DCR వినియోగం, అప్డేషన్ తదితర అంశాలపై జిల్లాలోని DCR పాఠశాల ఇద్దరు ఉపాధ్యాయులకు తగు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఇంకనూ తెలియడంలేదంటే DCR పై వారి శ్రద్ద ఇలా ఉండడం వలననే రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఇంతలా వెనుకబడి ఉంది. Regular గా update చేస్తున్నవారు చాలా సులభంగా, ఆనందంగా చేయగలుగుతున్నారు. వారందరికీ అభినందనలు.
మన వృత్తి లో ఇది బాధ్యతగా చేయాలని ప్రతీసారి మనకెవరూ చెప్పనవసరంలేదు.
అమరావతి లో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షలో సమావేశం లో జిల్లాల DCR వాడకం పరిస్థితి దయనీయంగా ఆవిష్కరించ బడింది. ప.గో.జిల్లాలో DCR వినియోగించని పాఠశాలల HMs ను జిల్లా కలెక్టరు సస్పెండ్ చేసిన సంఘటనలున్నాయి.
జిల్లా లో అనేక పాఠశాలల లో DCRల వలన ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు కూడా పెరిగినట్లు ఆయా ప్రధానోపాధ్యాయులే విజయగాధలు తెలిపారు.
DCR గుదిబండ కాదు. ఉపాద్యాయులకు Readymade TLM.
DCR వినియోగంలో సమస్యలున్నపుడు పరిష్కారం కొరకు జిల్లా IT cell Nodal team ఎల్లపుడూ మీ తోడుంటుంది.
Problem చెప్పేసి ఊరుకోకుండా followup చేసి పరిష్కరించుకొండి.
తప్పనిసరిగా రోజుకి 5గంటల చొప్పున వినియోగించి update చేయవలసినదిగా కోరుచున్నాము.
మీ స్కూల్ యొక్క రిపోర్టు క్రింది వెబ్ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.