doubts-on-elections-2019-P.O-APO’s-mock-poll-EVM-VVPAT-CU-BU
HANDS ON(EVMs)పై ప్రశ్నావళి*_
*1) ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వాడుతున్న EVMs M2 న లేక M3న? M2&M3 కి ప్రధాన తేడా ఏమిటి?*
జ: M2 కి M3 ప్రధాన తేడా VSDU.
*2) VSDU ని ఏ EVM తో అనుసంధానం(connect)చేయాలి?*
జ:VVPAT తో (బ్లూ & గ్రీన్ కలర్ కోడ్).
*3) MOCK POLL లో CU,BU&VVPAT లలో సమస్య వస్తే ఏం చేయాలి?*
జ: ఏ యూనిట్ లో సమస్య ఉంటే, ఆ UINT మాత్రమే మార్చాల్సి ఉంటుంది.
*4) ACTUAL(రియల్)* *POLLలోCU లేదా BU లో సమస్య వస్తే ఏం చేయాలి?*
జ: TOTAL EVM సెట్ మార్చాల్సి ఉంటుంది.
*5) ACTUAL POLL లో VVPATలో మాత్రమే సమస్య వస్తే ఏం చేయాలి?*
జ: కేవలం VVPAT మాత్రమే మార్చాలి.
*6) ACTUAL POLLలో VVPAT మార్చినచో 2nd mock poll అవసరమా?లేదా?*
జ: అవసరం లేదు.
*7) 2nd Mock Poll ఎప్పుడు చేయాలి?ఎన్ని ఓట్లు వెయ్యాలి?*
జ: Real Poll మధ్యలో CU కానీ BU కానీ మార్చవలసి వస్తే TOTAL SET మారుస్తాం. అప్పుడు 2nd mock poll చెయ్యాలి.
ప్రతీ కాండిడేట్ కు ఒక vote వెయ్యాలి.
*8) Mock Poll స్లిప్స్ ని ఎలా భద్రపరచాలి? ఏ seals వాడాలి?*
జ: VVPAT లో 57 Slips కి వెనుక mock poll రబ్బర్ స్టాంప్ వేసి black కవర్లో ఉంచి, ప్లాస్టిక్ కంటైనర్ లో pink సీల్ వేసి pro, agents sign తో భద్రపచాలి.
*9) C R C అంటే ఏమిటి? ఇది ఎప్పుడు చేయాలి?*
జ:CLOSE ➡️RESULT➡️ CLEAR.
MOCL POLL చేసిన తర్వాత మరియు MOCK POLL ముందు INVALID వస్తే CRC చేయాల్సి ఉంటుంది.
*10) Total Buttonఎప్పుడు వాడాలి?*
జ:మొత్తం POLL అయిన VOTES ప్రతీ 2 గం. లకు చూసుకోవటానికి వాడాలి.