పి .ఎఫ్ నుండి అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం తీసుకోవడం ఎలా ??
ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాలకు సాధారణ భవిష్య నిధిలో నిల్వ ఉన్న మొత్తం నుంచి అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం తీసు కోవచ్చు. ఈ నగదు ఉప సంహరణకు సంబంధించీన నిబంధనలు, మార్గదర్శకాలు తెలుసుకుందాం,
తాత్కాలిక అడ్వాన్స్ లు
ఈ తాత్కాలిక అడ్వాన్స్ రూపంలో 10 రకాలుగా రుణం మంజూరు చేస్తారు.
ఇది సాధారణంగా 8 నెలల జీతం లేక మొత్తం మిగులులో సగభాగం.
ఏది తక్కువ అయితే అది మంజూరు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం మంజూరుచేసే అధికారి విచక్షణకు లోబడి 3/4 మొత్తం మిగులును మంజూరు చేస్తారు.
చందాదారుడికిగానీ, తన కుటుంబ సభ్యులకు దీర్ఘవ్యాధులకు నయం చేయు సందర్భంలో.. ఇతర దేశాల్లో ఉన్నత విద్య కోసం సాధారణ, సాంకే తిక, వైద్య విద్య కోసం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువు కోసం… మతపరమైన ధార్మిక కార్యక్రమాలు ని ర్వహించే నిమిత్తం, న్యాయ సంబంధ ఖర్చులకు, తన విధి నిర్వణలో భాగం గా ప్రభుత్వేతర సంస్థలతో న్యాయపర మైన ఖర్చులకు.. ప్రభుత్వపరంగా ఏర్పడిన న్యాయవివాదాలు ఎదుర్కొను ఇల్లు నిర్మాణం, కొనుట నిమిత్తం అయిన అప్పులు తీర్చే నిమిత్తం…
ఇంటి మరమ్మతులకు, ఇంటి స్థలం మాత్రమే కొనుటకు లేక సంబంధిత అప్పు తీర్చు టకు.. పదవీ విరమణ చేయుటకు ఆరు నెలలు ముందుగా పొలంగానీ, వ్యాపార, వాణిజ్యపరమైన స్థలం కాని కొనుటకు, మోటర్ సైకిల్ కొనుగోలు నిమిత్తం..
సాధారణ కారణాలపై తీసుకున్న అప్పుకు 12-24 వాయిదాలల్లో ను, ప్రత్యేక కారణాలతో తీసుకున్న అప్పు అనుసరించి 24 నుంచి 36 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. మరిన్ని నిబంధనలు తాత్కాలిక అడ్వాన్సుగాని, పార్ట్ ఫైనల్ గాని ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు మించరాదు/ఒక అడ్వాన్సుకు మరో అడ్వాన్స్కు మధ్య ఆరు నెలల వ్యవధి తప్పక ఉండాలి.
బూస్టర్ స్కీం జీపీఎఫ్ చందాదారుడు ఆకస్మికంగా మర జించిన సందర్భంలో అదనపు ప్రయో జనంగా మరణానికి మూడేళ్ల ముందు తన ఖాతాలో గెజిటెడ్ వారికి రూ.8 వేలు బ్యాలెన్స్, నాన్ గజిటెడ్ ఉద్యోగులకు రూ.6 వేలు, చివరి ట్రేడ్ వారికి రూ.2 వేలు తప్పక ఉండాలి, అలాంటి వారికి సరాసరి నెల వరకూ రూ.20 వేలు మించకుండా చెల్లిస్తారు.
తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్సులు
సాధారణ భవిష్యనిధిలో నిల్వయున్న మొత్తం నుంచి కొంత శాశ్వతంగా కింది కారణాలపై తీసుకొనవచ్చు.
ఈ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, 20 ఏళ్ల సర్వీసు నిండిన లేదా పదేళ్లలోపు ఉద్యోగ విరమణ చేయు వారికి, కే నెలల వేతనంగానీ, 1/2 బ్యాలెన్సు మొత్తంగా లేక ప్రత్యేక పరిస్థి తీలో 10 నెలల బేసిక్ పే వరకు మంజూరు చేస్తారు. దీనికి విద్యాపరమైన ఉన్నత కోర్సులు చదువుకొనుటకు, అందు నిమిత్తం ప్రయాణ ఖర్చుల కోసం మంజూరు చేస్తారు.
పెళ్లి, ఇతర కుటుంబపరమైన కార్యాలు, ఆరోగ్యపరమైన వ్యవ హారాలు నిర్వహించుటకు ఈ అడ్వాన్స్ చెల్లిస్తారు.
ఇల్లు నిర్మించుకోవడానికి, మరమ్మతులకు అడ్వాన్స్ చెల్లించాలంటే 15 ఏళ్ల సర్వీసు నిండాలి. ఇంటి పునర్నిర్మాణాలకు పదవీ విరమణకు ముందు పదేళ్ల సర్వీసు మిగిలి ఉన్నవారికి, అన్ని అనుమతులతో కూడిన ఇంటికి సంబంధించిన నకళ్లు ఉన్నప్పుడు 3/4 భాగం జీపీఎఫ్ మొత్తంలో మంజూరు చేస్తారు. వ్యవసాయ భూమి కొనుక్కోవటానికి వాణిజ్యపర మైన షాపులు కొనుటకు కూడా పార్ట్ ఫైనల్ అడ్వాన్సు 1/2 భాగంగాని లేదా 6 నెలల పే గానీ మంజూరు చేస్తారు.
ఎన్జీవోలు అందరికీ డ్రాయింగ్ అధికారి మంజూరు చేయవచ్చు.
అయితే డ్రాయింగ్ అధికారి గెజిటెడ్ కానిచో తర్వాత ఉన్న గెజిటెడ్ అధికారి మంజూరు చేస్తారు.
ఉపాధ్యాయులకు:
ప్రభుత్వ ఉన్నత పాఠశా లల్లో పనిచేసే టీచర్స్ కు సంబంధిత హెచ్ ఎం, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ల్లో పనిచేయు ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి, హైస్కూల్ హెచ్ఎంలకు డీఈవోలు ఈ అడ్వాన్స్లు మంజూరు చేసి ట్రెజరీల ద్వారా డ్రా చేస్తారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథ మికోన్నత పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యా యులకు మండల విద్యాధికారి సదరు అడ్వాన్స్/రుణం మంజూరు చేసి, ఆ ఉత్త ర్వులను జెడ్పీ సీఈవోకి పంపి సదరు సొమ్మును డ్రాచేసి సంబంధిత టీచర్స్ బ్యాంక్ ఖాతాల్లో జమచేయమని కోరతారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం , బోధనేతర సిబ్బందికి వారి దర ఖాస్తులపై జెడ్పీ డిప్యూటీ సీఈవో అడ్వాన్స్లు మంజూరు చేస్తారు.