AP-10th-class-ssc-public-examinations-July-2020-time-table-model-papers

AP-10th-class-ssc-public-examinations-July-2020-time-table-model-papers

జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు

పదోతరగతి పరీక్షలను జులై 10నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

ప్రశ్నపత్రాల విషయంలో కీలక మార్పు చేశారు. వాటి సంఖ్యను 11 నుంచి 6కు కుదించారు.

ప్రస్తుతం హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 50మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు  ఒక పేపరు చొప్పున 100మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

పరీక్షలకు ఎలాంటి విరామం లేకుండా రోజువారీగా నిర్వహించనున్నారు.

ప్రధాన పరీక్షలన్నీ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. కాంపోజిట్‌ కోర్సు మొదటి భాష పేపర్‌-1ను 70మార్కులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు, పేపర్‌-2ను 30 మార్కులకు 9.30 గంటల నుంచి 11.15గంటల వరకు నిర్వహించనున్నారు.

వోఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష(సంస్కృతం, అరబిక్‌, పార్శి)-1, 2 పేపర్లు వంద మార్కుల చొప్పున నిర్వహించనున్నారు.

వొకేషనల్‌ కోర్సు థియరీ పరీక్ష ఒకటి 30, మరొకటి 40మార్కులకు ఉంటుంది.

ఇవి 9.30 నుంచి 11.30గంటల వరకు నిర్వహిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6,30,804 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది.

భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది.

ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. 

తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. 

విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది.

పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. 

కాగా,లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా పడిన విషయం తెలిసిందే.

10th CLASS EXAMS JULY-2020 TIME TABLE COPY PDF DOWNLOAD HERE

10TH CLASS 100 MARKS DIVISION FOR ALL SUBJECTS BLUE PRINT

10th CLASS EXAminations instructions proceedings

July 2020 SSC  public Exams  లో P.S & B.S ఒకే‌ Paper  క్రింద ఉంటాయి.

Question papers Separateగా  50 మార్కులకు  ఉంటాయి.

Answer Sheets  విడి విడి గా ఇస్తారు ఒకే ‌Bundle లో విడి విడి గా Packets ఉండును..

రెండింటికి కలిపి Time 2.45 hrs.Valuation  కూడా విడి విడి గా జరుగును.

MARKS  postings ఒకే‌ OMR  లో ఇద్దరిచే జరుగును. (క్లారిటీ రావాలి)

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది.

ఉచిత రవాణా సదుపాయం..*

విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నారు. హాల్‌టికెట్‌ చూపించి బస్సుల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల కోసం బస్సులు నడపాలని ప్రజా రవాణా విభాగాన్ని కోరనున్నారు.

*🔹మారనున్న హాల్‌టికెట్లు..*

కరోనా కారణంగా విద్యార్థుల మధ్య 4 అడుగుల చొప్పున దూరం ఉండేలా చర్యలు తీసుకుంటారు.

ఒక్కో గదిలో 10-12మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల పరీక్ష కేంద్రాల సంఖ్య పెరగనుంది. దీంతో ప్రస్తుతం జారీ చేసిన హాల్‌టికెట్లు మారనున్నాయి.

ప్రస్తుతం 50మార్కులే వందకు..*

ప్రస్తుతమున్న 50మార్కుల ప్రశ్నపత్రాన్నే వంద మార్కులకు ఇస్తారు.

ప్రశ్నల సంఖ్యను అలాగే ఉంచి మార్కులను రెట్టింపు చేస్తారు.

ప్రశ్నలను రెండు పేపర్ల నుంచి సమానంగా ఇస్తారు.

కొత్త ప్రశ్నపత్రాలను రూపొందించి ముద్రించనున్నారు.

16 నుంచి వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నాపత్రాలు*

*పదో తరగతి మాదిరి ప్రశ్నాపత్రాలు ఈ నెల 16 నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు.

పరీక్షల నిర్వహణకు కొత్తగా కేంద్రాలను గుర్తించి, ఈనెల 18లోపు పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

►జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

►జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)

►జూలై 13న మ్యాథ్స్ ‌(9.30am- 12.45pm)

►జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)

►జూలై 15న సోషల్ స్టడీస్‌ (9.30am- 12.45pm)

10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS CLICK HERE

10th CLASS ALL SUBJECTS STUDY MATERIAL & MODEL PAPERS

error: Content is protected !!