SBI-daily-atm-cash-withdrawal-limit-one-Lakh-with-debit-card

SBI-daily-atm-cash-withdrawal-limit-one-Lakh-with-debit-card

SBI ఏటీఎం రూల్స్.. రోజుకు రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు!

స్టేట్ బ్యాంక్‌లో మీకు అకౌంట్ ఉందా?

అయితే ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉపయోగిస్తుంటారా?

అయితే మీకు ఒక అలర్ట్. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో రోజుకు ఏకంగా ఏటీఎం నుంచి రూ.లక్ష వరకు తీసుకోవచ్చు.

SBI ఏటీఎం క్యాష్ విత్‌డ్రా పరిమితులు

రోజుకు రూ.20,000 నుంచి రూ.లక్ష వరకు డబ్బు తీసుకోవచ్చు

కార్డు ప్రాతిపదికన విత్‌డ్రా చేసుకునే డబ్బు లిమిట్ మారుతుంది

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది.

ఇందులో ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవలు కూడా ఒక భాగమే.

క్యాష్ విత్‌డ్రా పరిమితి డెబిట్ కార్డు ప్రాతిపదికన మారుతుంది.

రోజుకు రూ.20,000 నుంచి రూ.లక్ష వరకు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు 8 నుంచి 10 వరకు ఏటీఎం ట్రాన్సాక్షన్లను ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఉచిత పరిమితి దాటితే బ్యాంక్ కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేస్తుంది.

ఎస్‌బీఐ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా లిమిట్స్..

అక్టోబర్ 1 నుంచి బ్యాంక్ సర్వీస్ చార్జీలను సవరించింది.

అకౌంట్‌లో డబ్బులు లేకుండా ఏటీఎంకు వెళ్లి ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే అప్పుడు కూడా పెనాల్టీ చెల్లించాల్సిందే.

ఎస్‌బీఐ క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డులు ఉపయోగించేవారు రోజుకు ఏటీఎం నుంచి రూ.20,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఎక్కువ మంది క్లాసిక్ డెబిట్ కార్డునే ఉపయోగిస్తూ ఉంటారు.

ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉన్నవారు రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు

స్టేట్ బ్యాంక్ మై కార్డు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.40,000 ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.

 

ఎస్‌బీఐ ఎన్‌టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డుతో కూడా రోజుకు రూ.40 వేల క్యా్ష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ సిల్వర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి వరుసగా రూ.40 వేలు, రూ.50,000 తీసుకోవచ్చు.

 ఇకపోతే చివరిగా ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో రోజుకు ఏకంగా రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు.

error: Content is protected !!