6వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, 8వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చేందుకు వారి రికార్డు షీటు, బదిలీ సర్టిఫికెటు అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు విధిగా అందించాలి.
► విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు షీటు, బదిలీ సర్టిఫికెట్ల విషయంలో నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి .
ఒకవేళ విద్యార్థి రికార్డు షీటు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే ఆ తదుపరి కాలక్రమంలో వాటిని సమర్పించమనాలి.
► వలస వెళ్లిన కుటుంబాల పిల్లలు, తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో ఐడెంటిటీ నిరూపణ తప్ప మరే విధమైన ధ్రువపత్రాలూ అవసరం లేదు.
ప్రవేశాలు పూర్తి కాగానే ఎప్పటికప్పుడు నిర్దేశించిన చైల్డ్ ఇన్ఫో పోర్టల్‌లో నమోదు చేస్తుండాలి.
► అన్ని యాజమాన్యాల స్కూళ్లు ఈ మార్గదర్శకాలను పాటించాలి.
► పాఠశాలలు తెరుచుకోనందున విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఒక వాట్సాప్ గ్రూపును రూపొందించి రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల మూల్యాంకనం, ప్రగతికి సంబంధించిన విషయాలు సమీక్షించుకోవాలి.