ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines

ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం(10వ తేదీన) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి.

6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది.

వైఎస్సార్ కంటి వెలుగు తొలిదశ ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు*

రెండో దశ నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు*

3వ దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు*

4వ దశ కార్యక్రమం ఆగస్టు 1 నుంచి 2021 సంవత్సరం జనవరి 31 వరకు*

5వ దశ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు*

6వ దశ కార్యక్రమం 2021 సంవత్సరం ఆగస్టు 1 నుంచి 2022 సంవత్సరం జనవరి 31 వరకు*

ఉపాధ్యాయులకు వై.ఎస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గురించి♦

*ఉపాధ్యాయులకు సూచనలు*

✒ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణ కు బాధ్యులుగా వుండాలి.

✒ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుని సమక్షంలో విద్యార్థులకు  కంటి తనిఖీ లను నిర్వహిస్తారు….

✒దీనికి సంబంధించి ఒక విజన్ చార్ట్,ఒక టార్చ్ లైట్,ఒక టేపు,సరఫరా చేయడం అయినది.

రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని

YSR కంటి వెలుగు మొదటి దశ షెడ్యుల్ వివరాలు

*వీటి వినియోగం ఇలా………🔴*

✒మంచి వెలుతురు వున్న ప్రదేశం లో కంటి తనిఖీ లు జరగాలి.

✒విద్యార్థి నిలుచున్న దగ్గర నుంచి మూడు మీటర్ల దూరం ను టేపు సహాయం తో కొలిచి విద్యార్థి తలకు సమాంతరంగా విజన్ చార్ట్ ను గోడకు పేస్ట్ చేయాలి.

✒విద్యార్థి నిలుచునే ప్రదేశాన్ని శుద్ధ ముక్క తో మార్క్ చేసి విద్యార్థిని అక్కడ నిలబెట్టాలి.

✒విద్యార్థులు కంటి పరీక్షలు జరుగుతున్న ప్రదేశం లో ఎక్కువ మంది లేకుండా చూడాలి.

✒ఇది వరకే కంటి అద్దాలు వాడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు తోనే తనిఖీ నిర్వహించాలి.

*ప్రదర్శన……..🔴*

✒ పరీక్షా ప్రక్రియ చేపట్టే ముందు *E* అక్షరం యొక్క కొసలు ఏ వైపు కు వున్నయిననే విషయం చేతితో ఊపి ఏ విధంగా చెప్పాలో సూచించండి.

✒పరీక్షా చేయించుకునే విద్యార్థి పరీక్షలో ఎలా చెప్పాలో,చూపించాలి, అనే విషయం అర్ధం అయ్యింది అని నిర్ధారించుకున్న తరువాత ప్రక్రియ మొదలు పెట్టండి.

*పరీక్షించే విధానం……….🔴*

మొదటి లైన్ పెద్ద *”E”* 

*పాస్…..🔴*

🕳 కనీసం రెండు అక్షరాలు చెప్పగలిగితే లేదా చుపించంగలిగితే తరువాత స్టెప్ కు వెళ్ళాలి

* ఫెయిల్…….🔴*

🕳ఒక్క అక్షరం లేదా ఏ అక్షరం సరిగ్గా చెప్పడం లేదా చుపించనప్పుడు కంటి పరీక్షలు సూచించాలి.

రెండవ లైన్.. చిన్న *E*

*పాస్…….🔴*

🕳కనీసం 4 అక్షరాలు చెప్పగలిగే లేదా చూపించ గలగాలి.

* ఫెయిల్………🔴*

🕳మూడు లేదా అంతకు తక్కువ అక్షరాలు చెప్పడం లేదా చూపించక పోతే కంటి పరీక్ష సూచించాలి..

*🔴ముందు కుడి కన్ను తరువాత యెడమ కన్ను ను ఇదే విధంగా పరీక్షించాలి….*

*♦♦గమనిక…….*

✒విద్యార్థికి కంటి పరీక్ష చేసేటప్పుడు తన రెండవ కంటిని మృదువుగా ముసుకోమని చెప్పాలి.

*♦♦సంపూర్ణ కంటి పరీక్షా*

✒కళ్ళు రెండింటి లో ఏ ఒక్క దానిలో నైనా దృష్టి పరీక్షలో ఫెయిల్ అయినట్లాయిన

✒టార్చ్ లైట్ పరీక్షలో ఏదైనా అసాధారణ పరిస్తితి గమనించినా

✒ఇతర కంటి సంబంధిత సమస్యలు వున్నవారు.

*♦వీరిని పూర్తి కంటి పరీక్షకు పంపించాలి….*

*♦♦గమనించండి..♦♦*

✒ఈ కార్యక్రమం పూర్తి అయ్యే లోగా దృష్టి లోపం వున్న వారు,లేనివారు ఈ ప్రాథమిక దశ లో నిర్ధారణ జరగాలి.

GUIDELINES FOR SCREENING TEST YSR KANTIVELUGU

OPERATIONAL GUIDELINES FOR PHASE-1

error: Content is protected !!