AP DSC Call Letter 2025 Download

AP DSC Call Letter 2025 Download

AP DSC Call Letter 2025 Download

పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా DSC–2025 సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను (స్టేట్, జోన్, డిస్ట్రిక్ట్ స్థాయి) 22.08.2025 నుండి మెగా DSC అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసింది.

ఈ విషయంగా తెలియచేయడమేమనగా! వివిధ కేటగిరీ పోస్టులకుగాను Zone of Consideration లోకి వచ్చిన అభ్యర్థులకు, వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాలలోనే గురువారం అనగా 28.8.2025 న ఉదయం 09.00AM నుండి ప్రారంభమవుతుంది.

కావున ఈ అభ్యర్థులు తమ వ్యక్తిగత Mega DSC–2025 లాగిన్ ఐడీల ద్వారా 26.08.2025 మధ్యాహ్నం 3:00 PM నుండి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు లాగిన్ లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న అందులో సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులు తీసుకురావలసిన సర్టిఫికెట్లు:

  • సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు
  • ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం (వర్తించినచో)
  • అంగవైకల్యం ధృవీకరణ పత్రం (వర్తించినచో)
  • కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికెట్లు
  • గజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలు
  • 5 పాస్పోర్ట్ సైజు ఫొటోలు

అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూసుకోవాలి. హాజరుకాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది.

ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు నిర్దిష్ట సూచనలను పాటించి, సమయానికి సర్టిఫికెట్లతో హాజరయ్యేలా చూసుకోవాలని తెలియచేయడమైనది.

గమనిక:

1. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావడానికి ముందు, సంబంధిత సర్టిఫికెట్లను వెబ్ సైట్ లో వ్యక్తిగత Mega DSC–2025 లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

2. కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలుగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నియమాలను బట్టి జరుగుతుంది.

AP DSC Call Letter 2025 Download Link

error: Content is protected !!