ap-mid-day-meal-mdm-decentralized-approach-dec-2019

ap-mid-day-meal-mdm-decentralized-approach-dec-2019

RC.NO.SE02, dated 26/12/2019పాఠశాల విద్యాశాఖ-మధ్యాహ్న భోజన పథకం, గుడ్లు,కందిపప్పు, నూనె సంబంధిత బిల్లుల చెల్లింపు వికేంద్రీకృత విధానం డిసెంబర్-2019 నుండి అమలు పరచడం గురించి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారి తదుపరి ఉత్తర్వులు

అందరు మండల విద్యాశాఖాధికారుల కు సూచించునది ఏమనగా, కమీషనరు పాఠశాల,  విద్యా శాఖ వారు,  పై పేర్కొనబడిన ఆదేశాల ద్వారా మద్యాహ్నభోజన పథకంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల బిల్లుల చెల్లింపు విధానాన్ని వికేంద్రీకరణ చేయడం జరిగింది.

అదే విధంగా ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్డు సరఫరా మరియు వినియోగం నమోదు చేయుటకు వీలుగా MDM APP నందు మార్పులు చేయడమైనది. ఈ అంశాలను పాఠశాల స్థాయి వరకు చేరులాగా తగు చర్యలు తీసుకోవలసినదగా కోరడమైనది.

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లుల కోసం కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది . ఏ . పి . సి . ఎఫ్ . ఎస్ . ఎస్ యొక్క సహకారంతో ఈ విధానములో అన్ని బిల్లులు చెల్లింపు జరుగుతున్నది*

వంట ఖర్చు మరియు గౌరవవేతనానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు అధికారాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించడం జరిగినది . ఈ విధానంలో బిల్లుల చెల్లింపు విజయవంతముగా జరుగుతున్నది*

 పై విధానములను నిశితముగా పరిశీలించిన పిదప కోడి గుడ్డు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి , గుడ్ల సరఫరాకు సంబంధించి బిల్లుల చెల్లింపు విధానమును కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించుటకు నిర్ణయించడమైనది*

జిల్లా విద్యాశాఖాధికారులందరికీ తెలిజేయునది ఏమనగా ఎన్ . ఐ . సి సహాయంతో ఎం . డి . ఎం పథకం కోసం ఉద్దేశించిన మొబైల్ యాప్ లో కోడి గుడ్ల సరఫరా , వినియోగం మరియు అవసరాలకు సంబంధించిన డేటా సేకరణ కోసం అవసరమైన మార్పులు చేయడం జరిగినది*

 తదనుగుణముగా జిల్లా విద్యాశాఖాధికారులు / మండల విద్యాశాఖాధికారులు / ఉపవిద్యాశాఖాధికారులు / ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది . చర్యలను వెంటనే అమలు పరచవలసినదిగా ఆదేశించడమైనది*

*1. ప్రధానోపాధ్యాయులు యమ్ . డి . యమ్ కోసం ఉద్దేశించిన మొబైల్ అనువర్తనాన్ని వెంటనే అప్లైట్ చేసుకోవాలి . డేటా ఎంట్రీ స్కూల్ యు – డైస్ కోడ్ మరియు ప్రధానోపాధ్యాయులు యొక్క అధీకృత మొబైల్ నంబర్ లో మాత్రమే సాధ్యమవుతుంది*

*2 . హాజరు , మధ్యాహ్న భోజనం తీసుకున్న పిల్లలు , కోడి గుడ్ల వినియోగం మొదలైన వాటికి సంబంధించిన మొత్తం డేటా మధ్యాహ్న భోజనం అయిన వెంటనే నమోదు చేయాలి . గుడ్లు అందుకున్న డేటాను సరఫరాదారుల నుండి గుడ్లు అందుకున్న సమయంలో నమోదు చేయాలి*

 *3 . ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ( ఎపి సిఎఫ్ఎస్ఎస్ ) వారు మధ్యాహ్న భోజన పథకానికి ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్లో హెడ్ మాస్టర్స్ అందించిన డేటా ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి పేరిట బిల్లును తయారు చేస్తారు . అలా తయారు చేసిన బిల్లు ప్రతి నెల 5 వ తేదీలోగా డి . ఇ . ఓకు పంపబడుతుంది*

మనం ప్రతిరోజు MDM తీసుకున్న పిల్లల వివరాలను నమోదు చేసి వారికి ఎంత ఖర్చయింది నెల చివరి రిపోర్టు ఇవ్వవలసి ఉంటుంది.

దీనికిగాను మీరు కింద ఇచ్చిన సాఫ్ట్వేర్లో మీ పాఠశాల వివరాలు ,మీ పిల్లలు అటెండెన్స్ వివరాలను ఇచ్చినట్లయితే బియ్యం ,గుడ్లు కు సంబంధించిన అన్ని ప్రొఫార్మా లు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.

MID DAY MEAL (MDM) BILL SOFTWARE-2020 LATEST BILL

FOR MORE DETAILS RC.NO.SE02, dated 26/12/2019

error: Content is protected !!