apsrtc-employees-happy-CM-ys-jagan-announcement-DEC-2020

apsrtc-employees-happy-CM-ys-jagan-announcement-DEC-2020

ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు.

ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో

విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు

  • సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి.

  • ఆర్టీసీ లాభనష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. పదవీ విరమణ

  • వయసు 60 ఏళ్లుగా ఉంటుంది.

  • కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను రెండేళ్లలో చెల్లిస్తారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు నగదు చెల్లిస్తారు.

  • ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు.. అధికారుల పెత్తనం తగ్గుతుంది.

  • పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు.

ACTs – STATE – The Andhra Pradesh State Road Transport Corporation
(Absorption of Employees into Government Service) Act, 2019. – Publication
ordered as Andhra Pradesh Act No. 36 of 2019. LAW (I) DEPARTMENT

G.O.MS.No. 97     Dated: 27-12-2019
ORDER:
The Andhra Pradesh State Road Transport Corporation (Absorption of Employees into Government Service) Act, 2019 will be published in the Andhra Pradesh Gazette in English, Telugu and Urdu Languages as Andhra Pradesh

Act No. 36 of 2019.

విలీనం రైట్‌ రైట్‌

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ఏపీఎస్‌ ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించిన శాసనసభ

1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు

హామీని నెరవేర్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికుల కుటుంబాలు 

FOR MORE DETAILS G.O.MS.NO.97, DT.27-12-2019 ACT NO. 36 OF 2019PDF FILE

ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో97

 ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది.

51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి
జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు.

దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థగా అవతరించనుంది.

దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపబడనున్నారు.

ఇక ఆర్టీసీ విలీనానికి సంబంధించి  ప్రభుత్వం గెజిట్‌ నొటిఫికేషన్‌ను జారీ చేయనుంది.

ఇకపై కార్మికులు కాదు..

ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. పూర్తిగా ప్రభుత్వ సంస్థ మారనుంది.

ఆర్టీసీ కార్మికులు సైతం రాబోయే రోజుల్లో ఉద్యోగులుగా మారనున్నారు.

జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతారు.

వీరంతా జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులే.   

G.O.MS.NO.97, DT.27-12-2019 ACT NO. 36 OF 2019

FOR MORE DETAILS G.O.MS.NO.97, DT.27-12-2019 ACT NO. 36 OF 2019

error: Content is protected !!