how-to-get-GPA-10/10-SSC-10th-class-exams-Physical-Science-subject

how-to-get-GPA-10/10-SSC-10th-class-exams-Physical-Science-subject

how-to-get-GPA-10/10-SSC-10th-class-exams-Physical-Science-subject

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో.. భౌతికశాస్త్ర ప్రశ్నలు గుర్తుకు పెట్టుకుని, బట్టీపట్టి రాయడానికి వీలుగా ఉండవు. ఆలోచించి రాసేలా ఉంటాయి.

విశ్లేషణాత్మకంగా అన్వయించి రాయాల్సి ఉంటుంది.

సమాధానాలు ఒకేరకంగా రాయడానికి బదులు బహుళ విధాలుగా వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది.

ఆ ప్రశ్నలు నిర్ధారించిన విద్యాప్రమాణాలు, సాధించవలసిన సామర్థ్యాలకు సంబంధించినవై ఉంటాయి.

పాఠ్యపుస్తకంలోని అన్ని ప్రశ్నలూ యథాతథంగా ప్రశ్నపత్రంలో రావు. అందువల్ల బట్టీపట్టి చదివే విధానానికి స్వస్తిచెప్పి విషయాన్ని అవగాహన చేసుకోవాలి.

 పాఠ్యాంశాల వారీగా వెయిటేజీ లేదు. సిలబస్‌ మొత్తానికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్షుణ్ణంగా చదవాలి. పాఠాన్ని పూర్తిగా చదివి అందులో ముఖ్యమైన భావనలు, పటాలు, ఫార్ములాలు, ప్రయోగాలు, నిత్యజీవిత అనువర్తనాలను అవగాహన చేసుకోవాలి.

పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయటం అభ్యసించి, పునశ్చరణ చేయాలి. కృత్యాలు, ప్రయోగాలను సాధ్యమైనంతవరకూ వ్యక్తిగతంగా చేసి పరిశీలనలు, ఫలితాలను నమోదు చేయాలి. ప్రతి ప్రయోగ కృత్యానికీ నివేదికలు రూపొందించుకోవాలి.

ప్రతి భావననూ విశ్లేషణాత్మకంగా చదవాలి.

ప్రత్యేకంగా బొమ్మల ద్వారా వివరించగలగడం, అసంపూర్తిగా ఉన్న బొమ్మలను పూర్తిచేయడం, సందర్భోచిత పటాలు గీయటం సాధన చేయాలి.

ప్రశ్నల స్వభావం
విషయావగాహన: 

భౌతికశాస్త్రంలో నేర్చుకున్న భావనలను వివరించడం, ఉదాహరణలివ్వడం, కారణాలు చెప్పడం, పోలికలు, భేదాలు చెప్పటంపై ప్రశ్నలు.

ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

వివిధ భావనలపై విద్యార్థులు సొంతంగా ప్రశ్నలు అడిగేలా ఫలితాలు గురించి ఊహించే ప్రశ్నలు.

ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రయోగ విధానం, ఉపయోగించిన పరికరాలు, వచ్చిన ఫలితాలు, ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించిన విధానం, చరాలు మార్చినప్పుడు వచ్చే ఫలితాలు, అమరికకు పటాలు గీయటం వంటి ప్రశ్నలు.

సమాచార నైపుణ్యాలు: 

సమాచారాన్ని విశ్లేషించడం, సేకరించడం, ఉపయోగించిన సాధనాలు, నమూనా పట్టికలు తయారు చేయటం వంటి ప్రశ్నలు.

బొమ్మలు గీయడం:

 పరికరాల అమరిక, పనిచేసే విధానం, బొమ్మలు గీయడం, ఫ్లో చార్టులు, గ్రాఫులు గీయడం వంటి ప్రశ్నలు.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

ప్రశంస, విలువలు, జీవవైవిధ్యం: 

అభినందించే, ప్రశంసించే పద్ధతులు, నిర్వహించే లేదా పాల్గొనే పనులు, నినాదాలు, కరపత్రాలు, వ్యాసాలు రాయడం వంటి ప్రశ్నలు.

ప్రశ్నపత్రంలో పార్టు-ఎ మూడు విభాగాలుగా ఉంటుంది.

పార్టు ఎ-కి సమాధాన పత్రంలోనూ, పార్టు బి-కి ప్రశ్నపత్రంలోనూ సమాధానాలు రాయాలి.

పార్ట్‌-ఎలోని విభాగం-1లో 4 ప్రశ్నలుంటాయి.

అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి.

 ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాయాలి.

అనుస‌రించాల్సిన అంశాలు

* సరైన ప్రణాళిక, సంసిద్ధత, పునశ్చరణ మంచి గ్రేడ్‌ పాయింట్లు సాధించడానికి దోహదం చేస్తాయి.

* ఇంట్లో, పాఠశాలలో పునశ్చరణకు తగిన సమయం కేటాయించాలి.

* ప్రతి పాఠ్యాంశాన్నీ పూర్తిగా అవగాహన చేసుకుని చదవాలి.

* కీ పాయింట్లను తయారుచేసుకోవాలి.

* స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకొని వాటికి జవాబులు రాయడం సాధన చేయాలి.

* పాఠ్యపుస్తకంలోని ‘అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం’లోని అన్ని ప్రశ్నలకు స్వయంగా సమాధానాలను రాసుకుని పునశ్చరణ చేసుకోవాలి.

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు 
1 మార్కు

1) 37OC ను కెల్విన్‌ మానంలోకి మార్చండి.

2) n = 3 అయితే l విలువలను తెలపండి.

3) విశిష్ట నిరోధానికి S.I. పద్ధతిలో ప్రమాణం ఏమిటి?

4) కింది సమ్మేళనాల్లో ఏది త్రికబంధాన్ని కలిగి ఉంటుంది?
C3H6, C3H8, C3H4

5) ఒక వాహకంలో 4 నిమిషాల్లో 90 కులూంబ్‌ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలోని విద్యుత్‌ ప్రవాహం ఎంత?

* పార్టు-ఎ విభాగం-2లో 5 ప్రశ్నలు ఉంటాయి.

అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి.

ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 3 లేదా 4 వాక్యాల్లో సమాధానాలు రాయాలి.

2 మార్కులు

1) వజ్రం ప్రకాశించడానికి కారణమేమిటి? ఇందులో ఇమిడి ఉన్న అంశాన్ని మీరెలా అభినందిస్తారు?

2) NaOH ఉపయోగాలను తెలపండి?

3) వస్తువును 2F1, F1 ల మధ్య ఉంచినపుడు పుటాకార కటకం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాన్ని గీయండి.

4) 6, R2  నిరోధం గల రెండు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం 4 లు అయితే R2 విలువను కనుక్కోండి.

5) బాష్పీభవనం, మరగడం మధ్య భేదాలను తెల్పండి.

10TH P.S 20 PRACTICE PAPERS & BIT PAPERS

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

10TH P.S CHAPTER WISE IMP QUESTIONS

* పార్టు-ఎ విభాగం-3లో 4 ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.

ప్రతి ప్రశ్నకు అంతర్గత వెసులుబాటు ఉంది.

ఏదైనా ఒకదాన్ని ఎన్నుకొని సమాధానం రాయాలి.

ప్రతి ప్రశ్నకు 8- 10 వాక్యాల్లో సమాధానం రాయాలి.

4 మార్కులు

1) ఓవర్‌లోడ్‌ వల్ల విద్యుత్‌ సాధనాలు ఎందుకు పాడవుతాయి? ఓవర్‌లోడ్‌ వల్ల సంభవించే ప్రమాదాలను ఎలా నివారించగలం?

2) సాధారణంగా దృష్టి దోషాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడతాయి? పట సహాయంతో వివరించండి. కటకాలను ఉపయోగించి దృష్టి దోషాలను ఎలా సవరిస్తారో వివరించండి.

3) ధాతువులను సాంద్రీకరణం చెందించే ప్రక్రియలను తెలిపి, వివరించండి.

4) పట్టక వక్రీభవన గుణ‌కాన్ని కనుక్కునే ప్రయోగాన్ని వివరించండి.

5) s, p ఆర్బిటాళ్ళ జ్యామితీయ ఆకృతులను గీయండి.

పార్టు-బిలో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.

 ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు.

ఇచ్చిన నాలుగు సమాధానాల్లో (A, B, C, D) ఒకదాన్ని ఎంచుకుని బ్రాకెట్లలో రాయాలి. దిద్దేసిన, కొట్టివేసి రాసిన సమాధానాలకు మార్కులు ఇవ్వరు.

1) ఒక పరమాణువులో చివరి ఎలక్ట్రాన్‌ క్వాంటం సంఖ్యలు 3, 2, -2, +1/2 అయితే, దాని పరమాణ సంఖ్య ( )
A) 19 B) 20 C) 21 D) 22

2) అత్యధిక ఋణ విద్యుదాత్మకత గల మూలకం బాహ్యతమ కర్పరంలోని ఎలక్ట్రాన్‌ విన్యాసం ( )
A) ns2np3 B) ns2np4 C) ns2np5 D) ns2np6

10TH P.S PRACTICE PAPERS (T.M & E.M)

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!