Amaravati-Balotsvam-starts-January-2nd-2019-Vijayawada-ap

Amaravati-Balotsvam-starts-January-2nd-2019-Vijayawada-బాలోత్సవం

జనవరి 2, 3, 4వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతాయి.

విజయవాడ పటమటలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రాంగణంలో జరుగును.

బాలోత్సవానికి 200 పాఠశాలలు..*

*♦ఆరు వేల  మంది విద్యార్థులు*

*♦చిన్నారుల ఆలోచనల ప్రపంచం*

*♦జనవరి 2, 3, 4వ తేదీల్లో నిర్వహణ*

*?చిన్నారులకు చదువొక్కటే ప్రధానం కాదు.. వారి పరిపూర్ణ మానసిక వికాసానికి అవసరమైన ఆటలు, పాటలు, కళలు ఎంతో అవసరం. భాషపై పట్టు సాధించడం.. నైతిక విలువలను పెంపొందించుకోవడం.. వారిలో దాగి ఉన్న సహజసిద్ధ నైపుణ్యాలను వెలికితీసేలా విద్యను అందించడం.. వంటివి చాలా అవసరం. కానీ.. ప్రస్తుత విద్యావిధానంలో ఈ విషయాన్ని విస్మరిస్తుండడం ఆందోళనకర పరిణామం. మార్కులు.. ర్యాంకుల గోలలో పడి.. చిన్నారుల బంగారు భవిష్యత్తును తీవ్ర ఒత్తిడిమయం చేస్తున్న సమయమిది. అందుకే.. చిన్నారుల్లో దాగి ఉండే నిగూఢ నైపుణ్యాలను వెలికితీసేందుకు.. వారిలో విద్యపై ఆసక్తిని పెంచేందుకు అమరావతి రాజధాని పరిధిలోని పలువురు విద్యా, సాహితీవేత్తలు, ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారు.*

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

ఏడాదికోసారి విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించి.. ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రైవేటు, కార్పొరేటు, ప్రభుత్వ, నగరపాలక సంస్థ.. పాఠశాలలన్నింటిలో చదివే విద్యార్థులందరినీ.. ఒక్కచోటికి చేర్చేలా.. ‘అమరావతి బాలోత్సవం’ పేరిట గత ఏడాది నుంచి పిల్లల పండుగను నిర్వహిస్తున్నారు. అమరావతి బాలోత్సవం 2018ను జనవరి 2, 3, 4వ తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది తొలిసారి నిర్వహించిన అమరావతి బాలోత్సవం 2017లో.. సీఆర్‌డీఏ పరిధిలోని 143 పాఠశాలల నుంచి 49 విభాగాలలో నాలుగు వేల మంది పిల్లలు పోటీపడ్డారు. ఈసారి 200 పాఠశాలల నుంచి ఆరు వేల మంది పిల్లలు నమోదు చేసుకున్నారు.

ఒకేసారి ఆరు వేదికలపై

జనవరి 2, 3, 4వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. విజయవాడ పటమటలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రాంగణంలో జరిగే ఈ పిల్లల పండుగలో.. ఒకేసారి ఆరు వేదికలపై చిన్నారులకు సాంస్కృతిక విభాగంలో పోటీలు జరుగుతాయి. మరో 15 గదుల్లో అకడమిక్‌ ఈవెంట్ల పోటీలు నిర్వహిస్తారు. రోజూ ఉదయం వచ్చి పాల్గొని సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోయేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆరు వేల మంది పిల్లలు, వారిని తీసుకొచ్చే గురువులు, న్యాయనిర్ణేతలు అందరికీ మూడు రోజులు అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తున్నారు.

విద్యార్థుల్లో తారతమ్యాలు లేకుండా..

చదువు ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుని అన్ని పాఠశాలల్లోనూ విద్యావిధానం సాగుతోంది. అందుకే అన్ని రంగాల్లోనూ పిల్లలు ఎదగాలంటే.. వారిలోని సహజసిద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశంతోనే అమరావతి బాలోత్సవం కమిటీ ఆవిర్భవించింది. పిల్లలంతా సమానమేననే భావన పెంపొందించడమే బాలోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ పిల్లల పండుగలోని పోటీల్లో పాల్గొనే విద్యార్థులెవరూ వారి పాఠశాల దుస్తుల్లో రాకూడదు. వారి పేరు, పాఠశాల, ఊరి పేరు కూడా చెప్పకూడదు. పోటీల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికి ఓ కోడ్‌నంబరు ఇస్తారు. దానిని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది.

Amaravati-Balotsvam-starts-January-2nd-2019-Vijayawada-బాలోత్సవం

నాలుగు విభాగాలుగా పోటీలు..*

ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులను నాలుగు విభాగాలుగా చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతి విద్యార్థులకు బేబీ జూనియర్ల విభాగంలో పోటీలు పెడుతున్నారు. 2, 3, 4వ తరగతి విద్యార్థులు సబ్‌జూనియర్ల విభాగంలో పోటీ పడతారు. ఈ రెండు విభాగాలకూ ఫ్యాన్సీ డ్రెస్‌, రైమ్స్‌, కథలు చెప్పడం మూడు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. 5, 6, 7వ తరగతి వాళ్లు జూనియర్ల విభాగంలో, 8, 9, 10 విద్యార్థులు సీనియర్ల విభాగంలో పోటీ పడతారు. ఈ రెండు విభాగాలకూ అకడమిక్‌ ఈవెంట్స్‌లో భాగంగా.. చిత్రలేఖనం, వ్యాసరచన (తెలుగు, ఆంగ్లం), తెలుగులో మాట్లాడడం, కథారచన, వక్తృత్వం (తెలుగు, ఆంగ్లం), కార్టూన్‌, స్పెల్‌బి, బెస్ట్‌ ఫ్రమ్‌ వేస్ట్‌, సైన్స్‌ ఎగ్జిబిషన్‌, వార్తా రచన, పద్యం భావం, మట్టితో బొమ్మలు, మెమొరి టెస్ట్‌, క్విజ్‌, కథా విశ్లేషణ, కవితా రచన పోటీలను వేర్వేరుగా నిర్వహిస్తారు. కల్చరల్‌ విభాగంలో.. ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ, మూకాభినయం, షార్ట్‌ఫిల్మ్‌ విశ్లేషణ, క్లాసికల్‌ డాన్స్‌, మిమిక్రీ, దేశభక్తి గీతాలాపన, జానపద నృత్యం, లఘునాటిక బృందం, కోలాటం పోటీలను నిర్వహిస్తున్నారు.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

పోటీల కోసం ప్రత్యేక శిక్షణ..*

బాలోత్సవంలో నిర్వహించే 58 విభాగాలలో పోటీ పడాలనుకునే విద్యార్థులకు అవసరమైన తర్ఫీదును సైతం ప్రత్యేకంగా ఇస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులతో ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు పోటీ పడలేమనే భావన ఉంటే.. వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇవ్వడం చేస్తున్నారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలోని నాలుగో అంతస్థులో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. విద్యార్థులు చిత్రలేఖనం, మిమిక్రీ, నృత్యం, షార్ట్‌ఫిల్మ్‌ మేకింగ్‌… ఇలా ఏ విభాగంలో పోటీ పడాలనుకుంటే.. అందులోనూ ఆయా రంగాల్లోని నిపుణులను తీసుకొచ్చి చిన్నారులకు శిక్షణ అందించారు.

విద్యార్థుల్లో ఉత్సాహం నింపేవే అన్నీ..

బాలోత్సవంలో భాగంగా విద్యార్థుల మధ్య నిర్వహిస్తున్న పోటీలన్నీ వారిలో ఉత్సాహం నింపే విధంగానే రూపొందించారు. ఒక్క పదం ఆంగ్లం రాకుండా తెలుగులో మాట్లాడం, కథలను విశ్లేషించడం, ఒక గదిలో ఉంచిన వస్తువులన్నింటినీ ఐదు నిమిషాల్లో గమనించి.. పది నిమిషాల్లో టకటకా చెప్పేయడం, కార్టూన్లు గీయడం, బెస్ట్‌ ఫ్రం వేస్ట్‌ లాంటి పోటీల్లో.. పనికి రాని చెత్త నుంచి ప్రయోజనకరమైన సామగ్రిని తయారుచేయడం, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ పోటీలో విద్యార్థులు అక్కడికక్కడే వస్తువులను తయారుచేయడం.. వంటివన్నీ వారిలోని ప్రతిభను వెలికితీసేలా ఉన్నవే.

చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం..*

అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులంతా కలిసి ఓ కమిటీగా ఏర్పడి.. అమరావతి రాజధానిలో ఉండే చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే అమరావతి బాలోత్సవాన్ని గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నాం. ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి చివరి రోజు బహుమతుల ప్రదానం ఉంటుంది.

అంతా ఒక్కటనే భావన రావాలనే..

పిల్లలకు చదువు చాలా అవసరమే. కానీ.. అదే వారి అభిరుచులు, ఆసక్తులు, సృజనను తుంచేదిగా మారకూడదు. చదువుకు తోడుగా.. అన్ని రకాల సృజనాత్మక అంశాల్లోనూ ప్రోత్సహించాలి. సమాజానికి.. కొంతైనా తిరిగి ఇవ్వాలనే సామాజిక చైతన్యం అందరిలో రావాలి. అంతా ఒక్కటనే భావన వారిలో రావాలి. చిన్నారుల్లో ఇలాంటి విశాలమైన భావన పెరగడానికి, సృజనను ప్రోత్సహించడానికే.. అమరావతి బాలోత్సవాన్ని ఏటా నిర్వహించాలని నిర్ణయించాô.

error: Content is protected !!