sir-cv-raman-biography-national-science-day-february-28th

sir-cv-raman-biography-national-science-day-february-28th

రామన్‌కు లభించిన గౌరవ పురస్కారాలు

1924 –    రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ

     1929 – బ్రిటిష్ మహారాణి నుండి నైట్‌హుడ్, సర్

     1930 – నోబెల్ పురస్కారం

     1941 – ఫ్రాంక్లిన్ పతకం

     1954 – భారతరత్న

     1957 – లెనిన్ శాంతి బహుమతి

     1917 – ఐఅఇ గౌరవ కార్యదర్శి

     1933 – 48 భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఛిడెరైక్టర్

 రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని


 1. కాంతి వివర్తనము (scattering of light)

 2. అకాస్టిక్ (Acoustic) నాద తరంగ శాస్త్రం

 3. ఆప్టికా (Optica) దృగ్గోచర కాంతి శాస్త్రం

 4. ఖనిజములు, వజ్రముల కాంతి ధర్మాలు

 5. స్ఫటికముల భౌతిక విజ్ఞానం

 6. పుష్పాల రంగుల – అవగాహన

 7. వీణ, వయొలిన్, తబల, మృదంగం మొదలైన సంగీత వాద్యాలలో శబ్ద తరంగాలు.

 పత్రికలు

  ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ స్థాపన,  సంపాదకత్వం  ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ జర్నల్ ఆఫ్ ద ఇండియన్ అకాడెమీ ఆఫ్ సెన్సైస్  కరెంట్ సైన్స్ జర్నల్

 ఫిబ్రవరి 28వ తేదీన  రామన్ ఫలితం ఆవిష్కరణకు గుర్తుగా జాతీయ విజ్ఞాన

 శాస్త్ర దినం (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటారు.

 తన లక్ష్యాన్ని, ధ్యేయాన్ని గుర్తించి వాటి సాధన కోసం శ్రద్ధగా పనిచేసిన ప్రతిభాశాలి

 సర్ చంద్రశేఖర వేంకట రామన్.

సైన్సే నా మతం.. జీవితాంతం దానినే ఆరాధిస్తా’నని చెప్పిన విజ్ఞాన ఖని.. సర్ సీవీ రామన్

సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది..?ఆకాశం నీలి రంగులోనే ఉండటానికి కారణం ఏంటి? పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు.? ఇలాంటి ప్రశ్నలకు తన పరిశోధనలతో శాస్త్రీయంగా నిరూపించిన మహోన్నతడు సీవీ రామన్

సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సీవీ రామన్).

వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్‌ను శక్తివంతంగా చూపి, అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్.
వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్ అందుకున్న కాంతి పుంజం.

ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటివారు.

నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్.. నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అనంతరం మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి 19 ఏళ్లకు ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.

ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు.

ఆ సమయంలోనే పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధనలకు అనుమతిని పొందారు. నాటి నుంచి మొదలైన ఆయన పరిశోధనలు నిరంతరం కొనసాగాయి.

రామన్ ఎఫెక్ట్..:
సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుంది ఇది రామన్ ఎఫెక్ట్ ఫలితం. ‘‘కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో వెనుదిరుగుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీని ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, పరమాణు నిర్మాణాల పరిశీలన చేయవచ్చు. పలు పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాలను కూడా పరీక్షించవచ్చు.

రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వల్ల తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921 లో లండన్‌లో తాను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా? ఏంటి అని ఓ వ్యక్తి వెటకారంగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది.

సముద్రం నీరు నీలి రంగులో ఎందుకుంటుంది? ఈ అంశంపై సీ. వి. రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం. అనేక అద్భుతాలకు వేదికగా నిలిచింది. ఈ అంశంపై ఎన్నో పరిశోధనలు ఆయన చేశారు. ఈ ప్రయోగాలే ఆయనను నోబెల్ చెంతన నిలబెట్టాయి. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మళ్లాయి. ఇంగ్లాండు నుంచి తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపజేసింది.

అప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశ వర్ణం సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు అది పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించారు. తన పరికల్పలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్.కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్, అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్లు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధన చేశారు.

ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుందని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు. ఇందులో భాగంగా చేసిన రామన్ ఎఫెక్ట్స్‌కే 1930లో నోబెల్ బహుమతి లభించింది. భారత ప్రభుత్వం కూడా ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించి.. 1954 లో ‘భార తరత్న’ బిరుదు ఇచ్చింది. 1957 లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’తో సత్కరించింది.

భారతరత్న అందుకున్న సమయంలో రామన్ చేసిన ప్రసంగం నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు.. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి అంటూ రామన్ చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి.. అందుకే “విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం అని రామన్ ఎప్పుడూ చెబుతుండే వారు.

రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం.. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింపజేశారు.

1927లో భౌతిక శాస్త్రంలో కాంప్టన్ నొబెల్ బహుమతి పొందినప్పుడు రామన్‌లో సరికొత్త ఆశలను రేకెత్తించాయి. కాంప్టన్ ఫలితం ఎక్సరేస్ విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయంలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అధునాతనమైన పరికరాల్లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంతోనే అడుగులు వేశారు. సూర్యుని నుంచి వెలువడే తెలుపు రంగు కాంతి వాయువులోని అణువులపై పడి, వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని 1928 ఫిబ్రవరి 28న రామన్ తొలిసారిగా ప్రకటించారు.

పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు పదార్థాల గుండా కాంతిని ప్రసరించేటప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది.. ఈ విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో శాస్త్రజ్ఞుల సదస్సులో నిరూపించాడు. అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టును ఆవిష్కరించారు. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1929 లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో రూ.200 కూడా ఖర్చుచేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్‌ను అభినందించారు.

అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్‌‌ను 1924లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యత్వం.. 1928లో సర్ బిరుదు దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ 1947లో లభించింది. సి.వి. రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది.

విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబుల్ రావడం గగనం. అలాంటిది సర్ సీవీ రామన్ ఆ ఘనత సాధించారు. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో ఆఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగానూ ఖ్యాతిగడించారు. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్లడమేంటి?. విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్ ముందు వరకూ సైన్స్‌లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో దేశ శక్తిసామర్ధ్యా లను ప్రపంచానికి చాటి చెప్పి భారత్ కు నోబుల్ సాధించిపెట్టారు. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు.

NATIONAL SCIENCE DAY FEBRUAry 28th- 2020 PDF

error: Content is protected !!