ap-government-police-providing-emergency-traveling-e-pass-online

ap-government-police-providing-emergency-traveling-e-pass-online

how-to-get-in-case-of-emergency-police-pass-online

MAY 23RD, 2020,

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాస్‌లు అక్కర్లేదు

ఏపీ ప్రజలకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలంటే పాస్‌లు అవసరం లేదు. అంతర్ జిల్లాల్లో పాస్‌లు లేకుండా తిరగొచ్చంటోంది. శుక్రవారం నుంచి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రజలు పోలీసులు తాము పొరుగు జిల్లాలకు వెళ్లాలని పెద్ద ఎత్తున అనుమతి కోసం ట్వీట్‌లు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. పొరుగు జిల్లాలకు వెళ్లాలంటే పాస్‌లు అవసరం లేదని తేల్చి చెప్పారు.

పాస్‌లు లేకపోయినా కండిషన్స్ అప్లై అంటున్నారు పోలీసులు.

కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అలాగే… మాస్కులు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరగడానికి వీల్లేదని.. ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటేనే వెళ్లాలని సూచిస్తున్నారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఇక రెడ్, ఆరెంజ్ జోన్స్‌.. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు కొనసాగుతాయంటున్నారు. అంతేకాదు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.. తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవు.

పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. ఏపీకి రావాలన్నా అనుమతి తప్పనిసరి. ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి మాత్రమే పాస్‌లు జారీ చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది.

స్పెషల్ పాస్‌లు జారీ, దరఖాస్తు వివరాలిలా

లాక్ డౌన్ సమయంలో మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి బయటకు వెళ్లాల్సి వస్తే భయపడాల్సిన పని లేదు.

వివిధ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చే వారి కోసం ఏపీ ప్రభుత్వం  ఎమర్జెన్సీ ట్రావెల్ పాస్ లను ప్రవేశ పెట్టింది. 

అత్యవసర ఈ -పాస్ కోసం ప్రత్యేక పోర్టల్,

అత్యవసర వైద్యం, కుటుంబంలో మరణం, సామజిక పనులు, ప్రభుత్య విధినిర్వహణ పనులపై ప్రయాణించే వారో కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ని ప్రవేశపెట్టినట్లు ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.

కోవిడ్ -19 అత్యవసర ఈ -పాస్ కోసం పోలీస్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి.ఈ పాస్ లు ఆమోదిస్తే అత్యవసర ఇ -పాస్ ను మొబైల్ ల, మెయిల్ ఐడి కి పంపుతారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు పోలీసుల నుండి వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పాస్ పొందవచ్చు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకునే వారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నెంబర్, వాహన నెంబర్, ప్రయాణం ప్రారంభించే ప్రదేశం మరియు గమ్యస్థానం, ఈ-మెయిల్ ఐడీ వంటి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు (ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు) అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 EMERGENCY VEHICLE PASS(AP POLICE)

https:citizen.appolice.gov.in

AP POLICE MAIN WEBSITE

https:citizen.appolice.gov.in

పాస్ కావాల్సిన వాళ్లు ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి

1) పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

2) ప్రయాణించేవారి వివరాలు

3) ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్

4) మెయిల్ ఐడీ

5) అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు

6) మొబైల్ నంబర్

7) వాహనానికి సంబంధించిన వివరాలు

ఈ ప్రొసెస్‌లో వెరిఫికేషన్ సమయంలో మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. అప్లికేషన్ పెట్టె ముందు పైన ఇచ్చిన అన్ని రెడి చేసుకుని ప్రాసెస్ ప్రారంభించాలని పోలీస్‌శాఖ సూచించింది.

దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ఓ రిసిప్ట్ వస్తుంది.. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉండి.. కారణాలు నిజమైతే ఆ తర్వాత మీకు ఈసారి రూటు పాస్ లభిస్తుంది.

నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్‌ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది.

అత్యవసర ప్రయాణాలకు పాసులు జారీ చేయనున్న ప్రభుత్వం*

ONLINE REGISTRATION FORM FOR E-PASS(SPANDANA)

error: Content is protected !!