందిన మొత్తం 98 కంప్యూటర్ సిస్టంలపై పాకిస్తాన్, చైనాకు చెందిన హ్యాకర్లు దాడి చేసే అవకాశమున్నట్లు మిలటరీ ఇంటెలిజన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. **

### **ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ లకు చెందిన పలువురు పోలీసు అధికారులు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, పారామిలటరీ దళాలకు చెందిన పలువురు అధికారుల సోషల్ మీడియా ఖాతాలపై దాడులు చేసేందుకు ఈ హ్యాకర్లు ప్రయత్నించారు. **

### **అయితే భారతదేశ సైన్యానికి చెందిన వారి సోషల్ మీడియా అకౌంట్లపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018లో కూడా ఇలాంటి దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. **

### **దీంతో హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు భారత ఆర్మీ.. వాట్సాప్ యూజర్లకు పలు జాగ్రతలు అందించింది.**

**​గ్రూప్ ల విషయంలో జాగ్రత్తగా ఉండండి**

### **భారత ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలు కూడా గ్రూపుల విషయంలో జాగ్రత్త వహించాల్సిందిగా పేర్కొంది. **

### **ఈ దాడులు ఎక్కువగా వాట్సాప్ గ్రూపులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నందున్న వాటిలో వచ్చే మెసేజ్ లపై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద లింకులు ఏవైనా కనిపిస్తే గ్రూప్ అడ్మిన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.**

## **+86 నంబర్లతో మరింత ప్రమాదం**

### **+86తో ప్రారంభమయ్యే నంబర్లు వాట్సాప్ లోకి చొరబడి డేటాను దొంగిలిస్తున్నాయి. **

### **కాబట్టి ఈ నంబర్లపై ఓ కన్నేసి ఉంచండి. **

### **ఈ తరహా నంబర్లు పలుమార్లు ఆర్మీ అధికారుల వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి డేటాను దొంగిలించడానికి ప్రయత్నించాయి. **

### **కాబట్టి ఈ నంబర్లతో మీకు అనుమానాస్పద మెసేజ్ లు వస్తే వెంటనే బ్లాక్ చేసేయండి. గ్రూపుల్లో కనిపిస్తే గ్రూప్ అడ్మిన్లకు సమాధానం ఇచ్చి తగు చర్యలు తీసుకోమని సూచించండి.**

## **నంబర్ మారిస్తే పాత సిమ్ విరిచేయండి**

### **ఒకవేళ మీరు మొబైల్ నంబర్ ను మార్చినా లేదా మొబైల్ నంబర్ పోర్టబులిటీ ద్వారా వేరే నెట్ వర్క్ కు మారిపోయినా మీ పాత సిమ్ ను వెంటనే ధ్వంసం చేయండి. **

### **లేకపోతే అందులో ఉండే చిప్ ద్వారా మీ డేటాను దొంగిలించడం లేదా సిమ్ క్లోనింగ్ చేయడం వంటి ప్రమాదాలకు దారి తీస్తుంది. **

### **అంతే కాకుండా నంబర్ మార్చినట్లయితే పాత నంబర్ తో ఉన్న అన్ని గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయిపోయి, వాట్సాప్ ఖాతాను కూడా తొలగించండి.**

## **​గ్రూపులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి**

### **మీ వాట్సాప్ లో ఉన్న గ్రూపులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఇలా చేస్తూ ఉండటం ద్వారా గ్రూపులో ఏవైనా అనుమానాస్పద మెసేజ్ లు కనిపించినా, అనుమానాస్పద నంబర్లు గ్రూపుల్లో యాడ్ అయినా వెంటనే తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.**

### **కొత్త నంబర్లతో జర భద్రం**

### **వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ కొత్త నంబర్లు ఏవైనా యాడ్ అయితే గ్రూప్ అడ్మిన్ కు వారికి సంబంధించిన వివరాలు తెలుసో లేదో కనుక్కోండి. **

### **అంతేకాకుండా ఆయా నంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లను పరిశీలిస్తూ ఉండండి. **

### **ఏదైనా అనుమానాస్పద మెసేజ్ లు కనిపిస్తే గ్రూప్ సభ్యులను అప్రమత్తం చేసి అడ్మిన్ కు సమాచారం అందించండి.**

## **నంబర్ మారిస్తే గ్రూప్ అడ్మిన్ కు సమాచారం**

### **ఒకవేళ మీరు ఎప్పుడైనా మీరు మీ నంబర్ మారిస్తే గ్రూప్ అడ్మిన్ కు ఆ విషయం తెలిపి, మీ కొత్త నంబర్ ను ఇవ్వండి. **

### **లేకపోతే మీ పాత నంబర్ ద్వారా ఎవరైనా ఆ గ్రూపులో చేరి వారి సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. **

### **కాబట్టి నంబర్ మారిస్తే వెంటనే ఆ సమాచారాన్ని గ్రూప్ అడ్మిన్ కే కాకుండా మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారందరికీ అందించండి.**

## ​**మీరే గ్రూప్ అడ్మిన్ అయితే మరింత జాగ్రత్త అవసరం**

### **ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్ కు అడ్మిన్ అయితే మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా గ్రూప్ కు అడ్మిన్ అయితే ఆ గ్రూపులో వచ్చే మెసేజ్ లకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. **

### **కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. **

### **ఎందుకంటే ఇలాంటి ఘటనల్లో గ్రూప్ అడ్మిన్ లపైనే మొదటగా కేసులు నమోదైన సందర్భాలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
