Engineering-colleges-conducting-online-exams-for-4th-year-students

Engineering-colleges-conducting-online-exams-for-4th-year-students

ఇంటి నుంచే బీటెక్‌ పరీక్షలు..జూన్‌ 1 నుంచి ప్రారంభం..!

ఉన్నత చదువులకు వెళ్లే, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.

 ఈ క్రమంలో నిట్‌ తాడేపల్లిగూడెం, ఐఐటీ తిరుపతి తొలి అడుగు వేశాయి.

 విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

లాక్‌డౌన్ కారణంగా ఇళ్ల వద్దనున్న విద్యార్థులు అక్కడి నుంచే పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాయి.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందినవారు..

ఉన్నత విద్యకు వెళ్లాల్సినవారికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయిం తీసుకున్నారు.

జూన్‌ 1 నుంచి పరీక్షలు:
నిట్‌-తాడేపల్లిగూడెం చివరి సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనుంది.

ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన మిడ్, మైనర్‌ పరీక్షలకు 75% వెయిటేజ్‌ ఇస్తారు.

మిగతా 25% మార్కులకు మాత్రమే ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తారు.

ఇందులో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి.

ఇవి కూడా జంబ్లింగ్‌ విధానంలో ఉంటాయి.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థి తన ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్‌ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేస్తేనే ప్రశ్నపత్రం డౌన్‌లోడ్‌ అవుతుంది.

ఈ కెమెరా విద్యార్థిని పరిశీలిస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు.

రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారు.

ఐఐటీ తిరుపతిలో ప్రశ్నలు, జవాబుల రూపంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇవి జూన్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.

చివరి ఏడాది సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫాస్‌, ఫెయిల్‌ అని మాత్రమే ఇస్తారు. గ్రేడ్లు ఇవ్వరు.

విద్యార్థులు జవాబులను కంప్యూటర్‌పై టైప్‌ చేయాల్సి ఉన్నందున పరీక్ష సమయం పెంచుతారు.

విద్యార్థుల కదలికలను కంప్యూటర్‌ కెమెరా ద్వారా పరిశీలిస్తారు.

error: Content is protected !!