AP-Elections-2019-Instructions-of-Presiding-Officers-P.O/APO-OPO's

AP-Elections-2019-Instructions-of-Presiding-Officers-P.O/APO-OPO’s

AP-Elections-2019-Instructions-of-Presiding-Officers-P.O/APO-OPO’s

ప్రిసైడింగ్ అధికారులకు కొన్ని సూచనలు.*

పోలింగ్ రోజున ముఖ్య భూమిక పోషించేవ్యక్తి ప్రిసైడింగ్ ఆఫీసరు.

P0 గా నియామకం పొందగానే

రెండు శిక్షణా తరగతులకు తప్పక హజరై చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవాలి.

ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన Hand book లోని అంశాలను చదివి అర్ధంచేసుకోవాలి.

పోలింగ్ ముందు రోజున ఉదయాన్నే డిస్ట్రీబ్యూషన్ సెంటరుకు (పంపకాల కేంద్రం) చేరుకోవాలి. R0, S0లను కలవాలి.

ర్యాండమైజేషన్ ద్వారా మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ఉన్న గ్రామం, PS పేరు, నెంబరు వివరాలు తెలుసుకోవాలి.

మీ పోలింగ్ స్టేషన్ కు అలాట్ కాబడిన OP0s, Micro observer, web casting వారిని కలవండి.

డిస్ట్రిబ్యూషన్ సెంటరు (పంపకాల కేంద్రం)లో సిబ్బందితో పాటు వెళ్ళి పోలింగ్ మేటీరియల్ తీసుకోండి.

మెటీరియల్ లో

(1) EVMs including VVPAT,

(2) అన్ని రకాల ఓటరు ట్యాగులు, స్ట్రీప్ సీళ్ళు, పేపరు సీళ్ళు,

(3) ప్రిసైడింగ్ ఆఫిసర్ డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారి డైరి,

(4) బ్యాలట్ పేపర్లు (For tenderd votes)

(5) Marked Copies of electorols,

(6) Form 17A

(7) voter slips

(8) ఇండెలిబుల్ ఇంక్

మొ॥ చాలా ముఖ్యమైనవని గ్రహించండి.

(9)  సామాగ్రి, రికార్డులు, సర్టిఫికేట్లు.

ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీరు తీసుకొన్న EVMs, పేపరు సీళ్ళు, ఓటర్ల జాబితా

 మొ॥ వాటి S.Nos, మీ పోలింగ్ స్టేషన్ కు చెందినవా? కాదా? అని Check చేయండి.

మీ PS వి కాకపోయినా, Damage జరిగివున్నా, Shortfall ఉన్నా S.Nos సక్రమంగా లేకపోయినా  R0 దృష్టికి తీసుకు వెళ్ళండి.

ఆపై రూటు ఆఫీసరు, Sectoral officer, Security తో, ఎన్నికల వాహనంలో PS ను చేరుకోండి.

మీరు, సిబ్బంది ఎట్టి పరిస్థితులలోనూ PSలోనే రాత్రికి ఉండండి.

రాత్రే polling Compartments లోకసభకు, శాసనసభకు ఏర్పాటు చేసుకోండి.

పోలింగ్ కు అనుకూలంగా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసుకోండి.

పోలింగ్ అధికారులకు విధులు కేటాయించండి.

పోటీలో వున్న అభ్యర్ధుల జాబితా 7A ను, 

PS పరిధి, D Nos, ఓటర్ల సంఖ్య తెలిపే పోస్టరులను PS ప్రవేశ ద్వారం వద్ద (బయట) ప్రదర్శనకు ఉంచండి.

PS వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోండి.

ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ మొదలు కావాలి.

పోలింగ్ ఏజంట్ల నియామకం చేయండి.

Mock Poll నిర్వహించండి.

Mock poll గురించి డిక్లరేషన్ మరువవద్దు.

కంట్రోల్ యూనిట్ లో, స్పెషల్ అడ్రస్ ట్యాగ్ లు, అడ్రస్ ట్యాగులు, గ్రీన్ పేపరు సీళ్ళు, స్ట్రీప్ సీళ్ళు మొదలైనవి బిగించండి.

 బ్యాటరీ గురించి ఆలోచన వద్దు.

BUలు, VVPATs కంపార్ట్ మెంట్ లో ఉంచి, cu తో అనుసంధానం చేయండి.

ఓటర్లు క్యూలో ఉండేలాగున చూడండి.

పోలింగ్ ప్రారంభించండి.

Evms మొరాయిస్తే వెంటనే S0 కు తెలియచేయండి.

సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి చర్యలు తీసుకోండి.

మొదటి పోలింగ్ అధికారి అధికారి మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్‌ కు బాధ్యుడు.

 ఇతను ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్ ప్రకారం పేరు, SNo బిగ్గరగా చదవాలి.

 పురుష ఓటర్ల పేరు కింద underline చేయాలి, స్ర్తీ ఓటర్ల పేరు కింద under line చేసి, SNo వద్ద టిక్ పెట్టాలి.

2 వ అధికారి ఓటర్ల రిజిస్టరు (17 A) లో ఓటరు సంతకం / వేలిముద్ర తీసుకొని, ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి ఆరు/ నాలుగు అంకెలను వ్రాయాలి.

ఇతనే  ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను / గుర్తును చెరగని సిరాతో పెట్టాలి.

మూడన అధికారి ఓటరు స్లీప్స్ ఇస్తాడు. లోకసభకు తెలుపు, శాసనసభకు పింక్ /ఆరెంజ్ రంగులో ఇవి ఉంటాయి.

నాలగవ అధికారి లోకసభ కంట్రోల్ యూనిట్‌కు భాద్యుడు. 

ఇతను ఓటరు తెచ్చిన తెలుపు తెలుపు స్లిప్ తీసుకొని CU లో ఓటు రిలిజ్ చేస్తాడు.

5 వ అధికారిగా P0 ఉండవచ్చు. శాసనసభ CU కు incharge.ఓటరు తెచ్చిన పింక్ స్లిప్ తీసుకొని CU లో ఓటు రిలీజు చేస్తాడు.

అన్ని ఓటరు స్లిప్ లు జాగ్రత్త పరచాలి.

గుడ్డివారు, వికలాంగుల కోరికపై companian(సహయకుడు) ని నియమించాలి.

 సహయకుని వద్ద PO hand bookలో చూపిన విధంగా డిక్లరేషన్ తీసుకోండి. ఆ వివరాలను Form 14 A లో వ్రాయండి.

17 A లో సంతకం చేసిన తరువాత, ఓటు వేయనని నిరాకరించిన వారి కొరకు 17 A రిమార్కుల కాలంలో “ఓటు వేయటానికి నిరాకరించినారని ” వ్రాయండి.

CU లో ఓటు రిలీజ్ అయిన తరువాత ఏం చేయాలో Po hand book chapter No 23 చూడండి.

టెండర్ ఓటు గురించి తెలుసుకోండి. ఒకరి ఓటును మరొకరు వేసివుంటే, చిన్న విచారణ అక్కడికక్కడే చేసి, నిజమైతే  టెండర్ బ్యాలట్  పేపరు వెనుక Tenderd ballot అని వ్రాయండి.

ఓటు వేయటానికి క్రాస్ రబ్బరు స్టాంపు ఇవ్వండి. వివరాలను 17E లో వ్రాయాలి. ఇలాంటివి 20 కన్నా ఎక్కువ  ఉండరాదు.

ఛాలెంజ్ ఓటు గురించి మొదటి పోలింగ్ అధికారి వద్ద ఓటరు ఐడెంటిపైనే పోలింగ్ ఏజంట్లు సందేహం వ్యక్తం చేస్తే po, ఓటరు తెచ్చిన ఐడెంటి కార్డుతో ఓటర్ల జాబితాతో సరిచూడాలి. 

నిజమైతే ఓటుకు అనుమతి ఇవ్వాలి. కాకపోతే police లకు complaint ఇవ్వాలి.

ప్రతి రెండు గంటలకొకమారు, మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలెక్టోరల్ తోను, ఓటర్ల స్లిప్స్ తోనూ, CU లో పోలైన ఓట్లతోను సరిచూడలి.ప్రతిగంట/రెండు గంటలకు ఎన్ని ఓట్లు పొలైనాయో S0 కు తెలియచేయాలి

సిక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి మరువవద్దు.

సాయంత్రం 6 గంటల తరువాత కూడా వరుసలో ఓటర్లువుంటే, చివరి వ్యక్తికి ఒకటో నెంబరు స్లిప్స్, మొదటి వ్యక్తికి చివరి నెంబరు ఇవ్వండి.

చివరి వ్యక్తి ఓటు వేయగానే BU లో close బటన్ నొక్కండి.

ps తలుపులు మూయండి.

17A లో చివరి SNo దగ్గరకిందుగా నిలువగీత గీయండి. ఇలా గీస్తే మరలా Enter చేయటానికి వీలుకాదు.

P0 డిక్లరేషన్ వ్రాయండి.

P0 డైరీ వ్రాయండి.అందులో ప్రతికాలమ్ ను జాగ్రత్తగా వ్రాయాలి.తొందరపడవద్దు.

Evms సీలు చేయండి.

రిసెప్సన్ సెంటరులో క్రిందివి తప్పనిసరిగా ఇవ్వాలి.

(1) Evms.

(2) Paper Seal Accounts.

(3) presiding officer Declaration.

(4) presiding officer Dairy.

(5) Staff aquitance rolls.(most probably  s.o may take care of it.)

Pockets to be hand over in Reception centre.

పాకెట్ నెం 1

(a) మార్క్ డ్ కాపీస్ ఓటర్ల జాబితా సీల్డ్ కవరు.

(b) ఓటర్ల రిజిస్టరు ( 17 A) sealed cover.

(c) HOP,APLA ఓటర్ల స్లిప్స్  వేరు వేరుగా ఉంచి సీలు చేసిన కవరు.

(d) unused tenderd ballot papers.

(e) used tenderd ballot papers with Form 17 B Seald cover.

పాకెట్ నెం 2.

(a) మార్క్ చేయబడని ఓటర్ల జాబితా.సీల్డ్ కవరు.

(b) పోలింగ్ ఏజంట్ల నియామకాలు చేసిన ఫారాలు. (ఫారం – 10.)  సీల్డ్ కవర్.

(c) 12 B, EDC సీల్డ్ కవరు.

(d) ఫారం – 14 సీల్డ్ కవరు. ఛాలెంజ్డ్ ఓట్ల గురించి.

(e) అంధుల, వికలాంగుల గురించివున్న Form 14 A, & companian declaration.seald cover.

(f) ఓటర్ల వయస్సు గురించి తీసుకొన్న డిక్లరేషన్.Seald cover.

(g) ఛాలెంజ్ ఓట్లకు ఉన్న, ఇచ్చిన రశీదులు, వసూలైన డబ్బు వున్న కవరు.

(h) వాడని (unused) చెడిపోయిన (damaged) పేపరు సీళ్ళు.

(i) వాడని ఓటరు స్లిప్పుల కవరు.

( j ) వాడని చెడిపోయిన Strip Seals Cover.

పాకెట్ నెం 3.

(1) presiding officer hand book.

(2) Manual of electronics Machins.

(3) చెరగని సిరా and cup

(4) stamp Pad.

(5)  brass seal of po ???

(6) రబ్బరు స్టాంపులు (crossed).

పాకెట్ 4

ఓటర్ల వయస్సు సంబంధించిన డిక్లరేషన్లు, సంచులు, వస్త్రం,

R0 చెప్పిన ఇతర పత్రాలు.

ఈ కవర్ల మీద నియోజకవర్గం పేరు, ని॥వ॥ నెంబరు, PS కేంద్రం పేరు, ps నెంబరు వ్రాయండి.

అంతా సిద్ధమైన తరువాత S0, Route officer, Escort తో ఇచ్చిన వాహనంలో ఆహ్వాన కేంద్రానికి (రిసెప్సన్ సెంటరుకు) రండి.

ఆహ్వానకేంద్రంలో క్యూలో వెళ్ళి అన్ని రికార్డులు, Evms, ఇతర సామాగ్రి ఇచ్చి రశీదు పొందండి.

చివరిగా నా మాట ప్రిసైడింగ్ ఆఫీసరు ధైర్యంగా, డైనమిక్ గా, తెలివిగా ప్రవర్తిస్తే పోలింగ్ సులభంగా జరిగిపోతుంది.

 *PO hand book చదవండి, అలాగే చేయండి.*

ELECTIONS-2019 TRAINING DATES CLICK HERE

error: Content is protected !!