సబ్జెక్టుకు 3 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు*
ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠాలు
ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల్లో మూడు విడతల విధానాన్ని అమలు చేయనున్నారు.
విద్యా సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, పుస్తకాలను రూపొందించారు.
ఒక్కో సబ్జెక్టుకు 3 పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అందిస్తారు.
ఆంగ్ల మాధ్యమంపై కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో ఇప్పుడు ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు.
కన్నడం, తమిళం, ఉర్దూ లాంటి వాటికి ఒకే మాధ్యమం ఉంటుంది.
మొదటి విడత పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది.
ఇదీ కొత్త విధానం
ఒక్కో సబ్జెక్టులో పాఠ్యాంశాలను మూడుగా విభజించి పుస్తకాలు ఇస్తారు.
విడతల వారీగా విద్యార్థుల సామర్థ్యాలు విశ్లేషించి, పరీక్షలు నిర్వహిస్తారు.
ఇప్పటివరకు 1-5 తరగతులకు సమ్మెటివ్ పరీక్షలు రెండు, ఫార్మేటివ్‌లు-4 నిర్వహిస్తుండగా..
వీటిని నిర్వహించాలా? అంతర్గత పరీక్షలతోనే విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలా? అనే దానిపైనా కసరత్తు కొనసాగుతోంది.
విద్యార్థుల బ్యాగు మోత తగ్గించేందుకు, ఒత్తిడి నివారణకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.
భాషలకు సంబంధించి ఒకే మాధ్యమంలో, ఇతర సబ్జెక్టులకు రెండు మాధ్యమాల్లో పాఠాలు ఉంటాయి.