YSR-Kanti-Velugu-for-all-schools-ap-Octo-10th-to-16th-1st-phase

YSR-Kanti-Velugu-for-all-schools-ap-Octo-10th-to-16th-1st-phase

రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు

పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్నారులపై దృష్టి సారించాలి.

ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్‌జీఓల సహకారం తీసుకుంటాం.ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తాం.

రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు/

తొలి దశలో ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు.

మలి దశలో దృష్టి లోపాలున్న విద్యార్థులకు మందులు, కళ్లద్దాల పంపిణీని చేపడతారు..

అవసరమైన వారికి శస్త్ర చికిత్సలూ నిర్వహిస్తారు.

విద్యార్థుల్లో దృష్టి లోపాలు  నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంధత్వ నివారణ లక్ష్యంగా ‘కంటి వెలుగు’ పేరుతో అమలు చేయనుంది.

ఈ నెల 10న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా

‘కంటి వెలుగు.

YSR కంటి వెలుగు మొదటి దశ షెడ్యుల్ వివరాలు

మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు.

అక్టోబరు 10 నుంచి 16 వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని,

రెండో విడతలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తామని స్పష్టం చేశారు.

జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసి పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆ మేరకు వారికి తదుపరి చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామని చెప్పారు. 

రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు

YSR కంటి వెలుగు కార్యక్రమ మొదటి దశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్  వైద్య విధాŠన పరిషత్ కమీషనర్  విడుదల చేసిన మార్గదర్శకాలు.

YSR KANTIVELUGU BASIC SCREENING TEST FOR TEACHRS PPT

శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయుల సహకారంతో ముందుగా దృష్టి లోపాలున్న విద్యార్థులను గుర్తించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇందుకు అవసరమైన విజన్‌ కిట్లను పాఠశాలకు ఒకటి చొప్పున అందించనున్నారు.

పథకంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలతో పాటు కిట్లు కూడా జిల్లాకు సరఫరా అయ్యాయి.

దృష్టి లోపాలున్న విద్యార్థుల జాబితాలను సిద్ధం చేసిన అనంతరం రెండో దశలో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేస్తారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి వెంటనే చేపడతారు. చిన్నారుల్లో ఆల్బినిజమ్, శుక్లం (క్యాట్‌రేక్ట్‌), మెల్లకన్ను, విటమిన్‌-ఎ లోపం, టోసిన్, రెటీనా క్యాన్సర్, మైక్రోప్తాల్‌మాస్, కొలబోమ ఐరిస్‌ తదితర రుగ్మతలతో పాటు కంటికి గాయాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులనూ రెండో దశలో పరీక్షించి చికిత్స అందిస్తారు.  

Dr.YSR Kanti Velugu – Mass Eye Screening Programme –Launching on 10.10.2019 – Constitution of Certain Committees –Orders-Issued.
HEALTH, MEDICAL & FAMILY WELFARE (D2) DEPARTMENT
G.O.Rt.No.480 Dated:25-09-2019:

Functions of Committee:
A. Preparation of micro action plans for each phase.
B. Ensuring availability all the man power and materials required for implementation of programme.
C. Capacity building through periodic trainings.
D. Strengthening of Public Health Institutions for providing sustainable universal eye care in state.
E. Interdepartmental coordination with special emphasis on Education Department, Panchayat Raj Department, Rural Development Department,
Municipal Administration & Urban Development Department.
F. Coordination with Government Institutions, NGO hospitals, voluntary organizations and Vision Centres empanelled with NPCB.
G. Integration of Private Hospitals / Private Nursing Colleges / Private Para Medical Institutions in programme.
H. Implementation of action plan, supervision monitoring and equality assurance.
5. The Nodal Officer, Dr.YSR Kantivelugu Programme shall take necessary action
accordingly.

FOR MORE DETAILS PROCEEDINGS OF AP SSA

ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines

error: Content is protected !!