WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY30 – 1,2,3,4,5 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :
ACTIVITY 1: – Keep water and seeds for birds in front of your house
ACTIVITY 2 : –
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :
ACTIVITY1:- Keep water and seeds for birds in front of your house
ACTIVITY2:-
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities for Class 3,4,5 Students
ACTIVITY1:- READING
ACTIVITY2:-
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : నమ్మకం ప్రధానం..
నమ్మకం ప్రధానం..
రత్నగిరి రాజ్యానికి జమీందారు రామరాజు. పక్కనే ఉన్న నగరంలో వజ్రాల వ్యాపారి సద్గుణాచారి, ఆయనకు మంచి మిత్రుడు. జమీందారు తన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా.. మిత్రుడు సద్గుణాచారి దగ్గరే వజ్రాల హారాలు తయారు చేయించేవాడు. అతను కూడా నాణ్యమైన వజ్రాలతో తయారు చేసిచ్చేవాడు. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తాడు కాబట్టి.. సద్గుణాచారికి నగరమంతా మంచి పేరు ఉండేది. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రమణాచారి, చిన్నవాడు భీమాచారి. చిన్నవాడు పట్నంలో చదువుకుంటూ తరచుగా వజ్రాల వ్యాపారుల దగ్గరకు వెళ్లి.. వజ్రాల హారాలు తయారు చేయడంలో మెలకువలు నేర్చుకునేవాడు. రమణాచారి మాత్రం తండ్రి దగ్గరే ఉంటూ, వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాడు. సద్గుణాచారికి వయసు మీరడంతో వ్యాపార బాధ్యతలు పెద్ద కుమారుడికి అప్పగించి, ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు.
బాధ్యతలు అప్పగించేటప్పుడు ‘నాయనా! వ్యాపారం ధర్మబద్ధంగా చేయాలి. నాణ్యమైన వజ్రాలతో మాత్రమే హారాలు తయారు చేయాలి. ఇతరులను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. వ్యాపారంలో ఈ సూత్రం పాటిస్తే.. మన పట్ల అందరికీ నమ్మకం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని వ్యాపారం సాగించు’ అని చెప్పాడు సద్గుణాచారి. తండ్రి చెప్పిన విధంగానే వ్యాపారం చేయసాగాడు రమణాచారి. పట్టణంలో చదువు పూర్తి చేసుకున్న భీమాచారి, రత్నగిరికి వచ్చాడు. వ్యాపార బాధ్యతలు చూస్తున్న రమణాచారితో.. ‘అన్నయ్యా! వజ్రాల వ్యాపారం చేస్తూ కూడా మనం సాధారణ జీవితమే గడుపుతున్నాం. కానీ పట్టణంలో వజ్రాల వ్యాపారం చేసేవారు.. ఆడంబరంగా ఉంటారు. మనం కూడా మన అంతస్తును పెంచుకోవాలి. అధిక లాభాలు వచ్చే విధంగా వ్యాపారం చేయాలి’ అని చెప్పాడు. ‘అదెలా సాధ్యం?’ అని అడిగాడు రమణాచారి. ‘మనం చేసే హారాలలో నాణ్యమైన వజ్రాలతో పాటు అక్కడక్కడా నకిలీవి పొదిగితే.. మనకు చాలా లాభం వస్తుంది’ అని బదులిచ్చాడు భీమాచారి. ‘అలా చేయడం తప్పు కదా! మన దగ్గర వజ్రాల హారాలు కొనుగోలు చేసే వారికి, మన మీద నమ్మకం పోతుంది’ అన్నాడు రమణాచారి. ‘కానీ ఆదాయం పెంచుకోవాలంటే, ఇలా చేయక తప్పదు’ అన్నాడు భీమా. ‘వ్యాపారం.. నమ్మకమనే పునాదిపై నిర్మాణం అవుతుంది. ఒక్కసారి నమ్మకం సన్నగిల్లితే.. వ్యాపారమే మూత పడిపోతుంది. నేను న్యాయబద్ధంగానే వ్యాపారం చేస్తాను’ అని రమణాచారి తమ్ముడితో అన్నాడు.
కొన్ని రోజులకు భీమాచారి కూడా సొంతంగా వజ్రాల వ్యాపారం ప్రారంభించాడు. జమీందారు తన కుమార్తె వివాహ నిమిత్తం చెరో వజ్రాల హారం తయారు చేసివ్వమని రమణాచారికి, భీమాచారికి చెప్పాడు. చెప్పినట్లుగానే.. ఇద్దరూ చెరొక వజ్రాల హారం తయారు చేసి జమీందారు దగ్గరకు వెళ్లారు. ముందుగా భీమాచారి తాను తయారుచేసిన హారం ఇచ్చాడు. దాని నాణ్యతను పరిశీలించి.. భీమాచారిని పొడిగాడు జమీందారు. తర్వాత రమణాచారి తెచ్చిన హరాన్ని పరిశీలనగా చూశాడు. అందులో అక్కడక్కడ నకిలీ వజ్రాలు పొదగడం గమనించిన జమీందారు.. ‘మీ నాన్న వజ్రాల వ్యాపారం న్యాయబద్ధంగా చేసేవారు. నేను కూడా వజ్రాల నాణ్యత గురించి ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ నిన్ను హారం చేయమంటే.. నకిలీ వజ్రాలు పొదిగావు. ఇలా చేయడం తప్పు కదా! మీ నాన్న గౌరవం, పేరు ప్రతిష్ఠలు కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. నా స్నేహితుడి కుమారుడివి కాబట్టి, నీకు ఒక మాట చెబుతున్నాను. ఇకపై నాణ్యత లేని వజ్రాలు పొదిగి హారాలు తయారు చేయకు. వ్యాపారం అంటే లాభం కాదు.. నమ్మకం. చక్కని వజ్రాల హారం తయారు చేసి తీసుకురా!’ అని రమణాచారికి చెప్పాడు.
తర్వాత భీమాచారిని పిలిచి.. ‘మీ అన్నయ్య నకిలీ వజ్రాలతో హారం చేయడానికి కారణం నువ్వే.
ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్న తనలో విషబీజాలు నాటావు. అధిక లాభం, ఆడంబర జీవనం వైపు అడుగులు వేసేటట్లు చేశావు. ఈ విషయం మీ నాన్నగారు నాకు చెప్పారు. నువ్వు చేసే హారంలో నకిలీ వజ్రాలు ఉంటాయని అనుకున్నాను. కానీ మీ అన్నయ్య మాటలు విని, నీ ఆలోచనలో మార్పు వచ్చింది. నీ మాటలు విని.. మీ అన్నయ్య పని తీరు మారింది. అది ఎప్పటికీ మంచిది కాదు. అందుకే ఎప్పుడూ.. మంచి వైపే ఆలోచించాలి. అదే మనకు మేలు చేస్తుంది. ఇప్పటి నుంచి న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోండి.. మోసపూరితమైన వ్యాపారం గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తుంది’ అని చెప్పాడు జమీందారు. రమణాచారి, భీమాచారి జమీందారును క్షమాపణ అడిగి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వాళ్ల నాన్నలా న్యాయబద్ధంగా వ్యాపారం చేసి మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : The Tortoise and The Geese
Once there was a tortoise and two geese that lived in a pond. All three of them were great friends and lived happily for many years.
Then a drought struck the land. All the rivers and tanks started drying up. People and animals were dying. The geese decided to leave the country and fly away to some other place. Their friends had told them of a place which had plenty of food and water. When they met the tortoise to bid farewell to him, the tortoise begged them not to leave him alone.
The geese said, “Dear friend, even we do not want to leave you behind in this hour of need. But, unlike you, we cannot sustain without food and water for too long. Our friends tell us of another place which has plenty of food and water. If you could fly, you could come with us too”.
But the tortoise could not fly.
He kept begging the geese to take him along.
Finally, the geese relented. They told the tortoise, “You have very strong jaws. We have though of a plan but it is very risky. You will have to do exactly what we tell you. If you fail to follow our instructions, you will die.”
The tortoise agreed.
They got a stick. The geese held the ends of the stick with their beaks. The tortoise would hold the middle of the stick. The only condition was that the tortoise should not speak or it would fall from the stick to instant death.
The tortoise that this plan was very dangerous. But he did not want to be left behind. He promised to remain silent during the flight.
The geese flew up, carrying the tortoise with them. They flew over hills and fields and a village. As they flew over the village, people clapped their hands and shouted, “Look! How wonderful! The geese are carrying the tortoise. Maybe they have captured the poor animal.”
The tortoise did not like the pointing and staring, and unable to control himself, burst out, “What are these fools…?”
As he spoke these words, he lost hold of the stick and fell from the great height to the ground and died.