Mana-Badi-Naadu-Nedu-nine-9-components-improving Infrastructure-schools

Mana-Badi-Naadu-Nedu-nine-9-components-improving Infrastructure-schools

 

మన బడి నాడు నేడు CRP, HM ల  పాత్ర, వారికి ఆదేశాలు*

*మన బడి నాడు నేడు లో రాయాల్సిన రెజిస్టర్స్…తీర్మానాలు⤵*

*➡Rc.19, Dt.2/1/2020*

*➡File No.ESE02/563/2019-CIVIL SEC-SSA*

*➡ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ*

*➡సర్క్యూలర్.నెం. ఎంబిఎస్ఎన్/19-20/2, తేది: 2-1-2020*

          పైన పేర్కొనబడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ‘మనబడి: నాడు – నేడు’ అనే ప్రభుత్వ ప్రాధాన్యత గల కార్యక్రమం మన రాష్ట్రంలో అమలు జరుగుచున్నది. దీనికి సంబంధించి ఒక వినూత్న పద్ధతిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా పనులు చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చురుగ్గా పాల్గొనాలంటే వారిని ప్రేరేపించడం (Motivation) మరియు వారిని సౌలభ్యం (Facilitate) చేయడం అనేవి విద్యాశాఖ నుండి మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు నిర్వహించుటలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు క్లస్టర్ రిసోర్సు పర్సన్లు ముఖ్య బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఈ క్రింది విధులు నిర్వహించాల్సి ఉంటుంది..

➡1. ప్రతి పాఠశాలలోని తల్లిదండ్రుల కమిటి వారానికి ఒకరోజు (అనుకున్న రోజు, అనుకున్న సమయానికి) తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలి. దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయలు మరియు సీఆర్పీలు తప్పకుండా హాజరు కావాలి.

➡2. ప్రధానోపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుందరికీ ఫోన్లు చేసి, వారు ప్రతి వారం తప్పకుండా సమావేశం జరిగేలా బాధ్యత వహించవలెను.

➡3. ఆ సమావేశంలో తగు విషయాలను అంశాలను చర్చించి ప్రజాస్వామ్యయుతంగా అందరు కమిటీ సభ్యులు కలిసి నిర్ణయాలు తీసుకునేటట్లు సీఆర్పీ సులభతరం (Facilitation) చేయాలి.

➡4. ఆ సమావేశానికి గ్రామ/వార్డు సచివాలయం నుండి ఇంజినీర్ సహాయకుడు, సంక్షేమ విద్యా సహాయకులు తప్పకుండా హాజరు అయ్యేటట్లు చూసుకోవాలి..

➡5. మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి గారు, పట్టణ ప్రాంతాలలో సంబంధిత డిప్యూటీ ఇన్స్పెక్టర్ /మండల విద్యాశాఖాధికారి/ సీఆర్పీలు హాజరు అయ్యే టట్లు పర్యవేక్షించాలి.

➡6. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు ఎలాంటి కాంట్రాక్టరుకు పనులను కట్టపెట్టకుండా ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు చూసుకోవాలి. బినామీ కాంట్రాక్టర్ ద్వారా పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయులదే.

➡7. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు పెట్టిన వివరాలు అన్ని కూడా ‘మనబడి: నాడు-నేడు’ లెక్కల పుస్తకాలలో వ్రాయాలి. ఈ లెక్కల పుస్తకాలు గ్రామ/వార్డు సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులతో వ్రాయించాలి.

ఒక వేళ ఆ పోస్టులో ఎవరు లేకపోతే సీఆర్పీలు ఆ లెక్కలు వ్రాయాల్సి ఉంటుంది.

నాడు నేడు ఒప్పంద అంగీకార పత్రము MOU CERTIFICATE

Requisition Letter to Open Nadu Nedu BANK Account

తల్లి దండ్రుల తీర్మాన కమిటి సర్టిఫికేట్

➡8. మన బడి: నాడు-నేడు’ కార్యక్రమానికి సంబంధించి ఈ క్రింది పుస్తకాలు వ్రాయాలి.

(i) మీటింగ్ మినిట్స్

(ii) నగదు పుస్తకం

(iii) సాధారణ లెడ్జర్

(iv) చెల్లింపు వోచర్

(V) రశీదు పుస్తకము

(vi) స్టాక్ నమోదు- పంపిణీ రిజిస్టర్

➡9. సీఆర్పీ మరియు ప్రధానోపాధ్యాయులు క్షేత్రస్థాయి ఇంజినీరు సహాయంతో తాపీ మేస్త్రీ , రంగులు వేసే మేస్త్రీ , కరెంట్ మేన్, ఫ్లోరింగ్ మేస్త్రీ , శానిటరీ మేస్త్రీ , ప్లంబింగ్ మేస్త్రీ  మొదలగు వారితో గంపగుత్త రేటు మాట్లాడటంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి సహాయపడాలి. మేస్త్రీ లతో రేటు మాట్లాడినప్పుడు ఒక పేజీ ఒప్పంద పత్రము తయారు చేసుకోవడానికి పాఠశఆల తల్లిదండ్రుల కమిటీకి సహాయం చేయాలి.

➡10. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కేంద్రీయ సరఫరా(central procurement) పద్ధతిలో ఫర్నీచర్, ఫ్యాన్లు, కమొడ్లు, ఆకుపచ్చ బోర్డులు వంటివి ఇండెంట్ తయారు చేయడానికి, దానిని కంప్యూటర్ ద్వారా పంపించడానికి ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

➡11. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కొన్న వస్తువులు లేక కేంద్రీయ సరఫరా (central procurement) ద్వారా వచ్చిన సామగ్రి/ వస్తువులు చాల జాగ్రత్తగా పాఠశాల ఆవరణలో భద్రపరచడంలో ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. సామగ్రి భద్రపరచడంలో క్షేత్ర స్థాయి ఇంజినీర్ బాధ్యత ఉండదు.

➡12. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ నిర్మాణ వస్తువులు/సామగ్రి కొనడానికి మార్కెట్ కు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీఆర్పీ గాని ప్రధానోపాధ్యాయుడు కాని ఎవరో ఒకరు తప్పకుండా వెళ్లవలెను.

➡13. మనబడి’ అనే భావజాలంను, ‘మన బడి ఒక పవిత్ర స్థలం’ అనే భావజాలాన్ని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, ఇంజినీరుకు, తల్లిదండ్రులకు, టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు, సీఆర్పీలకు, గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికీ ఇలా ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగేటట్లుగా చేయడంలో ప్రధానోపాధ్యాయులు మరియు సీఆర్పీలు ముఖ్య పాత్ర పోషించవలెను.

➡14. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య సఖ్యత ఉండేట్లు, వారిలో ఏమైనా బేధాభిప్రాయాలు వచ్చినట్లయితే వాటిని పరిష్కరించే బాధ్యత సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి.

➡15. ఇంజినీర్ పాఠశాలకు వచ్చినపుడు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సమావేశపరిచి, పాఠశాలలో అందరు తిరిగి ఏమేమి కావాలో గుర్తించి ఇంజనీర్ అంచనాను తయారు చేసేట్లు ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు బాధ్యత తీసుకోవాలి.

➡16. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు , క్షేత్రీయ ఇంజనీర్, గ్రామ/వార్డు సచివాలయ ఇంజనీర్, సంక్షేమ విద్యా సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ అందరూ ఒక బృందంలా తయారు కావాలి.

➡17.  పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకూ ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా లెక్క తెలిసేటట్లుగా సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

➡18. చివరగా పాఠశాల పనులను త్వరితగతిన చేయడంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సంస్థాగతంగా నడిపించి వారితో పాఠశాల పనులను పూర్తి చేయడంలో సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు ప్రధాన పాత్ర వహించాలి.

Requisition Letter to Open Nadu Nedu Account

CSE – APSS – ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List

Mana Badi – Nadu Nedu Programme Mana Badi – Naafu Nedu Component Wise Ceilings

▪ *నాడు నేడు కార్యక్రమం పాఠశాలను కేటగిరీ వారీగా విభజించారు*

▪ *పాఠశాలలో ఉన్న రోల్ ఆధారంగా ఒక్కో కాంపోనెంట్ కి ఎంత మొత్తం మంజూరు చేస్తారు తెలియజేసే పట్టిక*

ఏ పాఠశాలలైతే నాడు-నేడు పథకం కు ఎంపికైనాయో ఆ పాఠశాలల HMs అందరు తమ పాఠశాల PMC  సభ్యులు 5 గురు + HM+AE =7గురు సభ్యులతో  ఏదైన జాతీయ బ్యాంకు లో అకౌంటు ఓపెన్ చేయవలెను. తదుపరి ఆ అకౌంట్లలో 15% అమౌంటు జమచేయబడును.

ఒకవేళ అకౌంటు ఓపెన్ చేయలేకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవు.

మీ పాఠశాల  మంచి అవకాశంకోల్పోయే  ప్రమాదం ఉంది.కనుక జాగ్రత్త వహించగలరు.

School Education Department – Mana Badi; Naadu-Nedu – Administrative approval accorded to take up the basic infrastructure works with nine (9) components for improving Infrastructure facilities in all the schools under Mana Badi; Naadu-Nedu Program – Implementation of the program through parent’s committees by way of community contracting and guidelines for implementation of the program – Orders – Issued.

Government after careful examination of the matter, hereby accord administrative approval to the Commissioner of School Education to take up the basic infrastructure works with nine (9) components i.e

i. Toilets with running water,

ii. Electrification with fans and tube lights,

iii. Drinking water supply,

iv. Furniture for
students and staff,

v. Painting to school,

vi. Major and minor repairs,

vii. Green chalk
boards,

viii. English labs,

CSE – APSS – ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List

పాఠశాలలో ఉన్న రోల్ ఆధారంగా ఒక్కో కాంపోనెంట్ కి ఎంత మొత్తం మంజూరు చేస్తారు తెలియజేసే పట్టిక

MANA BADI NADU NEDU DATA INPUT SHEET DOWNLOAD PDF

ix. Compound walls in all Government Schools under Mana Badi: Nadu-Nedu programme for transformation of Government schools in the State in a period of three years from the current financial year 2019-20.

The project shall cover all the (44,512) schools run by all managements.

మనబడి : నాడు – నేడు*చేయవలసిన పనులు

1. *Engineering Assistant* :

వీరు పాఠశాలను సందర్శించి అవసరమైన సాంకేతిక వివరాలను

*Input Data Sheet* లో నింపి సంతకం చేయాలి. 

*పాఠశాలలో జరిగే కమిటీ సమావేశాలకు తప్పక హాజరు కావాలి.*

*పనులు జరిగే సమయంలో పర్యవేక్షిస్తూ సూచనలివ్వాలి.*

*పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి.*

*ఈ కార్యక్రమంలో ప్రథమ బాధ్యత వహించాల్సివుంది.*

2. *Assistant Engineer (AE):*

*వీరు మండలంలోని ప్రతి పాఠశాలలో Engineering Assistant లు నింపిన వివరాలు పరిశీలించి, పాఠశాలను సందర్శించి input data sheet లోని వివరాలను సరిచూసుకొని సంతకం చేయాలి.*

*పనులు జరిగే సమయంలో నాణ్యతకు అవసరమైన సూచనలు ఇస్తూ ఉండాలి.*

*పనులలో నాణ్యత కు పూర్తి బాధ్యత వహించాల్సివుంది.*

3. *ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్*: 

*ఇంజినీరింగ్ వారు పూర్తిచేసిన వివరాలు సరిపోల్చుకొని input data sheet లో సంతకం చేయాలి.*

*పూర్తిచేసిన ప్రతి సమాచారంను ఒక కాపీని Xerox ను పాఠశాలలో భద్రపరచాలి.*

*మరొక ప్రతిని ఇంజినీరింగ్ వారికి ఇవ్వాలి.*

*మరొక ప్రతిని మండల విద్యాశాఖాధికారిగారికి ఇవ్వాలి.*

*కమిటీ సమావేశం జరిగే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు, ఇంజినీరింగ్ వారు EA, AEలు పాల్గొనేలా కోఆర్డినెట్ చేసుకోవాలి.*

*పనులు జరిగే సమయంలో  పనులలో నాణ్యత ఉండేలా 7గురు కమిటీ సభ్యులతో చర్చిస్తూ ఉండాలి.*

యాక్షన్‌ ప్లాన్‌*

*ఈ నెల 31న మాస్టర్‌ ట్రైనీలతో మండల స్థాయిలో సీఆర్‌పీ, వార్డు,గ్రామ సచివాలయాల్లో కొత్తగా చేరిన వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇస్తారు. అదే రోజున పేరెంట్‌ కమిటీలకు అవగాహన కల్పిస్తారు.*

*జనవరి 5లోగా అంచనాలు సిద్ధమవ్వాలి. వాటి సాంకేతిక అనుమతి కోసం రిపోర్టు డీఈవోకు పంపాలి. వాటిని పరిశీలించాక పరిపాలనా ఆమోదం కోసం ఫైల్‌ కలెక్టర్‌కు వెళ్తుంది. అదే రోజున కలెక్టర్‌ వాటికి అనుమతి ఇస్తారు.*

 *జనవరి 5 నాడు పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరవాలి. పాఠశాల హెచ్‌ఎం, పేరెంట్‌ కమిటీ చైర్మన్‌, మరికొందరి సభ్ల్యులతో ఖాతాలు ప్రారంభించాలి. వాటిని ఎస్‌టీఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.*

*జనవరి 8న పనుల ప్రారంభానికి అవసరమైన అంచనా విలువలో 15 శాతం నిధులు తీసుకోడానికి పేరెంట్‌ కమిటీ తీర్మానం చేయాలి.*

10న సంబంధిత ఇంజనీరింగ్‌ శాఖల ఈఈలతో పేరెంట్‌ కమిటీలు ఒప్పందం చేసుకోవాలి. అదే రోజున పనులు ప్రారంభించాలి.

CSE – APSS – ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List

MANA BADI NAADU NEDU BOOK KEPING PDF FILE

MANA BADI NEDU NADU FOR MUNICIPAL SCHOOLS

error: Content is protected !!