The-Right-To-Information-Act-RTI-Bringing Information-Citizens

The-Right-To-Information-Act-RTI-Bringing Information-Citizens

The-Right-To-Information-Act-RTI-Bringing Information-Citizens

సమాచార హక్కు చట్టం అంటే:::-

సహ చట్టం సెక్షన్ 2(జే)ప్రకారం పాలనలో పారదర్శకత ,జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ  యంత్రాంగం అదుపులో వున్న సమాచారాన్ని 

పౌరులు పొందడం:  

 *సమాచారం అంటే:::*-

ప్రభుత్వ కార్యాలయాల్లోని సహ చట్టం,సెక్షన్ 2(ఎఫ్)మేరకు  రికార్డులు,పత్రాలు,మేమోలు,ఈమైల్,అబిప్రాయాలు,ఆదేశాలు,ఒప్పందాలు,పత్రిక ప్రకటనలు,ఒప్పందాలు,కాంట్రాక్టులు,సర్క్యులర్లు,ఉత్తర్వులు,నమూనాలు,సలహాలు,కమ్ప్యూటర్లలో నిక్షిప్తం అయీన డేటా,సీడీ,డీవీడీ,ప్లాపి,మరే ఇతర రూపంలో వున్న సమాచారం:

*సమాచారాన్ని ఎవరిని అడగాలి అంటే:::-*

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 5(1)మేరకు ప్రజా సమాచార  అదికారి/సహాయ ప్రజా సమాచార అదికారి వుంటారు.సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలి.అతనికి మనకు కావాల్సిన సమాచారాన్ని దరకాస్తు చేసుకొని పొందవచ్చు.

 *దరఖాస్తు నమూనా వుందా::::-*

సహ చట్టం మేరకు దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు.తెల్లకాగితంపై సమాచారం కోసం విన్నపం అని వ్రాసి ఇస్తే చాలు.

దరఖాస్తు రుసుము వివరాలు:::*-

గ్రామస్థాయి సంస్థలకు—ఉచితం

మండలస్థాయిలో——5/-రూ:,

జిల్లా,రాష్ట్ర,కేంద్ర స్థాయి సంస్థలకు :—————10/రూ:చెల్లించాలి.

దరఖాస్తురుసుము ఎలా చెల్లించాలి:::*

జీ.ఓ.ఎంఎస్.నెం:740,సహ చట్టం,సెక్షన్7(3)మేరకు నగదు,ఇండియన్ పోస్టల్ ఆర్డర్,బ్యాంకు చెక్కు,డి.డి,ఛలాన,రూపంలో చెల్లించవచ్చు.

 *దరకాస్తు రుసుం ఉచితం::-*

సహ చట్టం,సెక్షన్ 7(5)మేరకు దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి ఉచితం.రేషన్ కార్డు వున్న వారికి వర్తిస్తుంది.

 *సమాచారం ఎందుకు అని అడిగే అధికారం ఎవరికి లేదు:*

సహ చట్టం,సెక్షన్ 6(2)ప్రకారం కోరుతున్న సమాచారం ఎందుకని దరకాస్తుదారిని అడిగే అధికారం ఎ అదికారికి లేదు.

సమాచారం ఇవ్వటకు గడువు వుందా:::*-

సహ చట్టం-2005,సెక్షన్ 7(1)మేరకు 30రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి.అయీతే

 *అత్యవసర సందర్భంలో ఇవ్వాల్సిన సమాచారం::-*

వ్యక్తి స్వేచ్ఛ,జీవించే హక్కులకు భంగం కలిగే సందర్భంలో 48గంటల్లో ఇవ్వాలి.

 *సమాచారం ఇవ్వకుంటే: ::-*

సహ చట్టం,సెక్షన్19(1)మేరకు ప్రభుత్వ కార్యాలయం యొక్క వున్నత అదికారికి మొదటి అప్పీలు చేయాలి.30-45రోజుల్లో సమాచారం ఇవ్వాలి.

 *అప్పటికి సమాచారం రాకుంటే:::-*

90రోజుల వ్యవదిలో 

     రాష్ట సమాచార కమీషన్కు,సెక్షన్ 19(3)మేరకు అప్పీలు చేయాలి:గడువు సహ కమిషన్ నిర్దేశిస్తుంది.

 *సమాచారం ఇవ్వని అదికారులకు జరిమానా,శిక్షలు ఏమైన వున్నాయా::-*

దరకాస్తు తీసుకోవడానికి నిరాకరించిన,ఎక్కువ దరకాస్తు రుసుం కోరిన,తెలిసి అసంపూర్తి,తప్పుడు సమాచారం ఇచ్చిన, సమాచారం నిరాకరించడం,కోరిన సమాచారాన్ని ద్వంసం  చేయడం,సమాచారం ఇవ్వడాన్ని అడ్డుకోవడం ఇవ్వన్నీ నేరాలే వీటికి పాల్పడిన ప్రజా సమాచార అదికారికి సహ చట్టం,సెక్షన్ 20(1)మేరకు రోజుకు 250నుండి 25,000వేల వరకు జరిమానా విధించే అదికారం సహ కమీషన్కు వున్నది.తరచూ సహ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అదికారులకు సెక్షన్20(2)మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు.

 *నిర్దిష్ట వ్యవధి దాటిన సమాచారం ఉచితంగా ఇవ్వాలి::::-*

సహ చట్టం,సెక్షన్ 7(6)మేరకు 30రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి.

స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారం::*

సహ చట్టం,సెక్షన్ 4(1)(బి)మేరకు ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విధులు,భాద్యతలు,విధినిర్వహనలో పాటించే సూత్రాలు,జవాబుదారీతనం,పారదర్శకతకు వున్న మార్గాలు,ఉద్యోగులు వివరాలు ,వారి నెలవారి జీత భత్యాలు,బడ్జెట్ కేటాయింపు,రికార్డుల పట్టికలు,రాయితీల వివరాలు,పీఐఓల వివరాలు,సలహా సంఘాలు తదితర వాటికి సంబందించిన 17 అంశాల సమాచారం ఎవరూ అడుగక ముందే స్వచ్ఛందంగా వెల్లడించాలి.

 *నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిందే::-*

సహ చట్టం,సెక్షన్ 4(1)(సి)మేరకు ముఖ్యమైన విధానాలు రూపొందించేటపుడు,ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలు ప్రకటించేటపుడు వాటికి సంబందించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.అంటే కొత్త చట్టాలు తెచ్చే ముందు,ఉన్నవాటికి సవరణలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.

 *రికార్డుల తనిఖీ చేసే అదికారం ఎవరికైన ఉంది:::*

దరకాస్తు చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోన్ని అన్ని రికార్డులను,చేపడుతున్న అభివృధి కార్యక్రమాలను అధికారుల సమక్షంలో పరిశీలించవచ్చు,(నిర్మాణ పనులు,ప్రజా సంక్షేమ పధకాల అమలు) కావలసిన రికార్డులను సహ చట్టం,సెక్షన్ 2(జె)(1)మేరకు తనిఖీ చేయవచ్చు.&సహ చట్టం,సెక్షన్ 2(జె)(2)మేరకు నకలు,ఫోటో,వీడియో పొందవచ్చు ,అయీతే సమాచార ప్రతిపై పిఐఓ ధ్రువికరించి ఇవ్వాలి.

 *సమాచారం పొందుటకు చెల్లించాల్సిన రుసుములు వివరాలు:::-*

జీఓ ఎంఎస్.నం:454మేరకు 

A3/A4 కాగితానికి—–2/-రూ..

ప్లాపికి ———————-50/-రూ.

సీడీ కి ———————-100/-రూ.

డి వి డి కి ——————200/-రూ.

 *సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపు పొందినవి:::-*

సహ చట్టం,సెక్షన్ 8 మేరకు దేశ భద్రత,సమగ్రతకు ముప్పు వాటిల్లె,ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే,పొరుగు దేశాలతో మైత్రి చెడిపోయే,చట్ట సభల హక్కులకు భంగం కల్గే సందర్భలలో ఈ చట్టం వర్తించదు.

 *భద్రతా,నిఘా సంస్థలకు మినహాయింపు ఉంది:::-*

సహ చట్టం,సెక్షన్ 24 మేరకు దేశ భద్రత,నిఘా సంస్థలైన 

ఇంటెలిజెన్స్ బ్యూరో,

రెవెన్యూ  ఇంటెలిజెన్స్,

రా(క్యాభినేట్ సెక్రటేరియట్ రీసెర్చ్&అనాలసిస్ వింగ్),

కేంద్ర రిజర్వు పోలీస్ దళం

,సరిహద్దు భద్రత బలగం,

కేంద్ర పారిశ్రామిక భద్రత దళం,

జాతీయ రక్షక దళం,

ఇండియన్-టిబెట్ సరిహద్దు బలగం,

అస్సాం రైపిల్ ఫోర్స్,

ఏన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్,

సిఐడి-అండమాన్ నికోబార్,

స్పెషల్ బ్రాంచ్ సిఐడి-లక్యదీప్,

ఏరోనాటికల్స్ రీసెర్చ్ కేంద్రం లాంటిికి మినహాయింపు  వుంది.అయీతే ఇందులో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనకు సంబందించిన  సమాచారం తీసుకోవచ్చు.

 *ఒక సంస్థకు సంబందం కానిదైతే సంబందిత సంస్థకు పంపాలి::-*

సహ చట్టం,సెక్షన్6(3)మేరకు దరకాస్తుదారుడు కోరిన సమాచారం ఒక సంస్థకు(కార్యాలయానికి)చెందినది కానట్టఐతే సదరు పిఐఓ సంబందిత సంస్ధకు  పంపాలి.దరకాస్తు అందిన “5” రోజుల్లోపు పంపి విషయం దరకాస్తుదారుడికి చెప్పాలి. అంటే:::-

 *చట్టం పరదిలోకి వచ్చే సంస్థలు:*

సహ చట్టం,సెక్షన్2(h)మేరకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ  కార్యాలయాలు&సెక్షన్ 2(h)(2)ప్రకారం ప్రభుత్వాల నుండి ప్రత్యక్షంగా,పరోక్షంగా,నిధులు,రాయితీలు,భూకేటాయింపులు పొందిన ప్రయీవేటుసంస్థలు కూడా అదికార యంత్రాంగాల క్రిందకు వస్తాయి.

 *దరకాస్తుదారు కోరిన రూపంలోనే సమాచారం ఇవ్వాలి::-*

సహ చట్టం,సెక్షన్ 7(9)మేరకు ఎక్కువ ఆర్థిక వనరులు ఖర్చైయ్యే,రికార్డు భద్రత ప్రమాదంలో పడుతున్న సంధర్భంలో తప్పా దరఖాస్తుదారు కోరిన రూపంలో సమాచారం ఇవ్వాలి.

 *దరకాస్తుదారుడి పై చర్యకు అవకాశం లేదు:::-*

సహ చట్టం,సెక్షన్ 21ప్రకారం ,ఈ చట్టం క్రింద రూపొందిన నిబంధనల మేరకు మంచి చేస్తున్నామని నమ్మకంతో ఎవరు ఏమి చేసిన,వారిపై ఎటువంటి ధావాలు వేయడం,న్యాయవిచారణ చేయడం,చట్టపరమైన చర్యకు తీసుకోవడం కుదరదు…

 *సహ కమీషన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఏ న్యాయస్థానానికి లేదు::-*

సహ చట్టం,సెక్షన్ 23మేరకు కమిషన్ జారీచేసిన ఆదేశాలపై దావాను వేయడం,ఇతర విచారణను ఏ న్యాయస్థానం  చేపట్టకూడదు.ప్రశ్నించకూడదు 

     *దరఖాస్తుదారు పరిహారం పొందొచ్చు:* 

నిర్దేశిత గడువులో సమాచారం దొరకనప్పుడు కమిషన్కు వెళ్లాల్సి వస్తే సహ చట్టం సెక్షన్19(8)(బి) ప్రకారం పరిహారం పొందవచ్చు. 

 *సహ చట్టం ప్రచార భాద్యత  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలది::-*

సహ చట్టం తాలూకా ప్రయోజనాలను ప్రజలకు అందించి వారిలో అవగాహన కల్పించే భాద్యత సహ చట్టం సెక్షన్ 26 మేరకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల విధి.

THE RIGHT TO INFORMATION MAIN WEBSITE CLICK HERE

THE RIGHT TO INFORMATION ACT (RTI) “RAJAPATHRAM” CLICK HERE

error: Content is protected !!