రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం(10వ తేదీన) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి.
6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది.
వైఎస్సార్ కంటి వెలుగు తొలిదశ ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు*
రెండో దశ నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు*
3వ దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు*
4వ దశ కార్యక్రమం ఆగస్టు 1 నుంచి 2021 సంవత్సరం జనవరి 31 వరకు*
5వ దశ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు*
6వ దశ కార్యక్రమం 2021 సంవత్సరం ఆగస్టు 1 నుంచి 2022 సంవత్సరం జనవరి 31 వరకు*
ఉపాధ్యాయులకు వై.ఎస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గురించి♦
*ఉపాధ్యాయులకు సూచనలు*
ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణ కు బాధ్యులుగా వుండాలి.
ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుని సమక్షంలో విద్యార్థులకు కంటి తనిఖీ లను నిర్వహిస్తారు….
దీనికి సంబంధించి ఒక విజన్ చార్ట్,ఒక టార్చ్ లైట్,ఒక టేపు,సరఫరా చేయడం అయినది.
రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని
One comment
Pingback: YSR-Kanti-Velugu-for-all-schools-ap-Octo-10th-to-16th-1st-phase