Gama-sachivalayam-jobs-certificates-verification-appointment-letters-schedule

Gama-sachivalayam-jobs-certificates-verification-appointment-letters-schedule

రేపటి నుంచి ‘సచివాలయ’ ధ్రువపత్రాల పరిశీలన

ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపనున్నారు. అభ్యర్థులు వారి కాల్‌లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీల్లో, నిర్ణీత కేంద్రంలో సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

సచివాలయ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారికి గుడ్ న్యూస్…

ఒక అభ్యర్థి నాలుగైదు విభాగాలకు పరీక్ష రాసి.. అన్నింటిలోనూ క్వాలిఫై అయితే, వారిని స్థానిక ప్రాధాన్యతలను బట్టి ఏ ఉద్యోగానికి తీసుకోవాలో నిర్ణయిస్తారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సెప్టెంబరు 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.

మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు.

సెప్టెబరు 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు.

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం జిల్లాల వారీగా మెరిట్ జాబితాను అధికారులు రూపొందించారు.

ఈ జాబితా ప్రకారం సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు.

ఎంపికైన అభ్యర్థులు వారి కాల్‌లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. అభ్యర్థికి ఏ రోజు, ఏ ప్రాంతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారో అన్న అంశాలన్నీ అభ్యర్థికి SMS ద్వారా పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు.

అభ్యర్థులు ఒకవేళ కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైనా.. అన్ని ఒరిజనల్స్‌ చూపలేకపోయినా.. వారికి మరో ఛాన్స్‌ ఇవ్వనున్నారు.

సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్టుసైజు ఫొటోలు, హాల్‌ టికెట్‌ కాపీ, కమ్యూనిటీ సర్టిఫికెట్‌, స్టడీ సర్టిఫికెట్‌, పీహెచ్‌కు సంబంధించిన వారైతే మెడికల్‌ సర్టిఫికెట్‌, స్పోర్ట్స్‌ కోటా, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

DOWNLOAD CALL LETTER TO ATTEND CERTIFICATE VERIFICATION  

SHORT LISTED CANDIDATES LIST

బీసీ అభ్యర్థులైతే లేటెస్ట్ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు, రెసిడెన్సీ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఈ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి..
✦ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం తీసుకెళ్లాలి.
✦ గెజిటెట్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు జతల సర్టిఫికేట్లు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంటతీసుకెళ్లాలి.
✦ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తప్పనిసరి.
✦ పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి సర్టిఫికేట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండాలి.
✦ విద్యార్హతకు సంబంధించిన అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు తీసుకెళ్లాలి.
✦ 4 నుంచి 10వ తరగతి దాకా విద్యాభ్యాసానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు.
✦ పాఠశాలలో, కళాశాలలో చదవకుండా.. నేరుగా డిగ్రీ చదివినవారు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి.
✦ ఏపీ పునర్విభజన కారణంగా 02.06.2014 – 01.06.2019 మధ్యకాలంలో తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన అభ్యర్థులు స్థానికత కోసం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
✦ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
✦ బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
✦ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొందిన అభ్యర్థులు తమ ప్రధానాధికారి నుంచి ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
✦ అభ్యర్థులు తమపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
✦ ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు, వినికిడి లోపాలు ఉన్న అభ్యర్థులు తల్లిదండ్రుల రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
✦ ఇక దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్, NCC విభాగాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి.

సచివాలయ’ ఫలితాలు.. ఆ పోస్టులకు అర్హత మార్కులు తగ్గింపు ఖాయం.. ఎందుకంటే?

UPLOAD YOUR CERTIFICATE HERE

DOWNLOAD CALL LETTER TO ATTEND CERTIFICATE VERIFICATION

DOWNLOAD MERIT LIST & RANK CARDS

error: Content is protected !!