elections-2019-training-class-polling-staff-duties-postal-ballet-form-12
elections-2019-training-class-polling-staff-duties-postal-ballet-form-12
elections-2019-training-class-polling-staff-duties-postal-ballet-form-12

ఎన్నికలు–2019*
*ఎవరెవరు ఏ ఏ భాద్యతలు నిర్వహించాలి??*
*PO*
*పోలింగ్ సక్రమంగా జరిగెటట్లు చూసే బాధ్యత పీఓదే.*
*పోలింగ్ సమయంలో వచ్చే సందేహాలను నివృత్తి చేసే బాధ్యత కూడా పీఓదే.*
*పోలింగ్ సమయంలో అందరినీ మానిటర్ చేసే బాధ్యత కూడా పీఓదే.*
*పరిస్థితిని బట్టి శాసనసభ CU కి ఇంచార్జ్ గా కూడా వ్యవహరించాల్సి వస్తుంది.*
*అంటే ఓటర్ తెచ్చిన పింక్ స్లిప్ తీసుకుని CU లో ఓటు రిలీజ్ చేయాలి.*
APO*
*మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ కు బాధ్యుడు ఈయనే.*
*ఇతను ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్ ప్రకారం పేరు,సీరియల్ నెంబర్ బిగ్గరగా చదవాలి.*
*పురుష ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేయాలి, స్ర్తీ ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేసి,సీరియల్ నెంబర్ వద్ద టిక్ పెట్టాలి.*
*మొదటి OPO*
*ఓటర్ల రిజిస్టరు (17 A)లో ఓటరు సంతకం / వేలిముద్ర తీసుకొని, ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి ఆరు/ నాలుగు అంకెలను వ్రాయాలి.*
*ఇతనే ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను/గుర్తును చెరగని సిరాతో పెట్టాలి.*
*♂రెండవ OPO*
*ఓటరు స్లీప్స్ ఇస్తాడు.*
*లోకసభకు తెలుపు, శాసనసభకు పింక్ /ఆరెంజ్ రంగులో ఇవి ఉంటాయి.*
మూడవ OPO*
*లోకసభ కంట్రోల్ యూనిట్‌కు భాద్యుడు.*
*ఇతను ఓటరు తెచ్చిన తెలుపు స్లిప్ తీసుకొని CU లో ఓటు రిలిజ్ చేస్తాడు.*
పోస్టల్ బేలేట్ అప్లై చేయుటకు కావలసినవి,
రెండు పాస్ పోర్ట్ ఫోటోలు,
ఓటర్ I.D కార్డు,
ఫారం-12,
ఫారం పూర్తి చేసి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఇవ్వవలెను.