new-academic-calender-2020-21-from-July-27th-instructions

new-academic-calender-2020-21-from-July-27th-instructions

ప్రత్యామ్నాయ విద్యాకాలండరు

27-7-20 నుండి 4-9-20వరకు పాఠశాలలో చేయవలసిన కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈరోజు పాఠశాల విద్య 2020 -21 విద్యాసంవత్సరం కరోనా వ్యాప్తికి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్య క్యాలెండరు అమలు గురించి ఆదేశాలు ఇవ్వడమైనది.

*ముఖ్యంగా పాఠశాల తిరిగి పునఃప్రారంభం సెప్టెంబర్ 5వ తేదీ*

 *ఉపాధ్యాయులు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు వారానికి ఒకసారి హాజరు కావాలి. అయితే అందరూ ఒకే రోజు కాకుండా పని విభజన చేసుకుని ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి ప్రధానోపాధ్యాయులు తో కలిసి నిర్ణయించుకోవాలి*

*హాజరైనప్పుడు ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనవసరం లేదు*

*ఇంకా గతంలో మాదిరిగానే దీర్ఘ వ్యాధులతో సతమత ఉన్నవారు, కంటోన్మెంట్లో నివసించే వారు, శారీరక వైకల్యం కలిగిన వారు హాజరు కానవసరం లేదు .

ఇంటి వద్ద నుండి ప్రణాళికలు రూపొందించుకొని పని చేయాలి*

ఉపాధ్యాయులు హాజరు* ::

విద్యార్థివారీ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయడం మొదలుపెట్టాక, ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లోను, ఉన్నత పాఠశాలల్లోనూ కూడా వారానికి ఒకసారి హాజరు కావలసి ఉంటుంది*.

కాని అందరూ విధిగా ఒక్కరోజే హాజరు కావలసిన అవసరం లేదు.

వారు వారు ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి, ఎన్ని సార్లు హాజరు కావాలన్న విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది*.

ఈ ఆదేశాలు నాడు నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి.

ఆ విధంగా హాజరు అయినప్పుడు ఉపాధ్యాయులు *బయో మెట్రిక్ హాజరు నమోదు చెయ్యనవసరం లేదు.

దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నవారు, కంటెయిన్ మెంటు జోన్లలో నివసిస్తున్నవారు, శారీరిక వైకల్యం కలిగినవారు, కంటెయిన్ మెంటు జోన్లలో పాఠశాలలు ఉన్నవారు భౌతికంగా పాఠశాలలకు హాజరు కానవసరం లేదు. 

కాని వారు కూడా తమ తరగతి వారీగా , విద్యార్థివారీగా ప్రణాళికలు తప్పని సరిగా రూపొందించుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ తప్పనిసరిగా ప్రణాళిక అమలు పర్చాలి.

1st CLASS TO 10TH CLASS ALTERNATIVE ACADEMIC CALENDER PROJECTS & ACTIVITIES SUBJECT WISE DOWNLOAD BOOKLET CLICK HERE

దీర్ఘ వ్యాధులతో సతమత ఉన్నవారు, కంటోన్మెంట్లో నివసించే వారు, శారీరక వైకల్యం కలిగిన వారు హాజరు మినహాయింపు కోరుతూ వ్రాసే లెటర్స్

1 TO 5 PRIMARY CLASSES ALTERNATE ACADEMIC CALENDER PDF(ENGLISH)

PRIMARY CLASSES TELUGU ALTERNATIVE ACADEMIC CALENDER PAER-1 DOWNLOAD PDF(తెలుగు)

PRIMARY CLASSES ALTERNATE ACADEMIC CALENDER PART-2 DOWNLOAD PDF(తెలుగు)

6TH AND 7TH CLASSES UPPER PRIMARY CLASSES ALTERNATE ACADEMIC CALENDER PDF

9TH & 10TH CLASSES ALTERNATE ACADEMIC CALENDER PDF DOWNLOAD

SCHOOL ADMISSION APPLICATION FORM PDF DOWNLOAD(English)

SCHOOL ADMISSION FORM IN TELUGU

ఉపాధ్యాయుల పని సమీక్ష

ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా *ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి* *రోజు తల్లిదండ్రులకు* *ఫోన్ చెయ్యవలసి* *ఉంటుంది*.

ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది.

మరుసటి రోజు నుండి రోజుకు అయిదుగురు చొప్పున తల్లిదండ్రులకు మరలా ఫోన్ చేసి వారి పిల్లల పురోగతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి.

ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.

ఆ విధంగా ఉపాధ్యాయుడు తాను చేసిన రోజువారీ పనిని ఒక డైరీలో నమోదు చేసుకుని ఆ పేజీలను *ప్రతి శనివారం ఫొటో లేదా డాక్యుమెంట్* *ఫార్మేట్లో గూగుల్ ఫారంలో అప్ లోడ్ చేయాలి.*

13 DISTRICTS GOOGLE FORM LINKS CLICK HERE

ఆ విధంగా నమోదు చేసిన వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.

*విద్యార్థి వారీ ప్రణాళిక*

మొదటగా ప్రతి ఉపాధ్యాయుడూ తన తరగతిలోని విద్యార్థులకు *విద్యార్థివారీ ప్రణాళికను* రూపొందించుకోవాలి*. విద్యార్థులను* *మూడు విధాలుగా* *విభజించుకోవాలి*.

అ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు *(హై టెక్)*,

ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు *(లో టెక్)*,

ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు *(నో టెక్)*.

గ్రామస్థాయిలోనూ, పట్టణాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులు ఎక్కువమందికి ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేనందువల్ల ముఖ్యంగా వారి పైన దృష్టి పెట్టే విధంగా ఉపాధ్యాయుడు తన ప్రణాళిక తయారు చేసుకోవాలి.

ఆ ప్రణాళికలో ఆయా తరగతుల వారికి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు సూచించిన విధంగా ఈ దిగువ పాఠ్యప్రణాళిక రూపొందించుకోవాలి.

అ) 1 నుండి 5 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా *12 (నాలుగు వారాలు మొదటి భాగం, 8 వారాలు రెండో భాగం) వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో*  చూపిన కృత్యాలు చేయించడం. ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి. వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫొటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు

ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి. ఆ కృత్యపత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేసి వారి ద్వారా విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి. 

దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలు పర్యవేక్షణ,

ప్రత్యామ్నాయ కాలెండర్ పర్యవేక్షించాలి.

ఆ) 6 నుండి 8 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో చూపిన ప్రాజెక్టు పనులు పిల్లలద్వారా చేయించాలి. పిల్లలు అటువంటి కృత్యాలు ఏ విధంగా చేపట్టాలో వారి తల్లిదండ్రులకు వివరించాలి. దూర దర్శన్ ద్వారా ప్రతి వారం ఒక పాఠం ద్వారా వివరించాలి.

దూరదర్శన్ సౌకర్యం ఉన్న విద్యార్థులను లేని విద్యార్థులతో ఇద్దరిద్దరు చొప్పున జతపరిచి సౌకర్యాలు ఉన్న విద్యార్థుల ద్వారా సౌకర్యాలు లేని విద్యార్థులకు సమాచారాన్ని చేరవేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వారు ఆ విధంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నారో లేదో తల్లిదండ్రుల ద్వారా పర్యవేక్షించుకోవాలి.

ఇ) 9, 10 తరగతులకు: వీరికి విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఇందుకుగాను, *నాలుగు వారాల* ప్రత్యామ్నాయ కాలెండరును* ఉపయోగించుకోవాలి.

వారికి ఆన్ లైన్, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు.

 అంతేకాక స్థానికంగా అందుబాటులో ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లయితే వారి సేవలు కూడా వినియోగించుకోవచ్చు.

*పాఠశాల ప్రణాళిక*

ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థి వారీగా తన ప్రణాళిక రూపొందించుకున్న తరువాత ప్రధానోపాధ్యాయుడు వాటిని పరిశీలించి *పాఠశాల ప్రణాళిక రూపొందించుకోవాలి*.

 *జూలై 27 నుంచి సెప్టెంబరు 4 వరకు 40 రోజుల వ్యవధి* ఉన్నందున, నలభై రోజుల ప్రణాళిక ద్వారా తాము ఎటువంటి అభ్యసన ఫలితాలు సాధించబోతున్నదీ నిరంతరం పర్యవేక్షిస్తూ స్పష్టంగా భౌతిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.

*తల్లిదండ్రుల కమిటీ సమావేశం*

పాఠశాలవారీ ప్రణాళిక రూపొందించుకున్నాక, తల్లిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా తక్కిన తల్లిదండ్రులకి సమాచారం అందించాలి.

 ఆ సమావేశంలో తమ ప్రణాళికను వివరించాలి. అలాగే స్థానికంగా ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్ఛంద సేవలు వినియోగించుకునేలా తల్లిదండ్రుల కమిటీకి సూచించాలి.

అటువంటి స్వచ్ఛంద కార్యకర్తలకు ఎటువంటి పారితోషికం ఇవ్వబడదు. ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వబడవు.

వారు తమ సేవలను పూర్తి ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా అందచేయవలసి ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఉండాలి.

*పరీక్షలు*

1 నుండి 8 వ తరగతి వరకు ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదు. కాని మూల్యాంకనం (అసెస్మెంట్) చేపట్ట వలసి ఉంటుంది.

విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు సాధించారా లేదా అన్నది మాత్రం పరిశీలించవలసి ఉంటుంది.

*తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్లు నిర్వహించుకోవచ్చు* గాని, అవి కేవలం ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరుకు సంబంధించినవే అయి ఉండాలి. విద్యాసంవత్సరం ఇంకా మొదలుకాలేదు కాబట్టి, *సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించరాదు*.

విద్యార్థులు, వారికి రూపొందించిన వారాంతపు కృత్యాల ద్వారా పొందవలసిన ‘లెర్నింగ్ అవుట్ కమ్స్’ను సాధించారా లేదా అనే విషయంలో స్పష్టత ఉండాలి.

*ఫ్రీ ప్రైమరీ*

రాష్ట్రంలో కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ ద్వారా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్టు, విద్యార్థులు యూనిఫాం ధరించి ఆన్ లైన్ తరగతులకు హాజరు కావలసిందిగా తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది.

అటువంటి ప్రయత్నాలు చట్టపరంగానే కాక నైతికంగా కూడా చెల్లనేరవు. అటువంటి ప్రయత్నాల్ని సామాజిక దురాచారాలుగా తల్లిదండ్రులు గుర్తించవలసి ఉంటుంది. అటువంటి ఆదేశాలు ఇచ్చే విద్యాసంస్థల్ని అలాంటి ప్రయత్నాలు చేయకూడదని ఇందువెంట ఆదేశించనైనది.

*ఆన్ లైన్ తరగతులు*

ఆన్ లైన్ తరగతుల విషయమై కూడా కొంత స్పష్టత నివ్వవలసిందిగా విద్యార్థి సంఘాలు పాఠశాల విద్యాశాఖను కోరుతున్నారు. అందువల్ల ఈ కింది ఆదేశాలను గమనించనైనది.

అ) *పాఠ్యబోధనకు ఆన్ లైన్ బోధన చేపట్టవచ్చు*. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలందరులో సూచించిన పాఠ్య ప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి.

ఆ) ఆన్ లైన్ అంటే కంప్యూటర్ ద్వారా గాని దూరదర్శన్ ద్వారా గాని చేపట్టే బోధన విషయంలో ఒక రోజుకి ఎంత సమయం కేటాయించాలి అన్నదాని మీద భారత ప్రభుత్వం ఈ విధంగా స్పష్టం చేసింది.

అందులో *పేర్కొన్న సమయానికి మించి ఏ పాఠశాల, ఏ యాజమాన్యంగాని ఆన్లైన్ బోధన చేపట్టరాదు*.

 * *పాఠశాలల్లో ప్రవేశాలు

*అన్ని పాఠశాలల్లోనూ 2020-21 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు చేపట్టవచ్చును*.

ఆ విధంగా ప్రవేశాలు చేపట్టడానికి ఈ దిగువ చూపిన విధంగా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.

అ) కోవిడ్ – 19 నివారణకి చేపట్టిన సూచనలను ఉల్లంఘించకుండా ప్రవేశాలు చేపట్టాలి.

ఆ) *ప్రవేశాల నిమిత్తం ఏ ఒక్క విద్యార్థిని పాఠశాలకు రప్పించరాదు.*

ఇ) 2019-20లో ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1నుండి 7 వరకు, ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 9 వ తరగతి వరకు చదివి, ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించబడ్డ విద్యార్థులందరిని తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేసి వారి పేర్లు* *పాఠశాల అడ్మిషను రిజిష్టరులో పై తరగతిలో నమోదు చేయాలి.*

ఈ) ప్రాథమిక పాఠశాలల్లో 5 వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7 వ తరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులు తదనంతరం ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి.

6వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, 8 వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి.

ఉ) తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చు నిమిత్తం వారి *రికార్డు షీటు / ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు* అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు ఆయా సర్టిఫికేట్లను తల్లిదండ్రులకు విధిగా అందించాలి.

అదే విధంగా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేందుకు *ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు షీటు / ట్రాన్స్ఫర్* సర్టిఫికెట్ల విషయంలో* *నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి.* 

ఒకవేళ విద్యార్థి రికార్డు షీటు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే కాలక్రమంలో వాటిని పొందుపరచమనాలి.

ఊ) ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు పొందే మోడల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలు మొదలైన పాఠశాలల విషయంలో కూడా ఈ సూత్రాన్నే అనుసరించాలి.

ఎ) బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి.

వలస పోయిన కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా పాఠశాలలో చేర్చుకునే బాధ్యత ఉపాధ్యాయులదే.

ఏ) వలస పోయిన కుటుంబాల పిల్లలు, *వలసలనుండి తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో ఐడెంటిటీ* నిరూపణ తప్ప మరే విధమైన ధ్రువపత్రాలూ అవసరం లేదు.*

ఒ) ప్రత్యేక అవసరాల గలపిల్లలను కూడా పాఠశాలలో చేర్పించుకోవాలి. వారికి తగిన విధంగా కృత్యాలను మార్పులు చేసి కనీస అభ్యసన స్థాయిలు పొందే విధంగా చేయాలి.

ఓ) *ప్రవేశాలు పూర్తి కాగానే ఎప్పటికప్పుడు చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేస్తుండాలి.*

దీర్ఘ వ్యాధులతో సతమత ఉన్నవారు, కంటోన్మెంట్లో నివసించే వారు, శారీరక వైకల్యం కలిగిన వారు హాజరు మినహాయింపు కోరుతూ వ్రాసే లెటర్స్

1st CLASS TO 10TH CLASS ALTERNATIVE ACADEMIC CALENDER PROJECTS & ACTIVITIES SUBJECT WISE DOWNLOAD CLICK HERE

FOR MORE DETAILS RC.NO.150 DOWNLOAD CLICK HERE

SCHOOL ADMISSION APPLICATION FORM PDF DOWNLOAD

error: Content is protected !!