List-of-groups-after-tenth-10th-class-ap-students-details

List-of-groups-after-tenth-10th-class-ap-students-details

పదోతరగతి పూర్తికాగానే అత్యధికశాతం విద్యార్థులు ఇంటర్మీడియట్‌పైనే దృష్టి సారిస్తారు. 

భవిష్యత్తులో ఉన్నత విద్యకైనా, ఉద్యోగానికైనా ఇంటర్‌ చదవడం తప్పసరి కావడమే దీనికి కారణం.

అందుకే ఇది కెరీర్‌ను నిర్దేశించే కీలకమైన మలుపులాంటిది.

ఒకరకంగా విద్యార్థి జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది.

అందుకే ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకోవాలనే అంశానికి చాలా ప్రాధాన్యం ఉంది.

మొత్తం జీవితగమనాన్నే నిర్దేశించే గ్రూప్‌ ఎంపికకు ముందు విద్యార్థులు కొంత సమయాన్ని కేటాయించి వాటిని గూర్చిన అవగాహన పెంచుకోవాలి.

ఏ రంగంలో తాము బాగా అభివృద్ధిలోకి రాగలమో బేరీజు వేసుకోవాలి. ఆ తరువాతే ముందడుగు వేయాలి.

ఏ గ్రూప్‌లో చేరాలనే విషయమై విద్యార్థులు ఆలోచించడం, సన్నిహితులను, తల్లిదండ్రులను సలహాలు అడగడం మామూలే.

అయినా తమకు తామే ఇంటర్లో ఏ గ్రూపు తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఉత్తమం.   దీనికోసం నిపుణులు, విద్యావేత్తల సూచనలు..*

*ఏ గ్రూప్‌లో ఏయే సబ్జెక్టులు ఉంటాయో, వాటి పరిధి ఏమిటో సీనియర్ల ద్వారా లేదా అధ్యాపకుల ద్వారా తెలుసుకోవాలి.*

*ఏ గ్రూప్‌లో చేరితే భవిష్యత్‌లో ఏయే రంగాల్లో ప్రవేశించవచ్చో తెలుసుకోవడం కీలకం.*

*తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించాలి. కానీ వారి సలహాల మీద పూర్తిగా ఆధారపడటం కూడా మంచిది కాదు. సొంతంగా ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలి.*

10TH CLASS PUBLIC EXAMS MODEL PAPERS-2020 NEW CCE MODEL

10TH CLASS ALL SUBJECTS STUDY MATERIAL 2020

సొంతంగా నిర్ణయం తీసుకునేంత వయస్సు, అనుభవం లేకపోవడం కూడా ఒక ప్రతిబంధకమే. దాన్ని అధిగమించేందుకు ముందుగానే గ్రూపులపై అవగాహన పెంచుకోవడం అవసరం.*

 *అయోమయ పరిస్థితుల్లో ఏదో ఒక గ్రూపును ఎంచుకుంటే తరువాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటికీ మించి విలువైన కాలం వృథా అవుతుంది.*

 *తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను బలవంతంగా పిల్లలపై రుద్దకూడదు. విద్యార్థి అభిరుచి, సామర్థ్యాన్ని రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఏ గ్రూపులో చేరాలనే విషయంపై సలహా మాత్రమే ఇవ్వడం ఉత్తమం.*

MPC;-

గణితానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ గ్రూపునకు విపరీతమైన ప్రాధాన్యం ఉంది.

ప్రధానంగా ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌, సైంటిస్ట్‌ తదితర వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు తీసుకోవాల్సిన గ్రూపు ఇది.

ఈ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్స్‌, ఏరోనాటికల్‌, అగ్రికల్చర్‌, ఇండస్ట్రియల్‌, కెమికల్‌ తదితర రంగాల్లో ఇంజినీరింగ్‌ చేసేందుకు ఎంపీసీ తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది.

జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావాలి.

తర్వాత ఆయా ఎంట్రెన్స్‌లలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌, బిట్స్‌పిలాని వంటి సంస్థల్లో ప్రవేశం కూడా ఎంపీసీ గ్రూపు ద్వారానే సాధ్యం.

ఆయా సంస్థల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ కోర్సులు చేసేందుకు అవకాశం ఉంది.

ప్రతిష్ఠాత్మకమైన బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌)లో చేరేందుకు బిట్‌శాట్‌ రాయాలి.

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తమ సంస్థలో ప్రవేశం కోసం ఐశాట్‌ (ఐఐఎస్‌టీ అడ్మిషన్‌ టెస్ట్‌)ను నిర్వహిస్త్తుంది.

ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఐసర్‌, నైసర్‌లలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలన్నింటికీ ప్రాథమిక అర్హత ఎంపీసీయే.

ఫార్మసీ వంటి డిప్లొమాలు, మ్యాథమెటిక్స్‌తో డిగ్రీ చేసేందుకు కూడా ఎంపీసీ దోహదం చేస్తుంది. ఎంసెట్‌ ద్వారా రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.* 

Bi.P.C 

డాక్టర్‌, వెటర్నరీ వైద్యుడిగా, వైద్య సంబంధిత ఇతర వృత్తుల్లో  స్థిరపడాలనుకునే వారు నీట్‌/ఎంసెట్‌ను దృష్టిలో పెట్టుకుని బైపీసీని ఎంచుకుంటారు.

ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఆ గ్రూపులో చేరే విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు.

వైద్యులు ఎక్కువగా తమ పిల్లల్ని వైద్యులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తారు.

దేశంలోని, రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌ రాయాలి. దానిలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో 15 శాతం సీట్లలో లేదా రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల్లో 85 శాతం సీట్లలో ప్రవేశం పొందవచ్చు.

నీట్‌లో ర్యాంకు సాధించడం ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ (బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌) తదితర కోర్సుల ద్వారా వైద్య వృత్తిలో స్థిరపడవచ్చు.

జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌, జిప్‌మర్‌ తదితర కాలేజీల్లో కూడా గతేడాది నుంచి నీట్‌ ర్యాంక్‌తో ప్రవేశాలు కల్పిస్తున్నారు.*

*బైపీసీ చేసిన తర్వాత ఉన్నత విద్యావకాశాలకు కొదువ లేదు.

నీట్‌ ద్వారా ఎంబీబీఎస్‌ లేదా ఆయుష్‌ కోర్సుల్లో డిగ్రీ చేసిన తర్వాత ఎండీ (డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌), ఎంఎస్‌ (మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీ), డీఎం (మెడిసిన్‌ సూపర్‌ స్పెషాలిటీ ప్రోగ్రామ్‌) ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో పీజీ, ఏరోస్పేస్‌ మెడిసిన్‌, ఏవియేషన్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, పిడియాట్రిక్‌ వంటి ప్రత్యేక కోర్సులు చేయవచ్చు.*

 *వైద్య కోర్సులే కాకుండా బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో డిగ్రీ, పీజీ చేస్తే పలు అవకాశాలు లభిస్తాయి.

సైన్స్‌లో ఉన్నత విద్యను చదవాలనుకునేవారు కూడా బైసీసీని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు నర్సింగ్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది.

మన రాష్ట్రంలో నర్సింగ్‌ ఫ్యాకలీక్టి కొరత ఉంది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్య చేసిన వారికి మంచి భవిష్యత్‌ ఉంటుంది.

బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్‌, అగ్రికల్చర్‌, ఆక్వాకల్చర్‌, ఆస్ట్రానమీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ ప్రాసెసింగ్‌, ఫారెస్ట్‌ రేంజర్‌, జియాలజీ, హార్ట్టికల్చర్‌, హోంసైన్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌ పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి.*

AMARAVATHITEACHERS ANDROID MOBILE APP IN GOOGLE PLAY STORE

M.E.C & C.E.C;-

ఎవర్‌గ్రీన్‌ రంగాల్లో కామర్స్‌, ఎకనామిక్స్‌లు ముందు వరుసలో ఉంటాయి.

ప్రపంచంలో నిత్యం మారుతున్న కాలంలో కామర్స్‌ గ్రాడ్యుయేట్లకు ఎన్నెన్నో అవకాశాలున్నాయి.

సేవల రంగం వైపు చేరేవారు సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్‌ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ, కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టులున్న సీఈసీలో చేరవచ్చు.

చార్టెర్డ్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కమర్షియల్‌ లాయర్లు, బ్యాంకు మేనేజర్‌, చార్టెర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌, ట్యాక్స్‌ ఆడిటర్‌ వంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు, ఇన్సూరెన్స్‌ సంస్థల్లో, స్టాక్‌ మార్కెట్లో ఉద్యోగాలు పొందాలనుకునేవారు.

ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు. మ్యాథమెటిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది.

సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఎస్‌ఐ తదితర సంస్థలు కామర్స్‌ విద్యార్థులకు పలురకాల కోర్సులను అందిస్తున్నాయి.

అంతేకాకుండా ఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్‌, పీజీలతో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలు పొందవచ్చు.*

10TH CLASS PRE PUBLIC EXAMS PAPERS WITH ANSWERS 2020 ALL SUBJECTS

error: Content is protected !!