# YSR-Kanti-Velugu-for-all-schools-ap-Octo-10th-to-16th-1st-phase

- Link: https://amaravathiteacher.com/ysr-kanti-velugu-for-all-schools-ap-octo-10th-to-16th-1st-phase/
- Published: 2019-09-20T20:11:30+05:30
- Author: amaravathiteacher

## **_YSR-Kanti-Velugu-for-all-schools-ap-Octo-10th-to-16th-1st-phase_**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/download-
6.jpg?resize=300%2C168&ssl=1)

### **రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు**

### **పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్నారులపై దృష్టి సారించాలి.**

### **ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్‌జీఓల సహకారం తీసుకుంటాం.ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తాం.**

### **రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు/**

### **తొలి దశలో ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. **

### **మలి దశలో దృష్టి లోపాలున్న విద్యార్థులకు మందులు, కళ్లద్దాల పంపిణీని చేపడతారు.. **

### **అవసరమైన వారికి శస్త్ర చికిత్సలూ నిర్వహిస్తారు.**

### **విద్యార్థుల్లో దృష్టి లోపాలు  నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంధత్వ నివారణ లక్ష్యంగా ‘కంటి వెలుగు’ పేరుతో అమలు చేయనుంది. **

### **ఈ నెల 10న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా**

### **‘కంటి వెలుగు.**

### **󠀁[YSR కంటి వెలుగు మొదటి దశ షెడ్యుల్ వివరాలు](https://drive.google.com/file/d/0B8UcTffOXyU8NlJMZHluSl93LVJkN1dXdnphb1BtQUpjZk9V/view?usp=sharing)󠁿**

### **మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/4444.jpg?
resize=542%2C249&ssl=1)

### **రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు.**

### **ఈ సందర్భంగా వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. **

### **అక్టోబరు 10 నుంచి 16 వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, **

### **రెండో విడతలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు. **

### **వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తామని స్పష్టం చేశారు. **

### **జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసి పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆ మేరకు వారికి తదుపరి చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. **

### **ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామని చెప్పారు. **

### **రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు**

### **YSR కంటి వెలుగు కార్యక్రమ మొదటి దశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్  వైద్య విధాŠన పరిషత్ కమీషనర్  విడుదల చేసిన మార్గదర్శకాలు.**

### **_󠀁[YSR KANTIVELUGU BASIC SCREENING TEST FOR TEACHRS PPT](https://drive.google.com/file/d/14lNcB57e4H-cLtysXJnpbhbN2FeoSU2t/view?usp=sharing)󠁿_**

### **శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయుల సహకారంతో ముందుగా దృష్టి లోపాలున్న విద్యార్థులను గుర్తించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. **

### **ఇందుకు అవసరమైన విజన్‌ కిట్లను పాఠశాలకు ఒకటి చొప్పున అందించనున్నారు.**

### **పథకంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలతో పాటు కిట్లు కూడా జిల్లాకు సరఫరా అయ్యాయి. **

### **దృష్టి లోపాలున్న విద్యార్థుల జాబితాలను సిద్ధం చేసిన అనంతరం రెండో దశలో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేస్తారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి వెంటనే చేపడతారు. చిన్నారుల్లో ఆల్బినిజమ్, శుక్లం (క్యాట్‌రేక్ట్‌), మెల్లకన్ను, విటమిన్‌-ఎ లోపం, టోసిన్, రెటీనా క్యాన్సర్, మైక్రోప్తాల్‌మాస్, కొలబోమ ఐరిస్‌ తదితర రుగ్మతలతో పాటు కంటికి గాయాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులనూ రెండో దశలో పరీక్షించి చికిత్స అందిస్తారు.  **

### **Dr.YSR Kanti Velugu – Mass Eye Screening Programme –****Launching on 10.10.2019 – Constitution of Certain Committees –Orders-Issued.**⏎ **HEALTH, MEDICAL & FAMILY WELFARE (D2) DEPARTMENT****G.O.Rt.No.480 Dated:25-09-2019:**

### **Functions of Committee:**⏎ **A. Preparation of micro action plans for each phase.****B. Ensuring availability all the man power and materials required for ****implementation of programme.****C. Capacity building through periodic trainings.****D. Strengthening of Public Health Institutions for providing sustainable universal ****eye care in state.****E. Interdepartmental coordination with special emphasis on Education ****Department, Panchayat Raj Department, Rural Development Department,****Municipal Administration & Urban Development Department.****F. Coordination with Government Institutions, NGO hospitals, voluntary ****organizations and Vision Centres empanelled with NPCB.****G. Integration of Private Hospitals / Private Nursing Colleges / Private Para ****Medical Institutions in programme.****H. Implementation of action plan, supervision monitoring and equality assurance.****5. The Nodal Officer, Dr.YSR Kantivelugu Programme shall take necessary action****accordingly.**

### _**󠀁[FOR MORE DETAILS PROCEEDINGS OF AP SSA](https://drive.google.com/file/d/1YX_AFVvuYJ3VQMbLRF1qLYwKY4g-5wb8/view?usp=sharing)󠁿**_

> [ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines](https://amaravathiteacher.com/ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines/)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
