Polytechnic Common Entrance Test -2020-notification-model-papers

Polytechnic Common Entrance Test -2020-notification-model-papers

27న పాలిసెట్-2020 పరీక్ష.

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ – 2020 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నారు.

వారం రోజుల ముందు హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.

ఈ నెల 25న పరీక్ష నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించినా, సచివాలయ పరీక్షల నేపథ్యంలో మళ్లీ 27కి మార్పు చేశారు.

POLYCET-2020 మోడల్ పేపర్లు & ప్రీవియస్ పేపర్లు

టెన్త్‌ తర్వాత? పాలిటెక్నిక్‌ కోర్సులు

 తెలుగు రాష్ట్రాల్లో పాలీసెట్ ప్ర‌క‌ట‌న‌లు

పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్‌ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి.

ర్యాంకు సాధించి పాలిటెక్నిక్‌ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు.

ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది.

ఈ ఎంట్రన్స్‌ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక కెరియర్‌కు మేలైన బాట వేసుకోవచ్చు!

హైస్కూలు స్థాయి నుంచే నేటితరానికి కెరియర్‌పై కచ్చితమైన ప్రణాళికలు ఉంటున్నాయి.

టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం, వేగంగా స్థిరపడటం లక్ష్యంగా సాగుతున్నారు.

అందుకే కొత్త రంగాల ఆవిర్భావం, వాటికి సంబంధించి వస్తున్న స్పెషలైజేషన్లు, అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులపై దృష్టిసారిస్తున్నారు.

AP POLYCET-2020 NOTIFICATION DETAILS

POLYCET – 2020 BOOKLET DOWNLOAD

MATHS ONLINE TESTS 10TH CLASS CHAPTER WISE

PHYSICAL SCIENCE (PHYSICS & CHEMISTRY) ONLINE TESTS CHAPTER WISE

POLYCET-2020 APPLICATION FORM

మూస ధోరణిలో కాకుండా కొత్త దారుల్లో కెరియర్‌ను మలచుకోవాలనుకుంటున్న వారూ ఉన్నారు.

అలాంటి వారికి అనుకూలమైనవి పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు.

పదో తరగతి విద్యార్హతతో ఎన్నో డిప్లొమా/ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

పది తర్వాత అప్లైడ్‌ సైన్స్‌/ టెక్నికల్‌ సబ్జెక్టులను అభ్యసించాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. ఇవి ఉద్యోగాధారిత కోర్సులు.

పూర్తిచేయగానే సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగం సాధించుకునే విధంగా సిలబస్‌ ఉంటుంది.

టెక్నికల్‌ డిప్లొమా ప్రోగ్రాముల్లో ఇంజినీరింగ్‌ అంశాలుంటాయి.

అందుకే వీటిని డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌గా వ్యవహరిస్తారు.

సాధారణంగా కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు.

కొన్నింటికి మూడున్నరేళ్లు. సెమిస్టర్‌ విధానంలో నిర్వహిస్తారు.

కోర్సుల కాలవ్యవధిని బట్టి ఆరు నెలల వరకు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.

కోర్సులు.. ప్రవేశం
మనదేశంలో పాలిటెక్నిక్‌ కోర్సులకు పరిధి, గిరాకీ ఎక్కువ. ఎన్నో ఉత్తమ కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) ద్వారా వీటిల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు.

పదో తరగతి లేదా బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సు (సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎన్‌ఐఓఎస్‌, టీఓఎస్‌ఎస్‌, ఏపీఓఎస్‌ఎస్‌ వంటివి) పూర్తిచేసి ఉండాలి.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం

ఏపీ పాలీసెట్‌: 

వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది.

మేథమేటిక్స్‌ నుంచి 60, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి.

ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.

ప్రత్యేకత ఏమిటి?
* పాలిటెక్నిక్‌లో ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’పై ప్రధాన దృష్టి ఉంటుంది.

అందులో భాగంగానే సాంకేతికాంశాలను థియరీ విధానంలో బోధించడంతోపాటు ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ సమ ప్రాధాన్యం ఇస్తారు.

ఎలా సన్నద్ధమవ్వాలి?
ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి.

ముఖ్యంగా ప్రశ్నలన్నీ మేథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులకు చెందినవే.

పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది.

విద్యార్థులు అప్పటికే సిలబస్‌ పూర్తి చేసి ఉంటారు.

కాబట్టి, ముందుగా ప్రవేశపరీక్ష సిలబస్‌ను సేకరించి పెట్టుకోవాలి.

దాని ఆధారంగా సన్నద్ధత ప్రారంభించాలి.

APRJC 2020 NOTIFICATION AND MODEL PAPERS CLICK HERE

AP POYCET-2020 OFFICIAL WEBSITE

అకడమిక్‌ పరీక్షల తరహాలో కష్టపడితే చాలదు. తెలివిగా చదవడంపైనా దృష్టిపెట్టాలి.

ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయని కేవలం ఆ తరహా మెటీరియల్‌పైనే ఆధారపడకూడదు.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం మేలు. కాన్సెప్టులు నేర్చుకుంటే ప్రశ్న ఏవిధంగా వచ్చినా జవాబు గుర్తించడం సులువవుతుంది.

కాబట్టి, సిలబస్‌లోని ప్రతి టాపిక్‌లో ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చదవాలి.

ఆపై మాదిరి ప్రశ్నపత్రాలను సాధించడంపై దృష్టిపెట్టాలి.

ఎంత ఎక్కువ సాధనచేస్తే అంతమంచిది.

గత ప్రశ్నపత్రాలు పాలీసెట్‌ అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయి.

POLYTECHNIC ENTRANCE 2017 QUESTION PAPER & KEY PAPERS

AP POLYCET-2014 QUESTION PAPER & KEY PAPERS

తక్కువ వ్యవధి: వృత్తి విద్యా కోర్సులను పూర్తిచేసి త్వరగా ఉద్యోగంలో చేరాలనుకునేవారికి ఇవి అనుకూలం. ఉద్యోగం చేస్తూ ఉన్నతవిద్యను కొనసాగించవచ్చు.

లేదా లేటరల్‌ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.

ప్రాక్టికల్‌ పరిజ్ఞానం: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో థియరీ కంటే ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఎక్కువ.

ఇంటర్మీడియట్‌ విద్యార్థితో పోలిస్తే పాలిటెక్నిక్‌ విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ.
ఫీజు తక్కువ: బీటెక్, బీఈ, ఇతర డిగ్రీ కోర్సుల కంటే ఈ కోర్సుల ఫీజు అందరికీ అందుబాటులో ఉంటుంది.
విభాగం మార్చుకునే వీలు: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఉన్న లాభదాయకమైన అంశమిది. కోర్సు పూర్తయ్యాక భవిష్యత్తులో చదువు కొనసాగించాలనుకుంటే రంగాన్ని మార్చుకునే వీలుంది.

కోర్సు పూర్తయ్యేనాటికి సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన, ప్రాక్టికల్‌ పరిజ్ఞానం పరంగా ఇతరుల కంటే ముందుంటారు.
ఉద్యోగం/ వ్యాపారం: మూడేళ్ల డిప్లొమాను పూర్తిచేయడం ద్వారా సంబంధిత ఉద్యోగాలను అందుకోవచ్చు.

పీఎస్‌యూలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో డిప్లొమా హోల్డర్లకు అవకాశాలుంటాయి.

వీరిని జూనియర్‌ స్థాయి, టెక్నీషియన్‌ హోదాల్లోకి తీసుకుంటారు.

రైల్వే, గెయిల్, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, బెల్, ఎన్‌టీపీసీ మొదలైనవి వీరిని నియమించుకుంటున్నవాటిలో ప్రధానమైనవి. ప్రైవేటు ఎయిర్‌లైన్స్, కన్‌స్ట్రక్షన్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్స్‌ సంస్థలూ వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి.

కోర్సులన్నీ ప్రాక్టికల్‌/ అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటాయి.

కాబట్టి తమ రంగంలో సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.

AP POLYCET-2018 QUESTION PAPER & KEY PAPERS

AP POLYCET-2019 QUESTION PAPER & KEY PAPERS

PRINT YOUR HALLTICKET AND DOWNLOAD LINK

ఆన్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌/ హెల్ప్‌లైన్‌ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు రూ.400. దరఖాస్తుకు చివరి తేదీ: September 3rd.

AP POLYCET-2020 ONLINE APPLICATION

ONLINE FEES PAYMENT LINK

AP POLYCET-2020 OFFICIAL WEBSITE

AP POLYCET QUESTION PAPERS WITH KEY PAPERS PDF

AP POLYCET QUESTION PAPERS WITH KEY PAPERS PDF

error: Content is protected !!