పాఠశాలల్లో వివిధ తరగతుల పునఃప్రారంభంపై సవరణ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
▪️8వ తరగతి – నవంబర్ 23, 2020
▪️6, 7 తరగతులు డిసెంబర్ 14, 2020
▪️1 నుండి 5 వ తరగతి వరకు – సంక్రాంతి సెలవులు తరువాత.
ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు.
ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో,
ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు.*
FA 1, FA 2 & SA 1 Exams:
FA 1 will be conducted in December last week. FA 2 will be conducted in February last week SA 1 will be conducted in April last week
Schools working days as follows
07 days in November,
26 days in December,
22 days in January,
24 days in February,
26 days in March,
21 days in April.
23.11.2020 నుండి పాఠశాల నిర్వహణ సమయం మారిన నేపథ్యంలో… ఉన్నత పాఠశాల కాలనిర్ణయ పట్టిక-2020 [సమయం: 9:30-4:15]*
ప్రతి సోమ, బుధ మరియు శుక్ర వారాలు 9వ తరగతి విద్యార్థులు.
ప్రతి మంగళ, గురు మరియు శని వారాలలో 8వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి.
ఉన్నత పాఠశాలల కాల నిర్ణయం పట్టిక
9.30AM తో 9.45AM ప్రార్ధన మరియు కోవిద్ 19 ప్రతిజ్ఞ (తరగతి లో) సాధారణ సమావేశం నిషిద్ధం.
9.45AM తో 10.25AM మొదటి పీరియడ్
10.25AM – 10.35AM ఆనంద వేదిక/ భౌతిక దూరం పాటిస్తూ పాఠశాల ఆదివారం లో నడవడం/చేతులు కడుక్కోవడం/మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం
10.35AM – 11.15AM రెండవ పీరియడ్
11.15 AM – 11.20 AM మంచి నీటి విరామం (వాటర్ బెల్)
11.20AM – 12.00PM మూడవ పీరియడ్
12.00PM – 12.10PM ఆనంద వేదిక (దాదాలు చెప్పాడ0/చిత్రలేఖనం/పాఠ్యముసలకు సంబంధించిన నాటకీకరన /చేతులు కడుక్కోవడం/ ప్రణామయం / మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం.
12.10 PM- 12.50PM భోజన విరామం (8, 9వ తరగతి విద్యార్థులకు)/4వ పీరియడ్ (10వ తరగతి)
12.50PM – 1.30 PM భోజన విరామం (10వ తరగతి విద్యార్థులకు)/4వ పీరియడ్ (8, 9వ తరగతి)
1.30PM విద్యార్థులు ఇంటికి వెళ్ళుట
1.30 PM- 2.00PM ఉపాధ్యాయుల భోజన విరామం
2.00PM – 2.15 PM ఆన్లైన్ బోధనా, విద్యార్థులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించుకు ఉపాధ్యాయుల సమావేశం
2.15 PM- 4.00PM వాట్సాప్/దూరదర్శన్/దీక్ష/అభయస అప్/యూట్యూబ్/ఫోన్ ద్వారా సామూహిక సంభాషణ మరియు విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చుట వంటి ఆన్లైన్ తరగతులను నిర్వహించుట మరియు పర్యవేక్షించుట.
4.00PM – 4.15 PMఉపాధ్యాయులు మరుసటి రోజుకు ప్రణాళిక సిద్ధం చేసుకొనుట.
ది 23_11_20 సోమవారం నుండి Upper primary, High schools నందు , 8వ తరగతి ప్రారంభ వివరాలు
23 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు.
క్రమేణా ఉన్నత పాఠశాలల్లో అన్ని తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు.
సచివాలయం : ఈనెల 23 సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటికే ఈనెల 2 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం తో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. 8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు.
Commissioner of school education వారు ఈ రోజు 3 formats పంపడం జరిగినది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా ప్లాన్ చేసుకుని వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను.