How-to-Download-PAN-Card-e-PAN-Card-in-online
How-to-Download-PAN-Card-e-PAN-Card-in-online
e-PAN Card: ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా…
ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవారు ఇ-పాన్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పాన్ కార్డ్… ఆర్థిక వ్యవహారాలకు అవసరమైన డాక్యుమెంట్.
అయితే పాన్ కార్డ్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవడం అందరికీ అలవాటు ఉండదు.
ఎప్పుడైనా ఎక్కడైనా పాన్ కార్డ్ అవసరమైతే ఏం చేయాలో తోచదు.
ఇక ఏ టెన్షన్ అవసరం లేదు.
మీరు ఇ-ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టుగానే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డిజిటైజేషన్‌ను ప్రమోట్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ… ఎలక్ట్రానిక్ పాన్ కార్డుల్ని జారీ చేస్తుంది.
వాటినే ఇ-పాన్ కార్డులు అంటారు.
ఇ-పాన్ కార్డు కూడా ఫిజికల్ పాన్ కార్డులాగే ఉంటుంది.
ఇ-పాన్ కార్డుపై పేరు, ఫోటో, తల్లి లేదా తండ్రి పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి.
ఇ-పాన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది.
ఫిజికల్ పాన్ కార్డుపైన క్యూఆర్ కోడ్ ఉండదు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ వివరాలు తెలుస్తాయి.
ఏదైనా ప్రూఫ్ లేదా వెరిఫికేషన్ కోసం మీరు ఇ-పాన్ కార్డ్ కూడా సబ్మిట్ చేయొచ్చు.
ఫిజికల్ పాన్ కార్డులు ఉన్నవారంతా ఇ-పాన్ కార్డులు తీసుకోవచ్చు.
కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసినవాళ్లు మాత్రమే కాదు… ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవాళ్లు కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరైనా కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే… దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి ఇమెయిల్ ఐడీకి ఇ-పాన్ కార్డ్ కాపీ వస్తుంది.
ఇ-పాన్ కార్డును ఉచితంగానే అందిస్తుంది ఆదాయపు పన్ను శాఖ.
ఫిజికల్ పాన్ కార్డుకు మాత్రం రూ.107 చెల్లించాలి.
NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో నుంచి కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంతేకాదు… పాన్ కార్డ్ ప్రాసెసింగ్ సెంటర్లల్లో దరఖాస్తు చేసిన 10 నిమిషాల్లోపే ఇ-పాన్ కార్డులు జారీ చేసేలా వ్యవస్థ రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఇందుకోసం ఆధార్ నుంచి ఇ-కేవైసీ సేకరిస్తుంది. ఇక ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవారు ఇ-పాన్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇ-పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ముందుగా NSDL లేదా UTITSL వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇ-పాన్ కార్డు డౌన్లోడ్ చేయడానికి అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ తప్పనిసరి.
అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
‘download PDF’ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.
error: Content is protected !!