collecting-recording-students-foot-measurements-jagananna-vidyakanuka

collecting-recording-students-foot-measurements-jagananna-vidyakanuka

Rc.No.16021,Dt.18.03.2020; జగనన్న విద్యా కానుక- విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను ఉపాధ్యాయులే కొలిచి online లో  నమోదు చేయుట గురించి

జగనన్న విద్యా కానుక  – ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన బూట్ల సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య ‘బూట్ల సైజు సరిగా ఉండకపోవడం’, తద్వారా కొందరు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.*

 ఈ సమస్యను అధిగమించేందుకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం కింది సూచనలు పొందుపరచడమైనది. బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు

విద్యార్థుల పాదాల కొలతలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేయుట.

ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.

ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.

విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.

(:: ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5ఉంటే కాస్త పెంచి 6 సైజుగా నమోదు చేయాలి)

ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. ప్రధానోపాధ్యాయులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్లో హెడ్మాష్టరు లాగిన్ ద్వారా కొలతలు నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు/ సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా జరిగేలా బాధ్యత వహించాలి.

*హెచ్ఎం లాగిన్లలో పొందుపరిచినటువంటి స్క్రీన్ లో 26.03.2020 లోగా నమోదు చేయాలి.*

Rc.No.16021,Dt.18.03.2020; జగనన్న విద్యా కానుక- విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను ఉపాధ్యాయులే కొలిచి online లో నమోదు చేయుట

error: Content is protected !!