*టెన్త్ విద్యార్థులకు నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు డీపీసీబీ ఆధ్వర్యంలో రెండు మోడల్ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు డీఈఓ శైలజ తెలిపారు.*
*పరీక్షలకు ముందు వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రం ఉంచుతున్నామని దానిని ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకుని వాట్సప్ ద్వారా విద్యార్థులకు పంపించాలని సూచించారు.*
*విద్యార్థులు ఇంటి వద్దే పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు.*
*ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరుగుతాయని, అదే రోజు మధ్యాహ్నం జవాబులను (ప్రిన్సిపాల్ ఆఫ్ వాల్యుయేషన్) మధ్యాహ్నం 3 నుంచి వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు.
వీటిని కూడా వాట్సప్ ద్వారా పంపిస్తే విద్యార్థులే వారి జవాబు పత్రాలు దిద్దుకోవాలని సూచించారు.*