new-Dearness-Allowance-D.A-rates-RPS-2015-from-july-2013
ప్రభుత్వం 3 DA ల విడుదలపై అధికారిక ప్రకటన చేసింది.*
1-1-2019 నుండి 35.108%
1-7-2019 నుండి 42.968%.
DA 30.392 SGTs.pdf
DA 30.392% ARREARS
JULY-2018 నుండి DEC-2020 వరకు
30 నెలల బకాయిలు
2021 – ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో
మూడు విడతలుగా ఇవ్వనున్నారు.
పై FILE ను *MS EXCEL* అనే Android App లో OPEN చేసి
మీ BASICPAY ; Increment month
Select చేసి మీకు రాబోయే Arrears
మొత్తంగా ఎంత? విడతల వారీగా ఎంత? ఏ విడతలో ఎంత? అనే విషయాలు తెలుసుకోవచ్చు.
*డీఏ పెంపు ఉత్తర్వు విడుదల
*July 2018 నుంచి పెంచబడిన 3.144% కరువు భత్యం మంజూరు*
*27.248 నుంచి 30.392 కు పెరిగిన డీఏ*
*జనవరి 2021 జీతాలతో(ఫిబ్రవరీ1న) కలిపి నగదుగా చెల్లింపు..,*
*1 జూలై 2018 నుంచి 31 డిసెంబర్ 2020 వరుకు 30 నెలల బకాయిలు*
*జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికీ 3 సమ భాగాలలో పీఎఫ్ ఖాతాలలో జమ(జనవరి జీతాల తర్వాత)*
*సీపీఎస్ వారికీ 30 నెలల ఆరియర్స్ 90% నగదు + 10% ప్రాన్ అకౌంట్ కు, 3 సమ భాగాలలో జమ (జనవరి జీతాల చెల్లింపు తర్వాత)*
» 2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి..
» 2019 జూలై డీఏ 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ.
*As per GO.Ms.No.94,Dated :04.11.2020 ,DA Arrears from July 2018 to December 2020 adjust to ZPPF & Cash paid from January 2021*
D.A @30.392% from 1.7.2018 G.ONo 90 Relsd
జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లిస్తారు.
జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లిస్తారు.
జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లిస్తారు
🔹 *జులై 2018
01/07/2018-31/12/2018*
*DA-3.144%*
*2021 జనవరి జీతంతో 3 వాయిదాలలో చెల్లించాలని నిర్ణయం*
🔸 *జనవరి 2019*
*01/01/2019-31/06/2019*
*DA-4.716%*
*2021 జులై వేతనంతో 3 వాయిదాలలో*
♦️ *జులై-2019*
*01/7/2019-31/12/2019*
*DA-7.860%*
*2022 జనవరి జీతంతో 5 వాయిదాలలో.*
2020 జనవరి నుంచి రావాల్సిన DAను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
కావున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 3 DA లు
1.7.2018,
1.1.2019,
1.7.2019, పెండింగ్ ఉన్నాయి.
3 పెండింగ్ DAలలో
ఒక DAను జనవరి 2021 నుంచి
రెండో DAను జూలై, 2021 నుంచి
మూడో DAను జనవరి 2022 నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అలాగే కరోనా కారణంగా వాయిదా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెల సగం జీతాలను 5 విడతల్లో చెల్లిస్తారు.
మొదటి విడత 2020 నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 DAలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటననలో తెలిపారు.
ఉద్యోగులకు 5 బకాయిలు చెల్లించాల్సి ఉండగా 3 డీఏల కి గ్రీన్ సిగ్నల్.
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ(కరువు భత్యం)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది.
దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించగా.. దీని ద్వారా 2074 కోట్ల అదనపు భారం పడనుంది.
జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. ఇక మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 3802 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
మొదటి డీఏ బకాయిలను జీపీఎస్‌లో 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో జమ చేయాలని ఆదేశించారు.
సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
ప్రస్తుతం 10th PRC లో DA వివరాలు*
1-8-2019 నాటికి పొందుతున్నవి:-
1-7-2013 నుండి 0%
1-1-2014 నుండి 05.240%
1-7-2014 నుండి 08.908%
1-1-2015 నుండి 12.052%
1-7-2015 నుండి 15.196%
1-1-2016 నుండి 18.340%
1-7-2016 నుండి 22.008%
1-1-2017 నుండి 24.104%
1-7-2017 నుండి 25.676%
1-1-2018 నుండి 27.248%
ఇంకనూ రావలసిన బకాయిలు:-
1-1-2019 నుండి 35.108%
1-7-2019 నుండి 42.968%.
DA బకాయి మొత్తం
42.968(-)27.248=15.720%
ఉద్యోగుల హితార్ధం జారీ చేయడమైనది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన DA రేట్లను అనుసరించి….*రాష్ట్రంలో ఉద్యోగుల కు రావలసిన DA బకాయిలు:
*01- 07-2018* _*3.144% (2%)*_
01- 01-2019:* _*4.716% (3%)*_
*01- 07-2019* _*7.860% (5%)*_
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే DA:
Central 1% = 1.572% for state
*5 x 1.572% = 7.860% వస్తుంది.
మొత్తం బకాయిలు 15.72%..
రెండు పి.ఆర్.సి ల కాలం ఆలస్యం*
*◙ సకాలంలో అమలు కాని వేతన సవరణలు*
*◙ 11వ వేతన సవరణ కమిషన్ కు మళ్లీ గడువు పెంపు*
*◙ ఉద్యోగుల్లో చర్చోపచర్చలు…*
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు 11వ వేతన సవరణ నివేదిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతోంది.
మరోసారి వేతన సవరణ కమిషన్ గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేవలం మరో 15 రోజులు మాత్రమే గడువు పెంచారు.
ఈ లోపు కమిషన్ తన నివేదికను సమర్పిస్తుందా అన్నది సందేహమే.
అసలే కరోనా కాలం కావడంతో రాష్ర్ట ఆదాయాలు తగ్గి ఉద్యోగ సంఘాలు సైతం గట్టిగా ఒత్తిడి చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో ఉద్యోగుల్లో పీఆర్సీల పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉద్యమాల వల్ల పీఆర్సీ కమిషన్ల నియామకం జరిగినా వాటి నివేదికల సమర్పణ, అమలు ఆలస్యమవుతూ వస్తోంది.. ఇంతవరకు ఏపీలో 11 కమిషన్లు ఏర్పాటయ్యాయి.
1969లో తొలి వేతన సవరణ సంఘం ఏర్పడింది.
వేతన సవరణ పేరిట కరవు భత్యం పే స్కేలులో కలుపుతూ తదనుగుణంగా స్కేళ్లు మారుస్తూ, ఇతర డిమాండ్ల పైనా కమిషన్లు సిఫార్సులు చేస్తున్నాయి. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలనేది సూత్రం.
ప్రస్తుతం ఆలస్యమవుతున్నట్లే వివిధ కారణాల వల్ల వేతన సవరణ సంఘాల ఏర్పాటు , నివేదికల అమలు వంటి వాటిలో ఆలస్యం వల్ల ఈ అయిదేళ్ల కాలపరిమితి మారుతూ వస్తోంది. ఒక్కోసారి 8 నుంచి 9 ఏళ్ల ఆలస్యం అయిన సందర్భాలూ ఉన్నాయి.
ఇలా ఆలస్యాల వల్ల ఇంతవరకు రెండు పీఆర్సీలు కోల్పోయామని ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు.
పదవీవిరమణ అనంతర ప్రయోజనాలకు నష్టం పీఆర్సీ ఆలస్యం కారణంగా అధిక శాతం ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ప్రయోజనం పొందలేక పోతున్నారు.
ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు పదో పీఆర్సీ 2013 జులై ఒకటి నుంచి అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి అమలు చేసింది. 2013 జులై ఒకటి నుంచి 2014 మే 30 వరకు 11 నెలల కాలంలో పదవీవిరమణ చేసిన వారికి పీఆర్సీ అమలు కాలేదు.
వారందరికీ 2014 జూన్ రెండు నుంచి ఆర్థిక ప్రయోజనం అమల్లోకి వచ్చింది. ఇలా ప్రతి పీఆర్సీ సమయంలోను పదవీవిరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలుగుతోంది. 2018 నుంచి అమలు కావాల్సిన 11వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.
► *ఇప్పటి వరకు వేతన సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది*
🔴 *1వ పి.ఆర్.సి1969*
◙ అమలు తేది : 19.3.1969
◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి
◙ నష్టపోయిన కాలం : 12 నెలలు
🔴 *2వ పి.ఆర్.సి 1974*
◙ అమలు తేది: 1.1.1974
◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి
◙ నష్టపోయిన కాలం : 16 నెలలు
🔴 *3వ.పి.ఆర్.సి. 1978:*
◙ అమలు తేది: 1.4.1978
◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి
◙ నష్టపోయిన కాలం : 11 నెలలు
🔴 *4వ.పిఆర్.సి 1982 రీగ్రూపు స్కేల్స్*
◙ అమలు తేది : 1.12.1982
◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి
🔴 *5వ పి.ఆర్.సి. 1986:*
◙ అమలు తేది : 1.7.1986
◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి
◙ ఫిట్ మెంట్ ప్రయోజనం : 10శాత
🔴 *6వ. పి.ఆర్.సి.1993:*
◙ అమలు తేది: 1.7.1992
◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి
◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994
◙ నష్టపోయిన కాలం : 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం
🔴 *7వ. పి.ఆర్.సి. 1999*
◙ అమలు తేది: 1.7.1998
◙ ఆర్థిక లాభం : 1.4.1999
◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999
◙ నష్టపోయిన కాలం: 9 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం
🔴 *8వ. పి.ఆర్.సి 2005*
◙ అమలు తేది: 1.7.2003
◙ ఆర్థిక లాభం: 1.4.2005
◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005
◙ నష్టపోయిన కాలం: 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం
🔴 *9వ.పి.ఆర్.సి. 2010*
◙ అమలు తేది: 1.7.2008
◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010
◙ నష్టపోయిన కాలం: 19 నెలలు
◙ ఫిట్మెంట్: 39 %
◙ EHS(పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరని ఉద్యోగుల ఆరోగ్య కార్డులు)
🔴 *10వ. పి.ఆర్.సి 2015:*
◙ అమలు తేది : 1.7.2013
◙ ఆర్థిక లాభం: 2.6.2014
◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014
◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %
◙ వయోపరిమితి (పదవీ విరమణకు) 60సం.కు పెంపు
🔴 *11వ.పి.ఆర్.సి. 2020:*
◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018
◙ గడచిన కాలం : 2సం.2నెలలు
◙ ప్రస్తుత పరిస్థితి- నివేదిక రావాల్సి ఉంది. మళ్లీ కమిషన్ గడువు పెంపు