Changes-of-8th-9th-10th-class-Physical-Science-Text-books-PDF-Files-2019

Changes-of-8th-9th-10th-class-Physical-Science-Text-books-PDF-Files-2019

మొదటగా అన్ని తరగతులలో ను((8,9,10) పాఠాల సంఖ్య =12  గా చేశారు.

 

?‍♂ 8 వతరగతికి వచ్చేసరికి గతంలో 10 పాఠాలు ఉండేవి.వీటిని యధాతధంగా అలాగే ఉంచి ఇపుడు అదనంగా రెండు పాఠాలు చేర్చారు. చేర్చిన రెండు ఏవంటే 

 

1.సమతలాల వద్ద పరావర్తనం.

    దీనిని పదవతరగతిలో తొలగించి 8 లో చేర్చారు.

 

2. మన చుట్టూ ఉండే పదార్ధం.

     దీనిని 9 వ తరగతి(మొదటి పాఠం) నుండి తొలగించి 8 లో చేర్చారు.

 దీనితో 8 లో పాఠాల సంఖ్య 12 అయ్యింది.

 

?‍♂ 9 వ తరగతికి వచ్చేసరికి గతంలో ఉన్న పాఠాల సంఖ్య 10. వీటినుండి మొదటి పాఠం ను తొలగించి 8 కి కలిపారు. అపుడు9th లో 9 పాఠాలు అవుతాయి. వీటికి 3 పాఠాలు కొత్తగా చేర్చారు. అవి ఏవంటే.

1. రసాయన చర్యలు-రకాలు

(దీనిని 10 వ తరగతిలో తీసేసి ఇక్కడ కలిపారు).

2. వక్రతలాల వద్ద పరావర్తనం

(యిది కూడా10 వ తరగతిలో తొలగించి ఇక్కడ చేర్చడం జరిగింది).

3. ప్రమాణాలు- గ్రాఫ్ లు.

యిది పూర్తిగా కొత్తగా చేర్చబడిన పాఠం.

దీనితో9 వ తరగతిలో కూడా 12 పాఠాలు అయ్యాయి. 

?‍♂ఇక పదవ తరగతి సంగతి అందరికీ తెలిసిందే. గతంలో 14 పాఠాలు ఉండేవి.

వాటిల్లో రెండు పాఠాలు తొలగించి 8,9 తరగతులలో సర్దారు. 

కనుక 10వతరగతి లో కూడా 12 పాఠాలు అయ్యాయి.

8th CLASS P.S NEW TEXT BOOK-2019 (E.M)

8TH CLASS P.S TEXT BOOK NEW 2019 (T.M)

9వ తరగతిలో

మన చుట్టూ ఉన్న పదార్థం  తొలగించబడినది

వక్రతలాల వద్ద పరావర్తనం 

రసాయన చర్యలు సమీకరణాలు

ప్రమాణాలు – గ్రాఫ్ లు (కొత్త పాఠం)

మొత్తం 12

రసాయన సమీకరణాలు చాప్టర్ 9th క్లాస్ కి,  కాంతి పరావర్తనం chapters ను సమతలాల వద్ద కాంతి పరావర్తనం వరకు 8th క్లాస్ కి, వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 9th క్లాస్ కి షిఫ్ట్ చేయబడ్డాయి.*

*?అభ్యసనాన్ని మెరుగు పరచుకొందాం అనే శీర్షికన ఇచ్చే ప్రశ్నలలో కొన్నిటిని తగ్గించి, ఆ తగ్గించిన వాటిని ”ప్రయత్నించండి ‘ ‘అనే ఒక కొత్త శీర్షికతో విడిగా ఇవ్వడం జరిగింది.*

ఉదాహరణకు ఆమ్లాలు క్షారాలు పాఠం లో బీట్రూట్ సూచిక తయారీ, ఒకే పొడవు కల మెగ్నీషియం ముక్కలతో ఆమ్లాల చర్య వీటిని ప్రశ్నల జాబితా నుండి తీసేసి ప్రయత్నించండి అనే శీర్షిక కింద ఇవ్వడం జరిగింది.

*?ప్రతీ చాప్టర్ కు చివర ఆ చాప్టర్ లో ఆక్టివిటీస్ నిర్వహించడానికి అవసరమయ్యే మెటీరియల్ వివరాలు ఇచ్చారు.*

*?ఉష్ణం చాప్టర్ లో ఉష్ణ బదిలీకి సంబంధించి ఒక కొత్త సమస్య ను ఉదాహరణగా ఇవ్వడం జరిగింది.*

*?మూలకాల వర్గీకరణ చాప్టర్ లో మాండలీఫ్ ఆవర్తన పట్టిక తో పాటుగా మాడిఫైడ్ మాండలీఫ్ ఆవర్తనపట్టిక కూడా ఇవ్వడం జరిగింది.*

*?రసాయన బంధం పాఠం లో కొన్ని అణు నిర్మాణాల పటాల్లో modification*

*?విద్యుత్ ప్రవాహం చాప్టర్ లో రియోస్టాట్ తయారీ విధానాన్ని చేర్చారు. ఓం నియమం కృత్యాలు*

*అలాగే కిర్చాఫ్ లూప్ నియమానికి అవసరమైన 

సంజ్ఞా సాంప్రదాయం ను పటా ల తో విపులంగా వివరించారు.

అలాగే లూప్ లా కి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు కూడా చేర్చారు.

*?కర్బన సమ్మేళనాలు చాప్టర్లో ఆల్కయిల్ గ్రూప్స్ ను వివరించే పట్టిక ను చేర్చారు.*

*కర్బన సమ్మేళనాల నామకరణం విధానమ్ లో సరళీకరణ*

10 వ తరగతి – 12 పాఠాలు

9 వ తరగతి – 12 పాఠాలు

8 వ తరగతి – 12 పాఠాలు

10 వ తరగతి సిలబస్ తగ్గించి 8,9 కు adjust చేయడం జరిగింది.

9TH CLASS P.S NEW TEXT BOOK 2019 (E.M)

9TH CLASS P.S TEXT BOOK NEW 2019 (T.M)

10TH CLASS P.S NEW TEXT BOOK 2019 (T.M)

10TH CLASS P.S NEW TEXT BOOK 2019 (E.M)

error: Content is protected !!