chenges-of-ap-10th-class-public-exams-papers-2019-20

chenges-of-ap-10th-class-public-exams-papers-2019-20

ఏపీ పదోతరగతి ప్రశ్నపత్రంలో మార్పులు

ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు మారనున్నాయి.

ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు.

ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి. దీనికి సంబంధించిన బ్లూప్రింట్‌ సిద్ధమైంది.

తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు.

ఒక్కో పేపర్‌లో 10 మార్కులకు బిట్‌ పేపర్‌, మిగతా 40మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.

బిట్‌ పేపర్‌లో ప్రస్తుతం 10 మార్కులకు 20 బిట్లు ఇస్తున్నారు.

వీటిల్లో అన్నీ బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటున్నాయి.

సమాధానాలు ఏ, బీ, సీ, డీగా ఉంటున్నాయి. కొత్త విధానంలో ఇలాంటి ప్రశ్నలతోపాటు, ఖాళీల పూరింపు లాంటి వాటిని ఇవ్వనున్నారు.

తేలిన పదవ తరగతి వంద మార్కుల ప్రశ్నాపత్ర కూర్పు.

తాజాగా  ప్రశ్నల సంఖ్య మార్పు.         

 పార్టు – ఎ (మెయిన్ పేపర్)40 మార్కులు

ఒక మార్కు ప్రశ్నలు – 8(no choice),

రెండు మార్కుల ప్రశ్నలు -6(no choice),

నాలుగు మార్కలు ప్రశ్నలు-5(internal choice).                         

పార్టు -బి (bit paper) 6 మార్కులు.

మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు-(5మార్కులు),

ఖాళీలు-5(రెండున్నర మార్కులు),

ఒన్ వర్డ్ ఆన్సర్స్-5(రెండున్నర మార్కులు).             

*గమనిక:

రెండు పేపర్లు కలిపి 12 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది.

*బిట్ పేపర్ను తొలగించలేదు*

ప్రశ్నలు ఇలా.. 

ప్రశ్నపత్రంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు.

40 మార్కులకు ఇచ్చే ప్రశ్నపత్రంలో ఒక మార్కు, రెండు, నాలుగు మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు.

ప్రశ్నల స్థాయిలోనూ మార్పు చేయనున్నారు. లాంగ్వేజెస్‌ విషయానికొస్తే నాలుగు మార్కుల ప్రశ్నల స్థానంలో ఐదు మార్కుల ప్రశ్నలు ఇవ్వనున్నారు.

2019-20 నుండి అంతర్గత మార్కులు ఉండవని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రకటించారు.

ఈ అంతర్గత మార్కులు వచ్చే విద్యా సంవత్సరం నుండి తొలగించబడతాయి

GO.Ms.No.41 : CCE పరీక్ష విధానం లో సంస్కరణలు*

★ GO.Ms.No.80 తేదీ 25/10/ 2017 మరియు GO.Ms.No.62, dt:18/9/ 2018 లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల. 

విద్యార్థి  100 మార్కులకు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది.

పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు.

హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.

కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.

★ 5). పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.

FOR MORE DETAILS G.O.MS.40 CLICK HERE FOR DOWNLOAD

NO INTERNAL MARKS FOR 10TH CLASS STUDENTS COMPLETE DETAILS

error: Content is protected !!