CBSE-exams-class-1st-to-8th-class-9th-11th-class-promoted-no-exams

CBSE-exams-class-1st-to-8th-class-9th-11th-class-promoted-no-exams

సీబీఎస్‌ఈ పరీక్షలు*

★ కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్‌కి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కీలక ఆదేశాలు జారీ. 

★1 నుంచి 8వ తరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ఆదేశం.

★ పాఠశాలలో గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా 9, 11వ తరగతుల విద్యార్థులను సైతం ప్రమోట్‌ చేయాలని సూచన. 

★ పరీక్షలకు హాజరు కాని 9, 11వ తరగతుల విద్యార్థులను ప్రమోట్‌ చేయొద్దని ఆదేశం. 

★ 29 ప్రధాన సబ్జెక్టులకే సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని హెచ్‌ఆర్డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ వెల్లడి. 

★ వర్సిటీ ప్రవేశాలు, ప్రమోట్‌కు అవసరమైన సబ్జెక్టులకే పరీక్షలు ఉంటాయని స్పష్టంచేశారు. 

★ ముందస్తు సమాచారం ఇచ్చి బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని, మిగతా సబ్జెక్టులకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించదని వివరణ.

సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ ప్రభావం పరీక్షలపై పడింది.

కేంద్రం ఆదేశాలతో టెన్త్, 12వ తరగతి పరీక్షలను మార్చి 31 తర్వాతికి వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రకటించగా.. కోవిడ్ ఎఫెక్ట్ పరీక్షలపైనా పడింది.

టెన్త్, ప్లస్ టూ పరీక్షలను వాయిదా వేయాలని సీబీఎస్ఈని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది.

దేశంలోని అన్ని పాఠశాల, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, టెక్నికల్ ఎంట్రన్స్ టెస్టులను కూడా వాయిదా వేయాలని కేంద్రం సూచించింది. 

మూల్యాంకనం కూడా తర్వాత నిర్వహించేలా వాయిదా వేయాలని ఆదేశించింది. 

కేంద్రం సూచనలతో మార్చి 19 నుంచి మార్చి 31 తేదీల మధ్య జరగాల్సిన టెన్త్, ప్లస్ 12 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. సీఏఏ అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీలో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడగా.. వాటిని కూడా మరోసారి రీషెడ్యూల్ చేయనున్నారు.

పరిస్థితిని సమీక్షించి మార్చి 31 తర్వాత నూతన షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. 

ఇంతకు ముందు షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ పరీక్షలు ఈశాన్య ఢిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లో మార్చి 30తో పూర్తి కావాల్సి ఉంది.

ఈశాన్య ఢిల్లీలో కొన్ని పరీక్షలను ఏప్రిల్ 14 వరకు సీబీఎస్ఈ రీషెడ్యూల్ చేసింది.

‘అకడమిక్ క్యాలెండర్, ఎగ్జామ్ షెడ్యూల్ ముఖ్యమే కానీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, టీచర్లతోపాటు తల్లిదండ్రుల భద్రత కూడా అంతే ముఖ్యం’ అని హెచ్ఆర్డీ సెక్రటరీ అమిత్ ఖరే తెలిపారు. 

హెచ్ఆర్డీ ఆదేశాలతో యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఐఓఎస్ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడతాయి.

జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ను కూడా వాయిదా వేయాలని మానవ వనరుల శాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది.

NO EXAMS FROM 1ST CLASS TO 8TH CLASS & 9TH, 11TH CLASS PRESS NOTE

error: Content is protected !!