స్కాలర్‌షిప్ ద్వారా ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఎలా పొందాలో తెలుసుకోండి.
దరఖాస్తుకు చివరి తేది: 31.12.2020.
ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు శుభవార్త. భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 స్కీమ్ ప్రకటించింది.
ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 కి దరఖాస్తు చేయొచ్చు.
ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసీ స్కాలర్‌షిప్ లక్ష్యం.
భారతదేశంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్నవారు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు.
ఐటీఐలో టెక్నికల్, వొకేషనల్ కోర్సులు చదివేవారు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీ. మరి ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్హతల వివరాలు చూస్తే 2019-20 విద్యాసంవత్సరంలో 12వ తరగతి లేదా ఇంటర్, 10వతరగతి పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,00,000 దాటకూడదు.
మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేవారు ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయొచ్చు.
ఎల్ఐసీ ఇచ్చే స్కాలర్‌షిప్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం మాత్రమే. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. కోర్సు పూర్తి చేసే వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేందుకు ప్రతీ ఏడాది రూ.20,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇక అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ అందిస్తోంది ఎల్ఐసీ.
10వ తరగతి పాసైన అమ్మాయిలు 10+2 చదివేందుకు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు.
10వ తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కుటుంబ వార్షికాదాయం రూ.2,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. 10+2 చదివేందుకు ప్రతీ ఏటా రూ.10,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎంపికైన విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులతో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విద్యార్థులు 50 శాతం మార్కులతో కోర్సు పూర్తి చేయాలి.
కోర్సులో ఫెయిల్ అయితే స్కాలర్‌షిప్ నిలిపివేస్తారు.
విద్యార్థులకు స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే వారి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటి వివరాలను తీసుకుంటుంది ఎల్ఐసీ.
సదరు విద్యార్థి పేరు మీద ఉన్న క్యాన్సిల్డ్ చెక్ తప్పనిసరి.
ఎల్ఐసీ-గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం 2020 మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 1) దేశవ్యాప్తంగా ఎల్ఐసీ డివిజనల్ సెంటర్ ఒక్కోదానికి 20 చొప్పున రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు(బాలురు-10, బాలికలు-10). 2) ప్రతి ఎల్ఐసీ డివిజన్ పరిధిలో కేవలం బాలికలకు 10 ప్రత్యేక స్కాలర్‌షిప్స్ (పదోతరగతి పూర్తి చేసిన వారికి). అర్హత: * 2019-20 విద్యాసంవత్సరంలో కనీసం 60% మార్కులతో పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. * పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఒకేషనల్/ ఐటీఐ సంబంధిత కోర్సులు చదువుతూ ఉండాలి. * ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా/ తత్సమాన ఉన్నత విద్య చదువుతూ ఉండాలి.