SBI-asks-to-update-custemers-kyc-details-last-date-February-28th

SBI-asks-to-update-custemers-kyc-details-last-date-February-28th

SBI Alert: ఎస్‌బీఐలో మీ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? అయితే 2020 ఫిబ్రవరి 28 లోగా మీ వివరాలు బ్యాంకులో అప్డేట్ చేయించాలి.

లేకపోతే ఏమవుతుందో తెలుసుకోండి.

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే వెంటనే మీ వివరాలు బ్యాంకులో అప్‌డేట్ చేయించాలి.

కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయనివారికి ఎస్‌బీఐ నోటీసు జారీ చేసింది.

బ్యాంకు లావాదేవీల్లో అవాంతరాలు రాకుండా ఉండాలంటే కస్టమర్లు వెంటనే కేవైసీ పూర్తి చేయాలని కోరుతోంది.

ఇందుకోసం 2020 ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది.

“కేవైసీ వివరాలు లేనివారు 2020 ఫిబ్రవరి 28 తేదీ లోగా అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించకపోతే వారి అకౌంట్లను బ్యాంకు ఫ్రీజ్ చేయొచ్చు” అన్నది ఆ నోటీసు సారాంశం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లోని ఉన్న నిబంధనల ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (మెయింటనెన్స్ ఆఫ్ రికార్డ్స్) రూల్స్-2005 ప్రకారం బ్యాంకులు కస్టమర్ల గుర్తింపు విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది.

అందుకే అన్ని బ్యాంకులు 2020 ఫిబ్రవరి 28 లోపు కస్టమర్ల కేవైసీ అప్‌డేట్ చేయాలి.

SBI KYC Updation: ఎస్‌బీఐలో కేవైసీ అప్‌డేట్ చేయండి ఇలా…


మీ కేవైసీ వివరాలు ఇప్పటివరకు అప్‌డేట్ చేయకపోతే బ్యాంకుకు వెళ్లి మీ ఐడీ ప్రూఫ్, అడ్రస్‌ ప్రూఫ్ అందజేయాలి.

కస్టమర్లు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి కొన్ని నిమిషాల్లోనే కేవైసీ అప్‌డేట్ చేయొచ్చు.

మీ పాస్‌పోర్ట్,

ఓటర్ ఐడెంటిటీ కార్డ్,

డ్రైవింగ్ లైసెన్స్,

ఆధార్ కార్డ్ లేదా లెటర్,

MNREGA కార్డ్,

పాన్ కార్డ్,

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-NPR కార్డ్,

ఇటీవలి ఫోటోలు,

మొబైల్ నెంబర్ మీ కేవైసీ వివరాల్లో అప్‌డేట్ చేయొచ్చు.

SBI నుండి అలర్ట్స్ రావడం లేదా అయితే ఇలా చేయండి

SBI QUICK MOBILE APP COMPLETE DETAILS

error: Content is protected !!