LIC-policy-holders-submit-your-claims-throughponline-portal

LIC-policy-holders-submit-your-claims-throughponline-portal

LIC: ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్… ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి ఇలా

మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా?

పాలసీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసే అవకాశం కల్పిస్తోంది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. ఎలాగో తెలుసుకోండి.

పాలసీహోల్డర్లకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC శుభవార్త చెప్పింది.

డెత్ క్లెయిమ్, మెచ్యూరిటీ క్లెయిమ్స్, సర్వైవల్ బెనిఫిట్స్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చని స్పష్టం చేసింది

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా క్లెయిమ్ డాక్యుమెంట్స్‌ని LIC ఆన్‌లైన్‌లో స్వీకరించిన సంగతి తెలిసిందే.

అయితే జూన్ 30 వరకే ఈ అవకాశం ఉంటుందని గతంలో ప్రకటించింది ఎల్ఐసీ.

ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుండటంతో ఆన్‌లైన్ క్లెయిమ్ ఫెసిలిటీని ప్రారంభించింది LIC

పాలసీహోల్డర్లు ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని క్లెయిమ్ సబ్మిట్ చేయొచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్స్‌ని LIC ఏజెంట్లకు లేదా బ్రాంచ్ ఆఫీస్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయొచ్చు

ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇ-సర్వీస్ పొందడానికి పాలసీహోల్డర్లు ముందుగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

LIC ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేయనట్టైతే మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి

ఆ తర్వాత మీకు కావాల్సిన సర్వీస్

ఎంచుకోవాలి.

వివరాలు ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

ఈ సదుపాయం ద్వారా డెత్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్, రిక్వెస్ట్ ఫర్ మెచ్యూరిటీ, సర్వైవల్ డ్యూస్, యాన్యుటీ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టెన్స్ సర్టిఫికెట్ సబ్మిషన్, పాలసీ రివైవల్, నెఫ్ట్ మ్యాండేట్ లాంటి సేవలన్నీ పొందొచ్చు.

అవసరమైన ఫామ్స్ కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు

వీటితో పాటు NEFT, NACH మ్యాండేట్స్, పాలసీలకు ఆధార్ లింక్ చేయడం లాంటి సేవలు కూడా ఎల్ఐసీ ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ ద్వారా పొందొచ్చు.

ప్రతీ వ్యక్తిగత పాలసీకి వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.

అంటే ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులకు పాలసీలు ఉంటే, రిజిస్ట్రేషన్ వేర్వేరుగా ఉండాలి

ఏ పాలసీ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేస్తే అదే పాలసీకి సంబంధించిన సేవలు లభిస్తాయి.

మీ రిక్వెస్ట్ సబ్మిషన్ పూర్తైన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.

మీ రిక్వెస్ట్‌కు సంబంధించిన వెరిఫికేషన్ మూడు రోజుల్లో ఎల్ఐసీ జోనల్ ఆఫీస్ ద్వారా పూర్తవుతుంది.

LIFE INSURANCE CORPORATION OF INDIA LIC OFFICIAL WEBSITE

error: Content is protected !!