TECHNICAL TEACHER’S CERTIFICATE-42 DAYS SUMMER TRAINING COURSE, 2019 (1st MAY 2019 TO 11th JUNE 2019)
కోర్సుపై ఆసక్తి చూపుతున్న మహిళలు * రూ.వేలల్లో వేతనం * ఏటా పెరుగుతున్న డిమాండ్
నలబై రెండు రోజుల శిక్షణ భవితకు రక్షణగా నిలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం దక్కాలంటే గగనం అవుతున్న ఈ తరుణంలో సులభంగా ఉద్యోగ యోగం సాకారం అయ్యే కోర్సుపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా మహిళలు శిక్షణ పొంది ధ్రువపత్రాలు అందుకొని కొలువులను కొల్లగొడుతున్నారు. అందుకే టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సుకు ఏటా డిమాండ్ పెరుగుతోంది.
టీసీసీ కోర్సు ప్రాధాన్యం ఏమిటి.. ఎలా శిక్షణ పొందాలి.. శిక్షణ అనంతరం ఉద్యోగాలు పొందిన విజేతలతో ప్రత్యేక కథనం. వృత్తి నైపుణ్యమే భవితకు మార్గం పాఠశాల స్థాయిలో బాలబాలికలకు వృత్తి నైపుణ్యం అందివ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కళాత్మక విద్య, పని విద్య, వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చదువుతోపాటు కళల్లో తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు వృత్తి నైపుణ్యం అందివ్వాలన్నదే ధ్యేయం. ఆదర్శ పాఠశాలల్లో ప్రత్యేకంగా వృత్తి విద్య కోర్సులు ప్రవేశ పెట్టి పదోతరగతి పూర్తయ్యేలోపు అదనంగా మరో సర్టిఫికెట్ విద్యార్థులకు ఇస్తున్నారు. జిల్లాలో కనీసం 200 మందికి పైగా ఉన్న పాఠశాలల్లో వర్కు ఎడ్యుకేషన్ టీచర్లను నియమించి వారికి నెలకు రూ.15వేల వేతనం అందిస్తున్నారు. తాజాగా ఆయా పాఠశాలల్లో మొత్తం 553 పోస్టులను వర్కు ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ కింద మంజూరు చేశారు. ఇందులో టీటీసీ చేసిన 402 మంది జిల్లాలోని పలు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 151 ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సి ఉంది. చిన్నారుల్లో వృత్తి నైపుణ్యం కల్పిస్తేనే వారి ఉజ్వల భవితకు మార్గం ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. ఊహించని వేతనం
కోర్సు పూర్తి వివరాలు శిక్షణ పేరు: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు శిక్షణ ఎన్ని రోజులు: 42 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి దరఖాస్తుకు గడువు: 30.4.2019 అర్హత: 18సంవత్సరాలు నిండి 45 సంవత్సరాలలోపు (10వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి) ఎప్పటి నుంచి ఎప్పటి దాకా: 1.5.2019 నుంచి 11.6.2019 వరకు
TECHNICAL TEACHERS COURSE 42 DAYS SUMMER TRAINING COURSE WILL BE CONDUCTED AT VISAKHAPATNAM, KADAPA, GUNTUR, ANANTHAPURAM AND KAKINADA FROM 1ST MAY-2019 TO 11TH JUNE-2019 .
THE CANDIDATES WHO SEEK ADMISSION SHOULD HAVE COMPLETED 18 YEARS AND NOT CROSSED 45 YEARS AS ON 01-05-2019 AND PASSES 10TH CLASS EXAMINATIONS ALONG WITH A LOWER GRADE TECHNICAL CERTIFICATE COURSE (TTC) IN THE TRADE.
THE CANDIDATES WHO ARE ELIGIBLE IN ALL ASPECTS ARE REQUESTED TO CONTACT THE DEO VISAKHAPATNAM, KADAPA, GUNTUR OR KAKINADA OR ANANTHAPURAM FOR FURTHER DETAILS.
THE ADMISSION WILL MADE FROM 23-04-2019 TO 30-04-2019 AND