LEAVE TRAVEL CONCESSION

*లీవ్ ట్రావెల్ కన్సెషన్*  ( *L T C* )

    ప్రభుత్వ ఉద్యోగి సెలవుపై అతని కుటుంబముతో కలసి ఉద్యోగ ప్రదేశము (హెడ్ క్వార్టర్) నుండి స్వస్థలము(హోంటౌన్)నకు గాని, రాష్ట్రములోని ఏ ప్రదేశమునకైనాగాని వెళ్ళివచ్చుటకు అగు ప్రయాణ ఖర్చులను చెల్లించుటనే

“లీవ్ ట్రావెల్ కన్ఫెషన్”(LTC) అంటారు. సర్వీస్మొ త్తంలో ఒకసారి బ్లాక్ పీరియడ్లోని చివరి రెండు సంవత్సరాల్లో దేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్ళువచ్చుటకు అనుమతించబడింది. 

*1. అర్హత* : 5 సం||ల కనీస సర్వీసుగల టెంపరరీ ఉద్యోగులతో సహా ఉద్యోగులతో సహా అర్హులు. కంటిజెంట్ సిబ్బంది, పార్ట్ టైమ్ ఉద్యోగులు దీనికి అర్హులు కారు.

*2. స్వస్థలం (Home Town)*: ఉద్యోగి జన్మస్థలం లేదా అతని తల్లిదండ్రులు, దగ్గర బంధువులు నివసించు స్థలము లేదా ఉద్యోగి స్థిరాస్తి కలిగియున్న స్థలము, ఉద్యోగములో చేరకముందు నివాసమున్న స్థలము స్వస్థలముగా పరిగణించ బడుతుంది. ఉద్యోగి తాను మొదటిసారిగా ఎల్టీసి వాడుకొనే ముందు స్వస్థలము ధృవీకరిస్తూ నిర్ణీతఫారంలో డిక్లరేషన్ ఇవ్వాలి. దానిని కంట్రోలింగ్ అధికారి అప్రూవ్ చేసి కార్యాలయాధిపతి (Head of Office)కి పంపినచో, వారు దానిని సర్వీసు రిజిష్టరులో నమోదు చేస్తారు. ఉపాధ్యాయులకు ఎంఇఓ / ప్రధానోపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులకు డివైఇఓ నమోదు చేయాలి. ఈ డిక్లరేషనను సర్వీస్ మొత్తంలో ఒకసారి మార్చుకోవచ్చు.

*3. కుటుంబం*: టీఏ నిబంధనలలో నిర్వచించబడిన కుటుంబమే దీనికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగి, అతని కుటుంబము వేర్వేరుగాని, కలిసిగాని ఎల్టీసి వాడుకొన వచ్చును. ఉద్యోగి కుటుంబము వేరే చోట నివాసముంటూ ఈ సౌకర్యం ఉపయోగించు కొనకపోతే అట్టి ఉద్యోగి స్వస్థలము వెళ్ళి వచ్చుటకు LTC వాడుకొనవచ్చును. భార్యా, భర్తలు కలసి వాడుకొనేప్పుడు ఒక్కరే ఎల్టీసి అర్హులు. కుటుంబ సభ్యులు ఒక బ్లాక్ పీరియడ్లో ఒకసారి మాత్రమే ఎల్ టీసికి అర్హులు. ఈ సౌకర్యం సంతానంలో ఇద్దరికే పరిమితం చేయబడింది.

*4. బ్లాక్ పీరియడ్*: ప్రతి 4 సం||ల కాలము ఒక బ్లాక్ పీరియడ్ గా పరిగణించబడుతుంది. మొదటి రెండు సంవత్సరముల నందు స్వస్థలము పోవుటకు, తదుపరి రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని ఏ ప్రదేశమునకైనా గాని, లేక హోంటౌనుగాని, సర్వీస్ మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళి వచ్చుటకు ఎల్ టీసిని వినిగియోంచు కొనవచ్చును. 2019-20 హోమ్ టౌను 2021-22లో రాష్ట్రంలో ఎక్కడికైనాఅనుమతి స్తారు.

*5. తీసుకోవలసిన సెలవు* : క్యాజువల్ లీవుగాని, లేక అర్హతగల ఏ ఇతర సెలవుగాని పెట్టుకొని వెళ్ళాలి. ప్రభుత్వ సెలవు దినాలతో కలిపిగాని, కలపకుండా కాని వినియోగించు కోవచ్చు. కాని కేవలం ప్రభుత్వ సెలవుల్లో మాత్రమే వినియోగించు కోవటానికి వీలులేదు. అర్హతగల సెలవు మంజూరు చేయు అధికారి నుండి ఎల్ సి వాడుకొనుటకు ముందస్తు పర్మిషన్ పొందాలి. వెకేషన్ డిపార్టుమెంటుకు చెందినవారు వెకేషన్లో కూడా ఈ సౌకర్యం వాడుకొనవచ్చును.

*6. అడ్వాన్సు* : ఎల్టీసి పై వెళ్ళి వచ్చుటకుగాను అంచనా వేయబడిన మొత్తం ఖర్చులో 80 శాతం వరకు అడ్వాన్సుగాపొందవచ్చు. మిగిలినది ప్రయాణం పూర్తి చేసి వచ్చి ఫైనల్ బిల్లు సమర్పించిన తర్వాత చెల్లిస్తారు.

*7. చెల్లింపబడే మొత్తం* : మొదటి 2 సం||లలో స్వస్థలమునకు వెళ్ళినప్పుడు గాని రెండవ బ్లాక్ పీరియడ్లో రాష్ట్రంలోని ఏ చోటుకైనను వెళ్ళునప్పుడుగాని పూర్తి దూరమునకు చెల్లింపు ఉండును. ఇతర రాష్ట్రములలో స్వస్థలముగలవారు ఉద్యోగం చేయు స్థలం నుండి మన రాష్ట్ర సరిహద్దు వరకు గల దూరమునకు మాత్రమే చెల్లింపు వుంటుంది. రైలు మార్గముండి, ఏ ఇతర వాహనముపై ప్రయాణించినను, దగ్గరి రైలు మార్గము ద్వారా ప్రయాణం చేసినప్పుడు అయ్యెడి చార్జీలను (టీఏ నిబంధనల మేరకు)చెల్లిస్తారు. రైలు మార్గం లేనిచో బస్ (అర్హతను బట్టి డీలక్సు సర్వీసు వరకు) చార్జీలను చెల్లిస్తారు. దేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే సందర్భంలో ప్రయాణ దూరం 3500 కి.మీ., క్లెయిమ్ మొత్తం 18,750/-లు గరిష్టంగా అనుమతిస్తారు.

*8. క్లెయిమ్ చేయుట* : ఎల్ టీసి మొత్తమును క్లెయిమ్ చేయునప్పుడు టిఎ బిల్లునకు టిక్కెట్లను గాని, క్యాష్ రశీదుగాని, స్వంత డిక్లరేషన్‌గాని, బస్సు టికెట్లుగాని జత పరచవలెను. తిరుగు ప్రయాణం పూర్తి అయిన 30 రోజులలోగా బిల్లును పంపుకోవాలి. లేనిచో 15 శాతం కోత విధించబడుతుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఎంఇఓ, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులకు ఉపవిద్యాశాధికారి మంజూరు అధికారిగా ఉంటారు.

Reimbursement of expenditure incurred by the Government employee and family members to travel from his Head Quarters to Home Town / Any place within the state is called Leave Travel Concession (LTC)

As per Rule 92 (Annexure-VII) of APCS(TA) Rules, 1996, the Government employees are permitted to avail LTC in a block period of 4 years to visit ‘Home Town’ during the first block of two consecutive calendar years and may avail this concession to visit any place within the state during the second block.

LTC Rules / Check List to avail LTC:

1.To be sanctioned to the Government servant who had put in five year service.
(G.O.Ms.No.20,Fin(PC)Dept.,dated:18-01-1972,
G.O.Ms.No.15, Fin(PC) Dept., dated:17-01-1973)
2.The Permission granted to avail the LTC is given by the authority competent to sanction leave other than CL. (Govt.Memo.No.55427/TA/76-1,Fin.&Plg.(PC)Dept., dated:12-07-1976)
3.Prior permission from competent authority shall be obtained before commencing the upward Journey. (Govt.Memo.no.1165/PC/72-1, Fin.&Plg. (PC) Dept., dated: 12-05-1972)

4.(i).The Government servant should touch the destination for which he/she is permitted.
(Govt.Memo.No.39873/1005/TA/85-1,Fin.&Plg.(FW.TA) Dept., dated:16-12-1985)
(ii).The LTC is availed correctly with reference to the block period.
(iii).Whether the Home Town declared is an outstation or a place within the state, should be checked before sanction.
5.The LTC claim is supported with original used bus/train tickets, receipts.
(Cir.Memo.No.11818/48/A2/TA/2001, dated:07-03-2002)
6.The claim is preferred by the Government servant within 30 days from the date of return journey or otherwise 15% cut is imposed up to a maximum period of 1 year. (Rule-12)
7.The certificates as prescribed by the Government should be furnished
(G.O.Ms.No.15 r/w G.O.Ms.No.247, F&P (FW-TA) Dept., dated:20-09-1982)
8.S.R.entry should be made and certificate in token of having availed the facility is furnished with the Bill. (Rule-11(h) of LTC Rules)
9.Certificate stating whether spouse is employed either in State, Central, Quasi Government etc., where similar facilities are available and but not availed separately is obtained from the Government servant and attested by DDO. (Rule-11(a)(i) and (ii) of LTC Rules).
(G.O.Ms.No.15 r/w Cir.Memo.No.83808/C/564/TA/79-1, dated:23-01-1979)
10.Bill shall be preferred in T.A.bill form (APTC Form-52)
11.The LTC should be limited to only two dependent children from 01-04-1996 onwards and any child born beyond two after 01-04-1996 is not entitled to LTC, but in respect of children born prior to 01-04-1996, all the dependent children are
eligible for LTC.
(G.O.Ms.No.140, F&P (FW.TA) Dept., dated:03-04-1996)
(Note (iii) under Rule-7)
12.(i).Parents of Gazetted Officers shall not be treated as family members. (Note(i) under Rule-7)
(ii).Parents of married female government employees will be treated as members of family provided they are dependent on them. (Note(ii) under Rule-7)
(iii).Pensioners cannot be defined as dependent parents in LTC. (Note(iV) under Rule-7)
13.a).If the places are connected by train, journey shall be performed by train only.
b).In case the journey is performed by bus (APSRTC & APTDC), the fare shall be limited to train fare or bus fare whichever is less.
c).Journeys by private services or car, hired car, private taxis, vans etc., shall not be allowed.

LTC APPLICATION FORM FOR TEACHERS & EMPLOYEES

DDO PROCEEDINGS FOR LTC SANCTIONING

14.If the Home Town is situated outside the State, the claim shall be limited to the last point within the state in that direction.
15.A LTC Advances Watch Register should be maintained to watch the recovery of amounts advanced. (Annex-16

In case of misuse / abuse of advance:

1.The entire amount if drawn and disbursed shall be recovered in one lumpsum.
(i).The right of the Government employee for availment of LTC shall be forfeited for the rest of service.
(ii).Disciplinary action has to be taken by the disciplinary authority to initiate disciplinary proceedings against a Government employee on the charge of preferring a fraudulent claim of LTC, such Government servant shall not be allowed the
LTC till the finalization of such disciplinary proceeding and
(iii).If the Government servant is fully exonerated of the charge of fraudulent claim of LTC, he or she shall be allowed to avail the concession withheld earlier as additional sets in future block years but before his normal date of superannuation.
(Rule-14)

2.In cases, where as a result of departmental enquiry, misuse / abuse or delay in refunding the unutilized portion of the advance drawn and paid is proved, the competent authorities shall take action as indicated below :
(i).The entire amount of the unutilized advance along with penal interest at 18% per annum shall be recovered in one lumpsum.
(ii).The action referred in items (ii) and (iii) of the para-01 also has to be taken. (Rule-15) During the enquiry, the Government employee need not be
kept under suspension. (Rule-16)

Certificates to be insisted up on from the claimant for LTC Bills:
a).Certified that for the block period of ________, I have not submitted any claim so far for leave travel concession in r/o the persons for whom travelling allowance is claimed in this bill.
b).Certified that the advance of travelling allowance for the leave travel concession has been fully adjusted in this bill.
c).Certified that the persons for whose journey the claim is preferred in this bill performed the journeys to and from ____

LEAVE TRAVEL CONCESSION (LTC) COMPLETE DETAILS IN TELUGU

d).Certified that my wife / husband is not a Government employee / is an employee of ______________ and that the concession has not been availed of by her / him separately for herself / himself for any of the family members covered by this claim for the block period _________.
e).Certified that the family members for whom claim has been made in this bill are wholly dependent on me.
f).Certified that my parents for whom the claim is made in this bill are wholly dependent on me and they are not pensioners / job holders.

Certificates to be furnished by the DDO along with the LTC Bills:
a).Certified that the claim was preferred in time by the claimant and that the delay in presentation at the Treasury is due to administrative reasons.
b).Certified that the claim was not preferred and paid previously.
c).Certified that necessary entries were made in the Service Register of the individual regarding the availing of LTC during the block period.

APTC-52 FORM FOR TREASURY BILLS

G.O.NO.58 ABOUT LTC RULES

error: Content is protected !!