*🎯 ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మారిన పాఠ్య పుస్తకాలు….*
“`❇️ అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా దశల వారీగా అభివృద్ధి చేసే క్రమంలో ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు పాఠ్య పుస్తకాల స్వరూప స్వభావాలు సమగ్రంగా మారిపోయాయి.
తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఆంగ్ల మాధ్యమ బోధన వైపే సుమారు 98 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపిన నేపథ్యంలో ఆ దిశగానే టెస్ట్ బుక్ ముద్రణ పూర్తి కాగా, జిల్లాలోని మండల కేంద్రాలకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు.
సెప్టెంబరు 5న పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వం సన్నా హాలు చేస్తుండగా, అదే రోజున విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ టెస్ట్ బుక్ లు సరికొత్త రూపంలో దర్శనమివ్వను న్నాయి.
లాంగ్వేజ్ సబ్జెక్టు (తెలుగు,హిందీ,ఇంగ్లీషు) ల పాఠ్య పుస్తకాలు అలాగే ఉంటాయి.
ఇక నాన్- లాంగ్వేజెస్ సబ్జెక్టులు సైన్స్, గణితం, సోషల్ స్టడీస్ టెస్ట్ బుక్స్ తెలుగు మాధ్యమం కోరుకునే విద్యార్థులకు సైతం ఉపయోపడేలా సరికొత్త విధానంలో ముద్రించారు.