whatsapp-will-stop-in-some-smartphones-from-december-31st

whatsapp-will-stop-in-some-smartphones-from-december-31st

WhatsApp: ఈ ఫోన్లల్లో వచ్చే ఏడాది నుంచి వాట్సప్ పనిచేయదు

వాట్సప్… పరిచయం అక్కర్లేని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యాప్ ఇది.

వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు.

మరి ఆ ఫోన్లు ఏవో, అందులో మీ ఫోన్ ఉందో లేదో తెలుసుకోండి.

1. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ వాడుతున్నారా? అయితే మీరు అలర్ట్ కావాల్సిన సమయమిది. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లల్లో వాట్సప్ అస్సలు పనిచేయదు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లందరూ వాట్సప్ వాడటం మామూలైపోయింది. దీంతో వాట్సప్ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది

2. కొత్త ఫోన్ అయినా, పాత ఫోన్ అయినా వాట్సప్ వాడేస్తున్నారు. అయితే కొందరికి మాత్రం వాట్సప్ నుంచి బ్యాడ్ న్యూస్. పాత ఫోన్లల్లో వచ్చే ఏడాది నుంచి వాట్సప్ పనిచేయదు. ఇప్పటికే కొన్ని పాత ఫోన్లల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. త్వరలో మిగతా ఫోన్లల్లో కూడా సేవల్ని నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తోంది వాట్సప్

3. ఆ ఫోన్లు ఉన్నవాళ్లు వాట్సప్ ఉపయోగించాలంటే కొత్త ఫోన్ కొనాల్సిందే. ఏఏ ఫోన్లల్లో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయో వాట్సప్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పాత వర్షన్ ఉన్న ఫోన్లల్లో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోతాయి

4. ఒకసారి మీ ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉందో చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 2.3.7 కన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మీ ఫోన్‌లో వాట్సప్ పనిచేయదు. అలాగే ఐఓఎస్ 8 కన్నా తక్కువ వర్షన్ ఓఎస్ ఉన్నా ఇదే పరిస్థితి.

5. ఇక 2019 డిసెంబర్ 31 నుంచి అన్ని విండోస్ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ ఫోన్లు వాడుతున్నవాళ్లు వెంటనే తమ డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది. ఇలాంటి పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నది వాట్సప్ వాదన

6. అందుకే పాత ఓఎస్ ఉన్న ఫోన్లకు సేవల్ని నిలిపివేస్తే ఎక్కువ మందిపై ప్రభావం ఉండదని వాట్సప్ భావిస్తోంది. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉన్నట్టైతే ఛాట్స్ బ్యాకప్ చేసుకోండి. మీకు వాట్సప్ తప్పనిసరిగా కావాలంటే మాత్రం ఆండ్రాయిడ్ 4.0.3+, ఐఫోన్ iOS 9+ కన్నా ఎక్కువ వర్షన్ ఉన్న ఫోన్లనే ఉపయోగించాల్సి ఉంటుంది

UPDATE YOUR WHATS APP MESSENGER APP

UPDATE YOUR WHATS APP BUSINESS APP

error: Content is protected !!