కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో అడ్మిషన్లు కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త.
అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
1వ తరగతిలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ఆగస్ట్ 7 వరకు ఆన్‌లైన్ రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
రెండో తరగతి నుంచి అన్ని క్లాసులకు ఇవాళ్టి నుంచి జూలై 25 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. ఈ క్లాసుల్లో ఖాళీలు ఉంటేనే అడ్మిషన్లు లభిస్తాయి.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఇటీవల కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో అడ్మిషన్ రూల్స్ మారాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, అటనామస్ బాడీస్, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశంలో పనిచేస్తున్న విదేశీయులు పిల్లలకు కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ప్రాధాన్యం ఉంటుంది.
అయితే భారతీయ విద్యార్థులు వెయిటింగ్ లిస్ట్‌లో లేకపోతేనే విదేశీయుల పిల్లల్ని పరిగణలోకి తీసుకుంటారు.
ఇక ఏ తరగతికి ఏఏ వయస్సు విద్యార్థులు అర్హులో ఈ కింది జాబితాలో తెలుసుకోండి.
మార్చి 31 నాటికి వయస్సును లెక్కిస్తారు.
1వ తరగతి- 5 నుంచి 7 ఏళ్లు 2వ తరగతి- 6 నుంచి 8 ఏళ్లు 3వ తరగతి- 7 నుంచి 9 ఏళ్లు4వ తరగతి- 8 నుంచి 10 ఏళ్లు 5వ తరగతి- 9 నుంచి 11 ఏళ్లు 6వ తరగతి- 10 నుంచి 12 ఏళ్లు 7వ తరగతి- 11 నుంచి 13 ఏళ్లు 8వ తరగతి- 12 నుంచి 14 ఏళ్లు 9వ తరగతి- 13 నుంచి 15 ఏళ్లు 10వ తరగతి- 14 నుంచి 16 ఏళ్లు
KVS Admission 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
1వ తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 జూలై 20 ఉదయం 10 గంటల నుంచి
1వ తరగతిలో అడ్మిషన్ల దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7 సాయంత్రం 7 గంటలు మొదటి జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 11
రెండో జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 24
మూడో జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 26
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం రెండో నోటిఫికేషన్ విడుదల- 2020 ఆగస్ట్ 31
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 5 రెండో తరగతి నుంచి ఇతర తరగతులకు దరఖాస్తులు- 2020 జూలై 20 నుంచి జూలై 25 వరకు ఎంపికైన వారి జాబితా విడుదల- 2020 జూలై 29
అడ్మిషన్లు- 2020 జూలై 30 నుంచి 2020 ఆగస్ట్ 7
అప్లై చేయండి ఇలా…ముందుగా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Click here to register పైన క్లిక్ చేయాలి. నియమనిబంధనలన్నీ చదివి PROCEED పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఐడీ ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి. ఫోటో, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ రూల్స్‌ని మార్చింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్.
ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ప్రస్తుత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి.
కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో 27 శాతం సీట్లు ఓబీసీ విద్యార్థులకు కేటాయించారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లోనే నిర్ణయించింది.
ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి వచ్చింది. 1వ తరగతిలో అడ్మిషన్లు ఆన్‌లైన్ డ్రా ద్వారా చేపడతారు.
2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాధాన్యతా క్రమంలో అడ్మిషన్లు ఉంటాయి.
ఒకవేళ ఉన్న సీట్ల కన్నా దరఖాస్తులు ఎక్కువైతే లాటరీ సిస్టమ్ అమలు చేస్తారు.
9వ తరగతి అడ్మిషన్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది.
11వ తరగతి అడ్మిషన్లు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
ఇక 10వ తరగతి, 12వ తరగతి అడ్మిషన్లు సీట్ల లభ్యతను బట్టి ఉంటుంది.