9th-class-base-line-test-guidelines-model-papers

9th-class-base-line-test-guidelines-model-papers

04. 11. 2020 న 9 వ తరగతి విద్యార్థులకి baseline టెస్ట్ నిర్వహించాలి  దీనికి సంబంధించి సూచనలు , మోడల్ పేపర్స్*

# Class wise Student wise Data Captured format

# School Report

# Baseline Assessment English testing tools

# Telugu Testing tools

# crp  పిల్లల స్థాయి వివరాలని ఆన్లైన్ లో నింపాలి

ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు*

*️బాలల పఠన సామర్ధ్యాన్ని పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి.

️కోవిడ్-19 నేపధ్యంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలలకు మాత్రమే ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

తేది:04.11.2020న ఉదయం 10గం. నుండి 1గం.. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

• ️ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది.

ప్రశ్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.

మొదటి విద్యార్ధి కి సెట్-1, రెండో విద్యార్ధి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్ధి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి.

• ️ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి.

ఏ మీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి.

మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు అనువాదం చేయించి ఉపయోగించాలి.

• ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి.

• ️ఒక్కొక్క విద్యార్థితో ఒకసారే చదివించాలి.

విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు వేయకూడదు.

ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు చదివించనవసరంలేదు.

• కథలో పూర్తి వాక్యం చదవ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.

• ️వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.

• అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే L 3,

కథ మొత్తం చదవగలిగితే L 4 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.

️9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి.

 ఉదాహరణకు ఒక పాఠశాలలో

60మంది బాలలు 6 మంది టీచర్లు ఉన్నారు అనుకుందాం. ప్రతి టీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి.

SCHOOL REPORT CARD BASELINE TEST

CLASS WISE & STUDENT WISE DATA CAPTURE FORMAT PDF

BASELINE ASSESSMENT ENGLISH TESTING TOOLS

ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.

కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.

• ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒక రోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి.

• పరీక్ష పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోదు చేసి CRP కి అందచేయాలి.

CRP వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలి.

TELUGU TESTING TOOLS PDF

agananna Gorumuddha (MDM) scheme – Distribution of dry ration for the months Sep & Oct , 2020 .. instructions..

error: Content is protected !!